1. రాష్ట్రంలో కరోనా..
రాష్ట్రంలో మరో 2,239 కరోనా కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 1,83,866కు చేరింది. వైరస్‌తో కొత్తగా 11 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1,091కి పెరిగింది. తాజాగా కొవిడ్ నుంచి 2,281 మంది బాధితులు కోలుకోగా... రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,52,441 మంది బాధితులు కరోనా నుంచి బయటపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. తడిసిన నగరం
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నాళాలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలకు నీరు చేరి ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీటిని మళ్లించేందుకు జీహెచ్ఎంసీ సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. మంచితనానికి మరణం లేదు
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై సంతాపం వ్యక్తం చేశారు నటుడు సాయి కుమార్. మరణం మనిషికే కానీ మంచితనానికి రాదు అని అన్నారు. మీరూ, మీ పాట, మీ మాట చిరస్మరణీయం అని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. 59 లక్షలు దాటాయి..
దేశంలో కరోనా కేసుల సంఖ్య 59 లక్షలు దాటింది. కొత్తగా 85,362 మందికి పాజిటివ్‌గా తేలింది. మరో 1,089 మంది వైరస్‌కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మిలియన్‌కు దగ్గర్లో..
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. రోజూ లక్షలాది మంది వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కేసుల సంఖ్య 3.27 కోట్లకు చేరువైంది. వైరస్ ధాటికి 9.93 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. డ్రాగన్‌ను నిలువరించాల్సిందే..
చైనా వైఖరిని చూసి.. ఆ దేశానికి చెందిన పలు యాప్‌లపై ఇటీవల నిషేధం విధించింది కేంద్రం. అంతకముందే టిక్‌టాక్ సహా మరికొన్నింటిపై వేటు వేసింది. మన దేశంలో అన్ని ప్రదేశాలకూ వ్యాపించి లాభాలను అర్జిస్తోన్న చైనా కంపెనీలకు కేంద్ర నిర్ణయం పెద్ద దెబ్బే. తమ దేశంలో ప్రజాభిప్రాయాన్ని తొక్కిపెట్టిన ఆ దేశం.. ఇతర దేశాలకు మాత్రం యాప్‌లను ఎరగా వేస్తూ సమాచారాన్ని సులభంగా తస్కరిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. ట్రంప్ హామీలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు. కరోనా సమయంలోనూ విస్తృతంగా పర్యటిస్తున్నారు. అమెరికన్లతో పాటు ఇతర సమాజాల ఓటర్లను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో అట్లాంటా, జార్జియా రాష్ట్రాల్లోని నల్లజాతీయులు, హిస్సానిక్ ఓటర్ల కోసం ప్రత్యేక హామీలు గుప్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. నేనేం అనలేదు..
కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు. కామెంటరీ బాక్స్‌లో ఉన్న గావస్కర్.. కోహ్లీ భార్య అనుష్కపై కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మండిపడింది అనుష్క. తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు గావస్కర్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. ఎందుకు ఓడిపోయామంటే..
దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది చెన్నై సూపర్ కింగ్స్. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన సీఎస్కే సారథి ధోనీ.. రాయుడు లేకపోవడం వల్లనే ఓటమి పాలవుతున్నామని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. దీపిక హాజరు
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతికి సంబంధించిన డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. శనివారం విచారణ నిమిత్తం నటి దీపికా పదుకొణె ఎన్సీబీ కార్యాలయానికి వచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.