ETV Bharat / city

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

Top ten news today
ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు
author img

By

Published : Aug 4, 2021, 5:58 AM IST

Updated : Aug 4, 2021, 9:58 PM IST

21:52 August 04

టాప్​ న్యూస్​ @10PM

టాప్​ న్యూస్​ @10PM 

  •  'అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు'

జీహెచ్​ఎంసీ పరిధిలో అక్రమనిర్మాణాలపై హైకోర్టు విచారణ జరిపింది. కోర్టు స్టేలు ఎత్తివేయాలని జీహెచ్ఎంసీ ఎందుకు కోరడం లేదన్న హైకోర్టు... అక్రమ నిర్మాణం పూర్తయ్యే వరకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. కొందరు ఓయూ భూములను ఆక్రమిస్తున్నారంటూ విద్యార్థి పి.రమణరావు రాసిన లేఖపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది ఉస్మానియా విశ్వవిద్యాలయం భూముల కబ్జాపై దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.

  • కరోనా పంజా

కేరళలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. కొత్తగా 22,414 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 108 మంది ప్రాణాలు కోల్పోయారు. మహారాష్ట్రలో ఒక్కరోజే 6వేల కరోనా కేసులు నమోదయ్యాయి.

  • బూస్టర్​ డోస్​పై మారటోరియం

గత వారం రోజుల్లో కొత్తగా 40 లక్షల మందికి కరోనా వైరస్(Corona Virus)​ సోకినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియా, ఆసియా దేశాల్లో వైరస్​ ఉద్ధృతి అధికంగా ఉన్నట్లు హెచ్చరించింది. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్(Delta Variant)​.. 130 దేశాలకు పాకినట్లు తెలిపింది. మరోవైపు, పేద దేశాలకు టీకా(Covid-19 vaccine) అందించేందుకు బూస్టర్​ డోస్​పై(Booster dose) మారటోరియం విధించాలని కోరారు టెడ్రోస్​ అధనోమ్​.

  • బుమ్రా, రూట్ రికార్డులు

భారత్​-ఇంగ్లాండ్​ తొలి టెస్టులో టీ విరామ సమయానికి రూట్​సేన 4 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. టీమ్ఇండియా బౌలర్లలో షమి 2, బుమ్రా, సిరాజ్​ తలో వికెట్ తీసుకున్నారు. క్రీజులో రూట్​ ఉన్నాడు.

  • సినిమా అప్​డేట్స్​ 

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో వివాహ భోజనంబు, గని, మాస్ట్రో,మహాసముద్రం, నాగార్జున కొత్త చిత్రానికి సంబంధించిన సంగతులు ఉన్నాయి.

20:41 August 04

టాప్​ న్యూస్​ @9PM

టాప్​ న్యూస్​ @9PM 

  • పరిశీలన వాయిదా

కృష్ణానది యాజమాన్య బోర్డు  (కేఆర్‌ఎంబీ) రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన వాయిదా పడింది. ఎన్జీటీ ఆదేశాల నేపథ్యంలో పర్యటన వాయిదా పడిందని అధికారులు వెల్లడించారు. పథకం పరిశీలన తేదీని తర్వాత వెల్లడిస్తామని కేఆర్‌ఎంబీ తెలిపింది.

  • ఆ నది ఉగ్రరూపం

మధ్యప్రదేశ్​లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. చంబల్​, క్వారీ నదులు ఉప్పొంగి ప్రవాహిస్తుండటం వల్ల పలు గ్రామాలు జలమయమయ్యాయి. 1,200కు పైగా గ్రామాలు వరదల వల్ల ప్రభావితమయ్యాయి. దాదాపు 6,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

  • వ్యాక్సిన్​తో లాభాలు

కరోనా టీకా తీసుకుంటే వైరస్‌ ముప్పు 3 రెట్లు తగ్గుతుందని తాజా పరిశోధనలో వెల్లడైంది. డెల్టా వేరియంట్‌ వంటి కొత్త రకాల నుంచి టీకా ద్వారా రక్షణ పొందవచ్చని బ్రిటన్‌ పరిశోధకులు తేల్చారు.

  • ధనుష్​కు జోడీగా రాశీఖన్నా

హీరో ధనుష్​తో కలిసి పనిచేసే అవకాశం దక్కించుకుంది ముద్దుగుమ్మ రాశీఖన్నా. ఇందులో ఆమెతో పాటు నిత్యామేనన్, ప్రకాశ్​రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

  • సెమీస్​ గండం

ఒలింపిక్స్​లో మన బృందానికి బుధవారం మిశ్రమ ఫలితాలు వచ్చాయి. రెజ్లింగ్​లో రవికుమార్​ ఫైనల్, జావెలిన్​ త్రోలో నీరజ్​ చోప్రా ఫైనల్​కు​ దూసుకెళ్లారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న మహిళల హాకీ జట్టు ఫైనల్​ చేరలేకపోయింది. లవ్లీనా ఈ క్రీడల్లో పతకం సాధించిన మూడో బాక్సర్​గా రికార్డు సృష్టించింది.

19:48 August 04

టాప్​ న్యూస్​ @8PM

టాప్​ న్యూస్​ @8PM 

  • కేంద్ర గెజిట్​పై చర్చ 

ఈనెల 9న గోదావరి నదీ యాజమాన్య బోర్డు అత్యవసరంగా భేటీ కానుంది. హైదరాబాద్​లోని జలసౌధలో కేంద్ర గెజిట్​పై బోర్డు చర్చించనుంది. 

  • భాజపాకే అత్యధికం

భారతీయ జనతా పార్టీకి 2019-20 ఆర్థిక ఏడాదిలో భారీగా విరాళాలు అందాయి. అవి, కాంగ్రెస్​, టీఎంసీ, ఎన్​సీపీ, సీపీఐ, సీపీఎం మొత్తం విరాళాలతో పోల్చితే మూడు రెట్లుగా ఉండటం గమనార్హం. ఈ మేరకు జాతీయ పార్టీల విరాళాలపై నివేదిక విడుదల చేసింది అసోసియేషన్​ ఫర్​ డెమొక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్​).

  • ఇజ్రాయెల్​పై రాకెట్​ దాడులు 

ఇజ్రాయెల్​లో రాకెట్ దాడులు కలకలం రేపాయి. లెబనాన్ నుంచి మూడు రాకెట్లు తమ దేశంపై ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఇందుకు ప్రతీకారంగా ఆర్టిలరీ ఆయుధాలతో దాడులు జరిపినట్లు వెల్లడించింది.

  • అరంగేట్రంలోనే అదరహో!

ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరమైన ఒలింపిక్స్‌లో(Olympics) ఆడటం ప్రతి అథ్లెట్‌ కల. అలాంటిది అరంగేట్రంలోనే కాంస్య పతకంతో సత్తా చాటింది 23 ఏళ్ల యువ బాక్సర్‌ లవ్లీనా బొర్గోహెన్‌(Lovlina Borgohain). పోటీలకు ముందు అనుకోకుండా కరోనా మహమ్మారి బారిన పడి కొంతకాలం పాటు శిక్షణకు దూరమైన ఆమె.. ఆత్మస్థైర్యంతో పోటీల్లో అడుగుపెట్టింది. సెమీస్‌లో ఓడినా ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చింది. 

  • సినిమా అప్​డేట్స్​

వరుణ్​ సందేశ్ 'ఇందువదన' టీజర్, 'వరుడు కావలెను' చిత్రంలోని 'దిగు దిగు నాగన్న' పాట.. ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. వాటిని మీరు కూడా చూసేయండి.

18:41 August 04

టాప్​ న్యూస్​ @7PM

టాప్​ న్యూస్​ @7PM 

  • మెట్రో ల్యాండ్స్​ ఫర్​ సేల్​

హైదరాబాద్​లో మరోసారి ప్రభుత్వానికి సంబంధించిన భూములను విక్రయించనున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్​ కార్పొరేషన్​కు.. సర్కారు ఇచ్చిన భూమిలో కొంత స్థలాన్ని లే అవుట్​ వేసి విక్రయించాలని.. మెట్రో అధికారులు నిర్ణయించారు. నగరంలోని ఉప్పల్‌ భగాయత్‌లోని భూముల లేఅవుట్​ పనులను మెట్రో రైలు సంస్థ ముమ్మరం చేసింది. ఇప్పటికే రహదారులకు సంబంధించి మార్కింగ్‌ను గుర్తించిన అధికారులు.. ఆరు నెలల్లో 20 ఎకరాల్లో లేఅవుట్‌ వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 

  • కేరళ 'కొత్త వ్యూహం'

కేరళలో గత కొద్ది రోజులుగా రోజుకు 20వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. దేశం మొత్తం నమోదవుతున్న కేసుల్లో సగం అక్కడే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ క్రమంలో వైరస్​ కట్టడికి కొత్త వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించింది కేరళ. కొత్త మార్గదర్శకాలు ఆగస్టు 5 ఉదయం 12 గంటల నుంచి అమలులోకి రానున్నాయి.

  • అప్రమత్తత రక్ష!

దేశంలో కరోనా థర్డ్​వేవ్​పై నిపుణులు కీలక వ్యాఖ్యలు చేశారు. మూడోవేవ్ వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే.. రెండో వేవ్ స్థాయిలో ఉంటుందా? అంతకన్నా ప్రమాదకర పరిస్థితులను తీసుకొస్తుందా? అనే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

  • వాట్సాప్​ కొత్త ఫీచర్​

ప్రముఖ మెసేజింగ్ వాట్సాప్ సరికొత్త ఫీచర్​ను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది​. ఇంతకీ అదేంటి? దాని వల్ల ఉపయోగమేంటి?

  • పసిడి ఆశలు గల్లంతు

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించే అవకాశాన్ని భారత మహిళల హాకీ జట్టు చేజార్చుకుంది. సెమీఫైనల్​లో భారత అమ్మాయిలు ప్రపంచ నంబర్‌వన్‌ టీమ్​ అర్జెంటీనాపై పోరాడి ఓడారు. కీలకమైన సెమీస్‌లో రాణి రాంపాల్‌ సేన 1-2 తేడాతో ఓటమి పాలైంది. ఆఖరి నిమిషం వరకు విజయం కోసం ప్రయత్నించినా.. ప్రత్యర్థి జట్టు తమ అనుభవంతో ఆ ప్రయత్నాలను అడ్డుకొంది.

17:43 August 04

టాప్​ న్యూస్​ @6PM

టాప్​ న్యూస్​ @6PM 

  • వారికి రేపట్నుంచి దళితబంధు

ప్రభుత్వాలు పథకాలు తెచ్చినా... వాటిపై ప్రజల్లో అవగాహన కొరవడిందని సీఎం కేసీఆర్​ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో సీఎం కేసీఆర్​ పర్యటించారు. వాసాలమర్రిలోని 76 ఎస్సీ కుటుంబాలకు రేపట్నుంచి దళితబంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్​ ప్రకటించారు.

  • ఎంతో గర్వంగా ఉంది.. 

దేశానికి పతకం అందించడం ఎంతో గర్వంగా ఉందని ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత పీవీ సింధు అన్నారు. భవిష్యత్​లో మరెన్నో విజయాలు సాధిస్తానని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అందరి ప్రోత్సాహం వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆమె స్పష్టం చేశారు.

  • పోటీలో పలుపేర్లు 

హుజూరాబాద్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై గులాబీ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. క్షేత్రస్థాయిలో పలు నివేదికలు తెప్పించుకుకొని... వివిధ సామాజిక, రాజకీయ కోణాల్లో విశ్లేషిస్తూ కసరత్తు చేస్తోంది. ఈటల రాజేందర్​పై పోటీగా బీసీ ఉద్యమ నేతనే బరిలోకి దించాలని భావిస్తున్న పార్టీ నాయకత్వం... తెరాస విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్​యాదవ్ పట్ల మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల తెరాసలో చేరిన మాజీ మంత్రులు ఎల్. రమణ, పెద్దిరెడ్డితో పాటు స్వర్గం రవి, కృష్ణమోహన్ తదితరు పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

  • మరణాలపై కేంద్రం క్లారిటీ

కొవిడ్​ మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలపై స్పష్టత ఇచ్చింది కేంద్రం. కొన్ని కరోనా కేసులను గుర్తించలేకపోయినప్పటికీ, మరణాలను తక్కువగా నమోదు చేయడం కుదరదని పేర్కొంది. భారత్​ మరణాల రిజిస్ట్రేషన్​ వ్యవస్థలో అన్నింటినీ నమోదు చేస్తారని స్పష్టం చేసింది.

  • ఆచార్య అప్​డేట్​

స్టార్ హీరో చిరంజీవి 'ఆచార్య' కూడా రిలీజ్ రేసులోకి వచ్చేసింది. రెండు పాటల మినహా టాకీ పార్ట్​ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదల తేదీపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు.

16:38 August 04

టాప్​ న్యూస్​ @5PM

టాప్​ న్యూస్​ @5PM 

  • భారత్​కు మరో పతకం 

టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్‌ రవికుమార్‌ దహియా.. దేశానికి కనీసం మరో రజతాన్ని ఖాయం చేశాడు. ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 57 కిలోల విభాగం సెమీస్‌లో కజకిస్థాన్ రెజ్లర్‌ సనయేవ్ నురిస్లామ్‌పై నెగ్గి ఫైనల్‌లో ప్రవేశించాడు. తొలి అర్ధభాగంలో 2-1 పాయింట్ల తేడాతో దహియా ముందంజలో నిలిచాడు.

  • ప్రేమోన్మాది ఘాతుకం 

హైదరాబాద్‌ బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలోని బాపూజీ నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. యువతిపై ఓ ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు. గిరీష్ అనే వ్యక్తి యువతిని కత్తితో పొడిచి... అనంతరం తాను కూడా గాయపరుచుకున్నాడు. తనను ప్రేమించాలని...పెళ్లి చేసుకోవాలని అమ్మాయి ఇంటి వద్దకు వచ్చి కత్తితో దాడికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు.  

  • దళిత బాలికపై హత్యాచారం

దిల్లీలో దళిత చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన రాజకీయంగా దుమారం రేపుతోంది. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు వారి తరఫున పోరాడతామని కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ హామీ ఇవ్వగా.. భాజపా కౌంటర్​ ఇచ్చింది. కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాల్లోని ఘటనలపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేసింది. మరోవైపు.. బాధిత కుటుంబానికి పరిహారం ప్రకటించారు దిల్లీ సీఎం కేజ్రీవాల్​. శాంతిభద్రతల పర్యవేక్షణను పటిష్ఠం చేయాలని కేంద్రాన్ని కోరారు.

  • వీడని ప్రతిష్టంభన

గందరగోళ పరిస్థితుల మధ్యే పార్లమెంట్ ఉభయ సభల కార్యకలాపాలు కొనసాగాయి. విపక్షాల ఆందోళన నడుమ మూడు బిల్లులు రాజ్యసభ, రెండు బిల్లులు లోక్​సభ ఆమోదం పొందాయి. విపక్షాల తీరు పట్ట రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయగా.. సభ సజావుగా జరగకపోవడానికి కారణం ప్రభుత్వమేనని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి.

  • రికార్డుల పరంపర

స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో సెషన్​లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. సెన్సెక్స్ (Sensex today) 546 పాయింట్ల లాభంతో తొలిసారి 54,370 పైన స్థిరపడింది. నిఫ్టీ (Nifty today) 128 పాయింట్ల లాభంతో నూతన రికార్డు స్థాయి అయిన 16,259 మార్క్ దాటింది.

15:49 August 04

టాప్​ న్యూస్​ @4PM

టాప్​ న్యూస్​ @4PM 

  • కాలినడకన ఇంటింటికి..

యాదాద్రి జిల్లా వాసాలమర్రిలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పర్యటిస్తున్నారు. కాలినడకన ముఖ్యమంత్రి వాసాలమర్రి వీధులు చుట్టివచ్చారు. మూడు దళిత వాడలతో పాటు దత్తత గ్రామంలోని పలు వీధుల్లో పర్యటించారు. అక్కడక్కడ ఆగి కొందరి ఇళ్లల్లోని సభ్యుల సమాచారం అడిగి తెలుసుకున్నారు. తమకు ఇల్లు లేదని పలువురు విన్నవించుకోగా... పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని భరోసా ఇచ్చారు. 

  • సింధుకు ఘనస్వాగతం 

ఒలింపిక్స్​లో కాంస్య పతకం సాధించిన అనంతరం స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు హైదరాబాద్​కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయంలో ఆమెకు ఘనస్వాగతం లభించింది.

  • సర్కారు భూముల లెక్క తేల్చండి.. 

రాష్ట్రంలోని ప్రభుత్వ భూములను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టి నిర్ణీత వ్యవధిలో భూముల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేయాలని సూచించింది. ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపట్టాలని న్యాయస్థానం పేర్కొంది.

  • దీదీకి మోదీ ఫోన్​

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్​ చేసి వరద నష్టంపై వివరాలు కనుక్కున్నారు. విపత్తు నుంచి బయటపడేందుకు కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

  • బ్యాటింగ్​ ఎంచుకున్న ఇంగ్లాండ్​

టీమ్​ఇండియాతో తొలి టెస్టులో టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకుంది ఇంగ్లాండ్​. భారత జట్టు బౌలింగ్​ దాడి చేయనుంది. నాటింగ్​హామ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది.

14:39 August 04

టాప్​ న్యూస్​ @3PM

టాప్​ న్యూస్​ @3PM 

  • తెలుగు అధికారులు లేకుండా.. 

రేపు రాయలసీమ ఎత్తిపోతల పర్యటనకు కృష్ణా బోర్డు బృందం వెళ్లనుంది. ఎత్తిపోతల పథకం పనులను తనిఖీకి చేయనుంది. తెలుగు అధికారులు ఎవరూ లేకుండా పర్యటించాలని ఎన్జీటీ ఆదేశంతో బృందం పర్యటించనుంది. తెలంగాణ అధికారి ఉండకూడదని ఏపీ ప్రభుత్వం ఎన్జీటీలో పిటిషన్‌ వేసింది. 

  • మీ పవర్​ కట్​ చేస్తాం.. 

మూడు సభల్లో తన ప్రసంగమప్పుడే విద్యుత్ పోవడంపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కావాలనే తన ప్రసంగం అప్పుడు విద్యుత్ తీసేస్తున్నారని తెలిపారు.

  • సజీవ సమాధి

రాజస్థాన్​ బూందీ జిల్లాలో వర్షాల కారణంగా ఓ ఇల్లు కూలింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందారు. మరో ఇద్దరు అనేక గంటలుగా శిథిలాల కింద చిక్కుకుని ఉన్నారు.

  • పతకం వచ్చే.. ఊరికి రోడ్డు తెచ్చే.. 

బాక్సర్​ లవ్లీనా బొర్గోహెన్​కు(Lovlina Borgohain) కాంస్య పతకం ఖాయం కావడం వల్ల సంబరాలు చేసుకుంటున్న ఆమె ఊరి ప్రజలకు మరో శుభవార్త అందింది. అసోంలోని గోల్​ఘాట్​ జిల్లాలో ఉన్న బరోముథియా అనే గ్రామానికి ఇప్పుడు కొత్త రోడ్డు వేస్తున్నారు. చాలా ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురై దారుణమైన స్థితిలో ఉన్న మట్టి రోడ్డును పబ్లిక్​ వర్క్స్​ డిపార్ట్​మెంట్​ బాగుచేస్తోంది. లవ్లీనా ఒలింపిక్స్​ నుంచి తిరిగొచ్చే లోపు తారు రోడ్డు వేయనున్నారు.

  • విలన్​ ఛేంజ్​!

మహేశ్​ హీరోగా తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో మార్పు జరుగుతున్నట్టు తెలుస్తోంది​. విలన్​ పాత్రలో నటించాల్సిన అర్జున్​ స్థానంలో ఇప్పుడు మరో స్టార్​ నటుడిని ఎంపికచేసినట్టు సమాచారం.

14:23 August 04

టాప్​ న్యూస్​ @ 2PM

వాసాలమర్రిలో కేసీఆర్​

యాదాద్రి భువనగిరి జిల్లా వాసాలమర్రిలో సీఎం కేసీఆర్ పర్యటిస్తున్నారు.

మీ పవర్ కట్ చేస్తారు..!

మూడు సభల్లో తన ప్రసంగమప్పుడే విద్యత్ పోవడంపై మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కావాలనే తన ప్రసంగం అప్పుడు విద్యుత్ తీసేస్తున్నారని తెలిపారు.

యడ్డీ కుమారుడికి నిరాశ!

కర్ణాటక కొత్త మంత్రివర్గంలో 29 మందికి చోటు లభించింది. ఉప ముఖ్యమంత్రులుగా ఎవరినీ ఎంపిక చేయలేదు. మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప కుమారుడికి కేబినెట్​లో అవకాశం దక్కుతుందని భావించినా నిరాశే ఎదురైంది.

అక్టోబర్​ 24న భారత్‌- పాక్‌ మ్యాచ్

టీ20 ప్రపంచకప్​లో(T20 World Cup) భాగంగా భారత్​-పాక్​ మధ్య జరిగే మ్యాచ్​ను అక్టోబర్​ 24న జరగనుంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది.

ఇంటి వద్దే ఈసీజీ పరీక్ష!

