1. ఏసు శాంతి సందేశమే గుడ్‌ఫ్రైడే...
మానవాళికి క్రీస్తు ఇచ్చిన శాంతి సందేశాన్ని గుడ్‌ఫ్రైడే సందర్భంగా అందరూ పున:శ్చరణ చేసుకోవాలని గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కరోనా తిరిగి విజృంభిస్తున్న నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను పాటిస్తూ గుడ్‌ప్రైడే ప్రార్థనలు జరుపుకోవాలని క్రైస్తవులకు సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
2. నాగర్జునసాగర్లో ప్రచార జోరు...
నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం ఊపందుకుంది. ఎండను సైతం లెక్కచేయకుండా రోడ్‌షోలు, ఇంటింటి ప్రచారాలతో... ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సంక్షేమ పథకాలే ప్రధాన అస్త్రంగా... అధికార తెరాస ప్రచారం సాగిస్తుంటే... ప్రభుత్వ వైఫల్యాలపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
3. సెకండ్ వేవ్‌కు ప్రారంభ సూచిక...
కేసుల పెరుగుదల సెకండ్ వేవ్‌కు ప్రారంభ సూచిక అని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు తెలిపారు. వ్యాక్సిన్‌తోనే కొవిడ్‌ను నియంత్రించగలమన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
4. చెన్నమనేని జర్మనీ పౌరుడే...
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ పౌరసత్వ వివాదంపై హైకోర్టులో ఇవాళ మరోసారి విచారణ జరిగింది. జర్మనీ రాయబార కార్యాలయం ఇచ్చిన వివరణను కేంద్ర హోంశాఖ అదనపు అఫిడవిట్ రూపంలో ధర్మాసనానికి సమర్పించింది. చెన్నమనేని తరఫు న్యాయవాది కోరడం వల్ల.. విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
5. పట్టపగలే దారుణ హత్య...
హైదరాబాద్‌లో పట్టపగలే దారుణ హత్య కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్ డివిజన్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే దారుణ హత్య జరిగింది. అసద్ ఖాన్ అనే రౌడి షీటర్‌ను కత్తులు, కొడవళ్లతో దారుణంగా హతమార్చారు. ఇండియా ఫంక్షన్ హాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
6. రెండో దశ పోలింగ్ ప్రశాంతం...
బంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది. పలు చోట్ల భాజపా, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఓటర్లను అడ్డుకుంటున్నారని పరస్పరం విమర్శించుకున్నాయి. ఓ పోలింగ్ కేంద్రం నుంచి గవర్నర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. మరోవైపు.. అసోంలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
7. బడా కార్పొరేటర్ల నాయకుడే ఆయన...
ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పేదలను విస్మరించి బడా కార్పొరేట్లకు మాత్రమే సాయపడుతున్నారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ మెరుగుపడాలంటే పేదలకు నేరుగా డబ్బు పంపిణీ చేయడమే మార్గమని అభిప్రాయపడ్డారు.
8. బంగారం, వెండికి రెక్కలు...
బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధర గురువారం దాదాపు రూ.900 ప్రియమైంది. వెండి ధర కిలో మళ్లీ రూ.63 వేల పైకి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
9. ఆర్సీబీకి కొత్త ఓపెనర్...
ఆర్సీబీ త్వరలో ఆడనున్న కివీస్ క్రికెటర్ ఫిన్ అలెన్.. అదిరిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. దీనిపై బెంగళూరు జట్టు అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
10. ఆకట్టుకుంటున్న రాకెట్రీ ట్రైలర్...
విలక్షణ నటుడు మాధవన్ నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తోన్న చిత్రం 'రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్'. ప్రముఖ ఇస్రో శాస్త్రవేత్త నంబి నారాయణ్ జీవితాధారంగా ఈ సినిమా రూపొందుతోంది. గురువారం దీనికి సంబంధించిన ట్రైలర్‌ను పలు భాషల్లో విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి