ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్​ @11am

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

topten news @11am
టాప్​టెన్​ న్యూస్​ @11am
author img

By

Published : Sep 21, 2020, 10:55 AM IST

1. రాష్ట్రంలో కరోనా..

రాష్ట్రంలో కొత్తగా 1302 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1,72,608కి చేరింది. కొవిడ్​​తో కొత్తగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 1042కు పెరిగింది. 2,230 మంది వైరస్​ నుంచి బయటపడగా.. ఇప్పటి వరకు మొత్తం 1,41,930 మంది బాధితులు కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. సభ నుంచి సస్పెండ్

రాజ్యసభలో కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సభలో చేసిన ఆందోళనపై ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభలో అనుచితంగా ప్రవర్తించిన 8 మందిని సభ ముగిసే వరకూ సస్పెండ్‌ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. మహా విజృంభణ..

దేశంలో కరోనా వ్యాప్తి ఉగ్రరూపం దాల్చుతుంది. కొత్తగా 86,961 మంది వైరస్​ బారిన పడ్డారు. మరో 1,130 మంది కొవిడ్​కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. హస్తం దూకుడు..

తెలంగాణలో రాబోయే నగరపాలక, దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్‌ దూకుడు పెంచుతోంది. పార్టీని బలోపేతం చేసే దిశలో అధిష్ఠానం పావులు కదుపుతోంది. రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జిగా నియమితులైన మానిక్కం ఠాకూర్‌ జూమ్‌ యాప్‌ ద్వారా తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులతో వరుసగా సమావేశమవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. తెరాస ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి... ఓటర్లలో చైతన్యం తీసుకొస్తే... వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే అధికారమని స్పష్టం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మహిళ అరెస్టు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​పై విష ప్రయోగం కేసులో ఓ మహిళను అరెస్టు చేశారు పోలీసులు. పార్శిల్ కెనడా నుంచి వచ్చినట్లు గుర్తించిన పోలీసులు... దాని ఆధారంగా విచారణ జరిపి, ఓ మహిళే నిందితురాలని తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. అమెరికా-తాలిబాన్లు

నవంబర్‌లో జరిగే అమెరికా ఎన్నికలు దగ్గరపడేకొద్దీ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్‌ ప్రచారాస్త్రాలకు పదునుపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఇచ్చిన మాటను కొంతమేరకు నిలబెట్టుకున్నా, మరో అవకాశం ఇవ్వండి పని పూర్తిచేసి చూపిస్తానని ఓటర్లను అడగనున్నారు. ఫలితంగా అఫ్గాన్‌ ప్రభుత్వం బిక్కుబిక్కుమంటూనే తాలిబన్లతో చర్చలకు సిద్ధపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. సానుకూలంగా మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు సోమవారం సానుకూలంగా స్పందిస్తున్నాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 20 పాయింట్లకుపైగా లాభంతో 38,868 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ దాదాపు 20 పాయింట్ల స్వల్ప లాభంతో 11,523 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. చాలా బాధగా ఉంది.

ఒక బయోబబుల్​ వాతావరణంలో​ నుంచి మరొక బుడగలోకి అడుగుపెట్టడం పెద్ద సవాల్​ లాంటిదని అభిప్రాయపడ్డాడు సన్​రైజర్స్​ హైదరాబాద్​ కెప్టెన్ డేవిడ్ వార్నర్. కుటుంబసభ్యులు తన పక్కన లేకపోవడం చాలా బాధగా ఉందని చెప్పాడు. ఈ ఐపీఎల్​లో తమ జట్టు​ రాణించగలదని ధీమా వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. కొంపముంచిన అంపైర్

ఐపీఎల్ రెండో మ్యాచ్​లో భాగంగా దిల్లీ క్యాపిటల్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య పోరు రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్​ సూపర్ ఓవర్​కు దారితీయగా ఉత్కంఠ పోరులో దిల్లీ విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్​లో అంపైర్ నిర్ణయం వల్లే పంజాబ్ ఓటమి పాలైందని క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. ఎన్టీఆర్​-రమ్యకృష్ణ

త్వరలో త్రివిక్రమ్​-జూనియర్ ఎన్టీఆర్​ కాంబోలో తెరకెక్కబోయే చిత్రంలో రమ్యకృష్ణ నటించనుందని టాక్​. ఇప్పటికే చిత్రబృందం ఆమెతో చర్చలు జరపగా.. గ్రీన్​సిగ్నల్​ ఇచ్చినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.