ఈసీజీ గ్రాఫ్​ కోసం ఆస్పత్రులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా కొత్త పరికరాన్ని రూపొందించారు మహారాష్ట్రకు చెందిన నలుగురు యువకులు. ఆ పరికరాన్ని స్మార్ట్​ ఫోన్​కు అనుసంధానించి.. ఎక్కడి కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు క్షణాల్లోనే ఈసీజీ రిపోర్ట్ తీసుకోవచ్చు.

12:43 August 04

టాప్​ న్యూస్​ @ 1PM

  • వీసీలకు హైకోర్టు నోటీసులు

కాకతీయ, తెలుగు యూనివర్సిటీల ఉప కులపతులకు హైకోర్టు నోటీసులు జారీచేసింది. కేయూ, తెలుగు యూనివర్సిటీల వీసీల నియామకంపై.. విశ్రాంత ప్రిన్సిపల్ విద్యాసాగర్ దాఖలు చేసిన పిల్‌పై సీజే జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. 

  • ఉమకు బెయిల్‌ మంజూరు

ఏపీ మాజీ మంత్రి, తెదేపా సీనియర్‌ నేత దేవినేని ఉమకు బెయిల్‌ మంజూరైంది. దేవినేనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తనపై కాలనే అక్రమంగా కేసులు పెట్టారంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా... విచారణ చేపట్టిన న్యాయస్థానం ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది.

  • అండగా రాహుల్!

దిల్లీలో హత్యాచారానికి గురైన దళిత చిన్నారి కుటుంబానికి న్యాయం జరిగే వరకూ అండగా ఉంటానని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి పరామర్శించారు.

  • సేవా రంగం డీలా

వరుసగా మూడో నెలలోనూ సేవా రంగ కార్యకలాపాలు ప్రతికూలంగా నమోదయ్యాయి. ఐహెచ్​ఎస్​ మార్కిట్​ నెలవారీ నివేదిక ప్రకారం.. సేవా రంగ పీఎంఐ స్కోరు జులైలో 45.4గా ఉన్నట్లు తేలింది.

  • సందడి ఎప్పుడు?

తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల (theaters open) సందడి మొదలైంది. వరసగా సినిమాలు విడుదలవుతున్నాయి. కానీ హిందీ చిత్రసీమలో ఆ హంగామా మొదలు కాలేదు. ఒక్క అక్షయ్‌కుమార్‌ నటించిన 'బెల్‌బాటమ్‌'(Bellbottom movie) ఈ నెల 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే పలు భారీ చిత్రాలు సిద్ధంగా ఉన్నా.. విడుదలకు ముందుకు రావడం లేదు. ఎందుకు? బాలీవుడ్‌ నిర్మాతల ఆలోచనేంటి?

11:52 August 04

టాప్​ న్యూస్​ @ 12PM

  • నేను విచారణ చేపట్టను

కృష్ణా జలాల వివాదంపై ఆంధ్రప్రదేశ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను.... సుప్రీంకోర్టు మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ.... సోమవారం జరిగిన విచారణలో ఇరు రాష్ట్రాలకు సూచించారు. ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపి నిర్ణయం తెలపాలని ఆదేశించారు. అయితే... న్యాయపరంగానే పరిష్కారం కోరుకుంటున్నట్లు ప్రధాన న్యాయమూర్తికి ఏపీ తెలిపింది.

  • లవ్లీనాకు కాంస్యం

టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళా బాక్సర్​ లవ్లీనా బొర్గోహెన్ 64-69 కేజీల విభాగంలో సెమీఫైనల్​లో పరాజయం పొందింది. టర్కీకి చెందిన సుర్మేనెలి బుసేనాజ్​తో జరిగిన సెమీస్​లో ఓటమిపాలైంది. ఫలితంగా లవ్లీనాకు కాంస్యం లభించింది.

  • మోనిన్ పెట్టుబడులు రెట్టింపు..

హైదరాబాద్‌లో మోనిన్ సంస్థ పెట్టుబడులు రెట్టింపు చేయడం పట్ల మంత్రి కేటీఆర్(KTR) హర్షం వ్యక్తం చేశారు. 2018లో రూ.వంద కోట్ల పెట్టుబడితో ఒప్పందం చేసుకున్న సంస్థ ... తాజాగా మరో రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.

  • ఉభయ సభలు వాయిదా

పెగసస్​, వ్యవసాయ చట్టాలపై విపక్షాలు పట్టుబట్టడం వల్ల రాజ్యసభ, లోక్​సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. లోక్​సభ ఉదయం 11.30 గంటల వరకు, రాజ్యసభ మధ్యాహ్నం 2గంటల వరకు వాయిదా పడ్డాయి. 

  • బాలీవుడ్​లోకి మరో తెలుగు దర్శకుడు!

రాక్షసుడు మూవీ రీమేక్​తో డైరెక్టర్ రమేశ్ కుమార్ బాలీవుడ్​లో అరంగ్రేటం చేయనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ స్టార్​ అక్షయ్​ కుమార్ ఈ సినిమాలో కథానాయకునిగా నటించనున్నాడని సమాచారం.

10:48 August 04

టాప్​ న్యూస్​ @ 11AM

  • వరద తగ్గుముఖం..

ఎగువ నుంచి వస్తున్న వరదల కారణంగా శ్రీశైలం, జూరాల, నాగార్జునసాగర్​లకు ఇంకా వరదలు కొనసాగుతూనే ఉన్నాయి. కాకపోతే వరదలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. అయినప్పటికీ... అధికారులు గేట్లను ఎత్తుతూ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

  • ముప్పు ముంచుకొస్తోంది!

