1. ఒక్క బుల్లెట్ పేలినా... యుద్ధమే!
భారత్- చైనా మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై లెఫ్టినెంట్ జనరల్ (విశ్రాంత) బి. జైశ్వాల్ స్పందించారు. సరిహద్దులో ఒక్క బుల్లెట్ పేలినా.. అది యుద్ధానికే దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. ఆయనతో 'ఈటీవీ భారత్' జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ మీకోసం.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. దేశంలో కరోనా ఉద్ధృతి
దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా దేశవ్యాప్తంగా 14,933 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. 312 మంది కరోనా కాటుకు బలయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. నేర చట్టాల్లో భారీ సంస్కరణలు
పలు చట్టాల్లో నేరంగా పరిగణించే నిబంధనలను తొలగించాలని కేంద్రం యోచిస్తోంది. అనేక ఇతర మార్పుల మాదిరిగానే కొవిడ్‌ను కూడా ఇందుకు ఒక కారణంగా చెబుతోంది. ఇందుకోసం ఇప్పటికే సూచనలు ఇవ్వాలని ప్రజలను కోరింది. అసలు ఈ వ్యవహారంపై ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటి?. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. వెచ్చటి నీటితో.. కరోనాకు చెక్!
కరోనా వైరస్ మన ఒంట్లోకి ప్రవేశించినా వెచ్చటి నీళ్లు తాగితే అది పొట్టలోకి వెళ్లిపోతుందని, జబ్బురాదని కొంతమంది భావిస్తున్నారు. ఇంది ఎంతవరకు నిజం..? ఈ కథనం చదవండి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. మరణాలకు చైనాదే బాధ్యత
కరోనా వైరస్ అంశంపై మరోమారు చైనాను లక్ష్యంగా చేసుకొని విమర్శలు గుప్పించింది శ్వేతసౌధం. వైరస్ మరణాలకు చైనాదే పూర్తి బాధ్యత అని చెప్పడానికి అధ్యక్షుడు ట్రంప్ ఎప్పుడూ చింతించరని పేర్కొంది. అదే సమయంలో ట్రంప్ చేసిన 'కుంగ్ ఫ్లూ' ఆరోపణలు జాతి వివక్ష వ్యాఖ్యలు కాదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6. పెట్రో మోత..
పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. వరుసగా 17వ రోజూ లీటర్ పెట్రోల్ ధర 20 పైసల వరకు పెరిగింది. డీజిల్ ధర లీటర్‌కు 50 పైసలకు పైనే పెంచాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. తాజా పెంపుతో మంగళవారం ప్రధాన నరగాల్లో పెట్రో ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7. లాక్‌డౌన్‌తో ప్రతిభకు మెరుగు
లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన క్రీడాకారులకు సాధన చేసే అవకాశమే లేకుండా పోయింది. కానీ చదరంగ క్రీడాకారులు మాత్రం భిన్నం. ఇళ్లలోనే ఉంటూ ఆన్లైన్లో తమ ప్రతిభకు సాన పెడుతున్నారు యువ గ్రాండ్‌మాస్టర్లు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8. చాలా మిస్సవుతున్నా..
ఓ మ్యాచ్‌లో టీమ్ఇండియా మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ తనతో అన్న మాటలను గుర్తు చేసుకున్నాడు పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్. ఇరు జట్ల మధ్య స్నేహం, క్రికెట్ వైరాన్ని మిస్ అవుతున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9. న్యూ హెయిర్ స్టైల్
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ కొత్త హెయిర్ స్టైల్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఈ ఫొటోను ఆయన తనయ ఇరా ఖాన్ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10. ధనుష్ కసరత్తులు
'మారి 2' చిత్రం కోసం తమిళ నటుడు ధనుష్ చేసిన కసరత్తుల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. సాయి పల్లవి కథానాయికగా నటించిన ఈ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.