తొలినాళ్లలో హైదరాబాద్​లో 30-40 వేల కరోనా డోసులు ఇచ్చేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య సగానికి పడిపోయింది. ఇలానే జరిగితే మూడో దశలో ముప్పు తప్పదని ప్రజలు భావిస్తున్నారు. టీకా వేయించుకునేందుకు ప్రభుత్వ కేంద్రాల వద్దకు వెళ్తున్న వారికి... అక్కడ సిబ్బంది నుంచి సరైన సమాధానం లేదని వాపోతున్నారు.

  • డైమండ్​ కింగ్​ బంపర్​ ఆఫర్​!

భారత మహిళల హాకీ అథ్లెట్లకు శుభవార్త చెప్పారు సూరత్​కు చెందిన ఓ వజ్రాల వ్యాపారి. ఒలింపిక్స్​లో పతకం గెలిచిన అథ్లెట్లకు రూ. 11 లక్షలతో ఇళ్లు కట్టిస్తామని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్​ వేదికగా ప్రకటించారు సావ్​జీ ధోలాకియా.

  • మదేసి.. చిందేసి..

పుట్టినరోజు వేడుకలకను కాస్త భిన్నంగా జరుపుకోవాలనుకున్నారు ఆ యువకులు. ఈ వేడుకలకు మందు, విందుతో పాటు చిందులను జతచేశారు. ఇక అంతే... ఐదుగురు యువతులతో 20 మంది యువకులు మందేస్తూ చిందులేశారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్​ గుంటూరు జిల్లాలో జరిగింది.

  • బిర్యానీలో బీరు సీసా ముక్కలు!

బిర్యానీ తినేందుకు కుటుంబంతో హోటల్​కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. బిర్యానీ తింటుండగా.. సీసా ముక్క గుచ్చుకుంది. దీంతో ఆందోళన వ్యక్తం చేసిన అతను కోర్టును ఆశ్రయించగా.. పరిహారం ఇవ్వాలని హోటల్​ యజమానికి ఆదేశించింది. కేరళలో జరిగింది ఈ ఘటన.

09:52 August 04

టాప్​ న్యూస్​ @ 10AM

  • సెమీస్​కు రవిదహియా​, దీపక్​ పునియా

రెజ్లింగ్​ మెన్స్​ ఫ్రీస్టైల్​ 57 కేజీల విభాగంలో జరిగిన క్వార్టర్స్​లో బల్గేరియాకు చెందిన జార్జి వాలెంటినోవ్​ను 14-4 తేడాతో ఓడించిన భారత రెజ్లర్​ రవి దహియా సెమీఫైనల్​లో అడుగుపెట్టాడు. 

  • ఎంసెట్ పరీక్ష ప్రారంభం

రాష్ట్రవ్యాప్తంగా ఎంసెట్(EAMCET EXAM) పరీక్ష ప్రారంభమైంది. ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ పరీక్షలు జరుగుతున్నాయి. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్దన్ స్పష్టం చేశారు. విద్యార్థులు కచ్చితంగా కొవిడ్ నిబంధనలు పాటించాలన్నారు.

  • పెరిగిన తలసరి ఆదాయం, జీఎస్‌డీపీ

తెలంగాణలో జీఎస్​డీపీ, తలసరి ఆదాయంలో స్వల్పంగా వృద్ధిరేటు నమోదైంది. 2020-21కి గాను అన్ని రాష్ట్రాల జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం వివరాలనూ కేంద్ర మంత్రిత్వశాఖ ప్రకటించింది.

  • మళ్లీ పెరిగిన కరోనా కేసులు

దేశంలో కొత్తగా 42,625 కరోనా కేసులు(Covid in India) నమోదయ్యాయి. మరో 562 మంది మృతి చెందారు.

  • 54 వేల పైకి సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు బుధవారం కూడా భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 360 పాయింట్లకుపైగా పెరిగి.. తొలిసారి 54,174 వద్ద ట్రేడవుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 100 పాయింట్లకుపైగా లాభంతో జీవనకాల గరిష్ఠమైన 16,235 వద్ద కొనసాగుతోంది.

08:44 August 04

టాప్​ న్యూస్​ @ 9AM

నగరం నలుదిశలా..

మహానగరంలో నాలుగు వైపులా నాలుగు అత్యాధునిక ఆస్పత్రులు రాబోతున్నాయి. ఇందులో మూడువేల పడకలతో మూడు సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రులు, వాతావారణ కాలుష్యం వల్ల ఎదురవుతున్న రోగాలను నయం చేసే మరో ఆస్పత్రిని కూడా నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టింది. వీటికి స్థలాలను కూడా దాదాపు ఖరారు చేశారు.

ధర మారుతోంది!

వీధి చివర ఉండే చిన్న కిరాణాకొట్టులో ఓ ప్రముఖ బ్రాండ్‌ నీళ్ల సీసా లీటర్‌ ధర రూ.20 ఉంటే.. పక్కనే ఉండే రెస్టారెంట్‌లో రూ.40 ఉంటోంది. అదే ప్రముఖ హోటలైతే.. ఏకంగా 8 రెట్లు అధికంగా రూ.150 వసూలు చేస్తున్నారు. ఇలా ప్రాంతానికో ధరతో వినియోగదారుడిని దోపిడీ చేస్తున్నారు.

50% మంది కార్యాలయాలకు!

చిన్న కంపెనీల్లో ఇప్పటికే 20శాతం ఉద్యోగులు కార్యలయాలకు హాజరవుతున్నారు. ఈ సంఖ్య డిసెంబరు నాటికి ఇది 50 శాతానికి చేరుకుంటుందని హైదరాబాద్‌ సాఫ్ట్‌వేర్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అసోసియేషన్‌ (హైసియా) నిర్వహించిన 'ఫ్యూచర్‌ వర్క్‌ మోడల్స్‌' సర్వేలో తేలింది.

ఎదురుచూస్తున్నా

కోహ్లీసేనను ఎదుర్కొనేందుకు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నట్లు ఇంగ్లాండ్​ పేసర్ జేమ్స్ అండర్సన్(James Anderson) అన్నాడు. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు భారత్- ఇంగ్లాండ్​ మధ్య టెస్టు సిరీస్​ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

క్వార్టర్​ ఫైనల్​ చేరిన రవికుమార్

రెజ్లింగ్‌ 57 కిలోల విభాగంలో క్వార్టర్ ఫైనల్‌ చేరాడు రవికుమార్‌. కొలంబియా రెజ్లర్‌ అర్బనోపై 13-2 తేడాతో గెలిచాడు. 

07:42 August 04

టాప్​ న్యూస్​ @ 8AM

  • ఇద్దరు కార్మికుల మృతి

డ్రైనేజీ క్లీన్ చేయాలంటూ అర్ధరాత్రి పిలిచారు. సమస్య తీర్చేందుకని రాత్రికిరాత్రే... ఇద్దరు ఒప్పంద కార్మికులు మ్యాన్​హోల్​లోకి దిగారు. అదే వారి పాలిట యమపాశమైంది. లోపల ఊపిరాడక వారిద్దరూ చనిపోయారు. అందులో ఒకరి మృతదేహం లభ్యం కాగా... మరొకరి గురించి పోలీసులు గాలిస్తున్నారు.

  • కబళిస్తున్న క్యాన్సర్‌

తెలుగు రాష్ట్రాల్లో క్యాన్సర్ ఉగ్రరూపం దాల్చుతోంది. గత మూడేళ్లలోనే తెలంగాణలో 1.39 లక్షల కేసులు నమోదవగా... 76 వేల మరణాలు సంభవించడం ఆందోళన కల్గిస్తోంది. క్యాన్సర్ విజృంభణకు జీవనశైలే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు.

  • కీలక మార్పులు

భారతీయ అటవీ చట్టంలోని నిబంధనలు పాతబడిపోయిన కారణంగా ఐఎఫ్‌ఏను సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ 2019 ఫిబ్రవరిలో ఐఎఫ్‌ఏ ముసాయిదా సవరణను విడుదల చేసింది. దీనిపై గిరిజనుల హక్కుల బృందాలు, పర్యావరణ కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఎదురైంది.

  • ప్రతీకారేచ్ఛతో ఇంగ్లాండ్​

ఇంగ్లాండ్​తో టెస్టు సిరీస్​కు టీమ్ఇండియా సిద్ధమైంది. ఐదు టెస్టుల సిరీస్​లో భాగంగా తొలి మ్యాచ్​ బుధవారం(ఆగస్టు 4 నుంచి) ప్రారంభం కానుంది. ఈ సిరీస్​ను గెలిచి ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​-2లో శుభారంభం చేయాలని కోహ్లీ సేన భావిస్తుండగా.. భారత్​లో ఓటమికి బదులు తీర్చుకోవాలని రూట్​ సేన ఎదురుచూస్తోంది. 

  • గాడ్​ ఫాదర్​'గా మెగాస్టార్

చిరంజీవి 'లూసీఫర్' రీమేక్ ఈనెల 13 నుంచి హైదరాబాద్​లో చిత్రీకరణ మొదలు కానున్నట్లు సమాచారం. విభిన్నమైన పొలిటికల్​ యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా కోసం 'గాడ్​ ఫాదర్​' అనే టైటిల్​ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

06:53 August 04

టాప్​ న్యూస్​ @ 7AM

ఫైనల్​కు చేరిన నీరజ్ చోప్రా

పురుషుల జావెలిన్​ త్రో క్వాలిఫికేషన్​ గ్రూప్​ ఏలో నీరజ్​ చోప్రా అదరగొట్టాడు. మొదటి ప్రయత్నంలోనే ఫైనల్​కు ఎంపికయ్యాడు ఈ భారత స్టార్​ ఆటగాడు. ఈ ఒలింపిక్స్‌లో అతడు కచ్చితంగా పతకం గెలుస్తాడనే నమ్మకంతో ఉన్నారు క్రీడాభిమానులు.

విస్తరణ నేడే!

కర్ణాటక నూతన మంత్రివర్గం కొలువుదీరేందుకు ముహూర్తం సిద్ధమైంది. కేబినేట్ ఏర్పాటు అంశంపై అధిష్ఠానంతో చర్చించిన ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై.. నేడు తుది జాబితా ఖరారు అవుతుందని తెలిపారు. మంత్రివర్గ విస్తరణ రెండు దశల్లో జరుగుతుందని తెలిపారు.

అంతులేని కథ!

ప్రైవేటు రుసుముల భారానికి తట్టుకోలేని తల్లిదండ్రులెందరికో సర్కారీ బడులే ఆశాదీపాలవుతున్నాయి. ఈ మేరకు వాటిలో చిన్నారుల చేరికలు పెరిగాయని క్షేత్రస్థాయి నివేదికలు చాటుతున్నాయి. అయితే విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతులు వృద్ధి మాత్రం నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది.

క్లైమాక్స్‌ వరకు పొడిగించాం!

మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రం కొదమ సింహంపై ఆసక్తికర అనుభవాలను 'పరుచూరి పలుకులు' పేరుతో పంచుకున్నారు ప్రముఖ సినీ రచయిత, దర్శకుడు పరుచూరి గోపాలకృష్ణ. అవేంటో మీరూ తెలుసుకోండి..

మత్తువ్యసనం
 
అనేక నేరాల్లో నిందితులుగా ఉంటున్నవారిలో చాలామంది మత్తుపదార్థాలకు బానిసలవుతున్నారు. ఈ సంఖ్య క్రమేపీ పెరుగుతున్నదన్న అధ్యయన ఫలితాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఇతర ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉంటున్నారు. ఆపరేషన్‌ థియేటర్లలో వైద్యుల పర్యవేక్షణలో వాడాల్సిన మత్తు మందులను యువకులు యథేచ్ఛగా ఉపయోగిస్తున్నారు.

05:15 August 04

ఈటీవీ భారత్​ - ముఖ్యాంశాలు

నేడు వాసాలమర్రికి సీఎం

దత్తత గ్రామమైన వాసాలమర్రిని.. ముఖ్యమంత్రి మరోసారి సందర్శించనున్నారు. బుధవారం పల్లెకు చేరుకుని దళిత వాడల్లో పాదయాత్ర చేయనున్న కేసీఆర్.. గ్రామ సభలో పాల్గొంటారు. సీఎం పర్యటన దృష్ట్యా యాదాద్రి జిల్లా అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.

 పునర్విభజన అప్పుడే.!

రాజకీయ ఆశావహులకు కేంద్రం చేదువార్త వినిపించింది. 2026 తర్వాతి జనగణన అనంతరమే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ఉంటుందని పార్లమెంటులో తేల్చిచెప్పింది. ఆ అంచనాల ప్రకారం కేంద్ర హోం శాఖ ఆ లెక్కన 2039 వరకు వేచి చూడాల్సిందేనని సంకేతాలిచ్చింది. 

నేడే ఎంసెట్ 

ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మా కోర్సుల్లో ప్రవేశాల కోసం నేటి నుంచి ఎంసెట్ జరగనుంది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో సుమారు రెండున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని కన్వీనర్ ప్రొఫెసర్ గోవర్దన్ స్పష్టం చేశారు. 

నేడు నగరానికి పీవీ సింధు

తెలుగు తేజం, స్టార్ షట్లర్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత పీవీ సింధు నేడు హైదరాబాద్​కు రానున్నారు. ఉదయం 11:30 గంటలకు దిల్లీ నుంచి బయల్దేరి మధ్యాహ్నం 1:50 నిమిషాలకు శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకోనున్నారు. ఆమెకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, అభిమానులు ఘన స్వాగతం పలకనున్నారు.

పార్లమెంట్​లో అదే రగడ

పార్లమెంట్​లో మంగళవారం కూడా విపక్షాల ఆందోళనలు కొనసాగాయి. గందరగోళ పరిస్థితుల మధ్యే లోక్​సభలో రెండు, రాజ్యసభ ఓ బిల్లుకు ఆమోదముద్ర పడింది. అనంతరం బుధవారానికి వాయిదా పడ్డాయి 

'ఐక్యంగా ఉద్యమిద్దాం'

కేంద్రం ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఐక్యంగా ముందుకుసాగుదామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు విపక్షాలతో విందు భేటీ నిర్వహించారు. దీనిని 2024 లోక్‌సభ ఎన్నికలకు 'ట్రైలర్' మాత్రమేనని కాంగ్రెస్ అభివర్ణించింది.

 కేరళలో మళ్లీ 20వేలు 

దేశంలో కరోనా వ్యాప్తి పెరుగుతోంది. కేరళలో మరోసారి 20వేలకుపైగా కేసులు (corona cases) నమోదయ్యాయి. మహారాష్ట్రలో 6వేల మందికి కరోనా సోకింది. మహమ్మారి విజృంభణ నేపథ్యంలో విమాన ప్రయాణికులకు ఆర్​టీ-పీసీఆర్ పరీక్షలను తప్పనిసరి చేస్తూ ఛత్తీస్​గఢ్​ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ​

వానలకు తోడు పిడుగుముప్పు

వానాకాలం వచ్చిందంటే చాలు.. 'పిడుగుపాటుకు ఓ కుటుంబం బలి' వంటి వార్తలు అనేక చదువుతుంటాం. 1995-2014 మధ్య కాలంలో ఉరుములు, పిడుగులు 40శాతం పెరిగాయని, ఫలితంగా మృతుల సంఖ్య రెట్టింపయిందని ఐఐటీఎం పేర్కొంది. ముందస్తు హెచ్చరికలతోనే పిడుగుపాటు నుంచి బయటపడగలం.

వాటికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు రద్దు!

ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ముమ్మరం చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వీటికి రిజిస్ట్రేషన్ రుసుము నుంచి మినహాయిస్తూ రోడ్డు రవాణా, హైవే మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

 మహిళలు గెలిస్తే చరిత్రే..

టోక్యో ఒలింపిక్స్​లో 12వ రోజు భారత్.. పలు క్రీడల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇందులో మహిళల హాకీ మ్యాచ్​తో పాటు బాక్సింగ్​, జావెలిన్ త్రో, రెజ్లింగ్​, గోల్ఫ్​ పోటీలు ఉన్నాయి. అయితే కోట్లాది భారతీయుల ఆశలు.. హాకీ మహిళలు, బాక్సర్​ లవ్లీనాపైనే ఉన్నాయి. 

Last Updated : Aug 4, 2021, 9:58 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.