1. ఆందోళన వీడుదాం..
ప్రస్తుత పరిస్థితుల్లో పాజిటివ్ వచ్చినా స్వల్ప లక్షణాలున్నవారు, అసలు లక్షణాలు లేనివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పని ప్రదేశాల్లో పాటించాల్సిన నిబంధనలేమిటి? ఒకవేళ ఇంట్లో, ఆఫీసుల్లో సన్నిహితుల్లో ఎవరికైనా కరోనా వస్తే ఏం చేయాలి? మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
2. వైద్యుల నిర్లక్ష్యం..
'నాన్నా. చాలా దాహంగా ఉంది. ఊపిరి తీసుకోవడం కష్టమవుతోంది. నా పరిస్థితి చేయి దాటిపోతోంది. అది నాకు అర్థమవుతూనే ఉంది. ఇక మీరు ఇంటికి వెళ్లండి నాన్నా.. అమ్మ జాగ్రత్త' అంటూ చెప్పిన కొన్ని గంటలకే ఆ వ్యక్తి కన్ను మూసిన విషాదమిది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
3. ఉద్ధృతి కొనసాగుతోంది..
తెలంగాణలో కరోనా కేసుల ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతోంది. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 1,924 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 29,536కి చేరింది. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
4. వ్యూహాత్మకంగా కూల్చివేత
సచివాలయ భవనాల కూల్చివేత విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వెళ్తోంది. పరిసరాలను దృష్టిలో ఉంచుకొని కేవలం యంత్రాల సహాయంతోనే కూల్చివేతలు చేపడుతున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని భవనాల కూల్చివేతను ప్రారంభించారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
5. అమెరికాను మించిపోతుంది...
భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే.. భారత్‌లోనే రోజువారీ కరోనా కేసుల వృద్ధిరేటు చాలా ఎక్కువగా ఉంది. దేశంలో పాజిటివ్ కేసుల రేటు తొలిసారి 7శాతం దాటడం గమనార్హం. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
6. కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన
రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గురువారం కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించే ప్రాజెక్టులను చేపడుతున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
7. కరోనాను ఖతం చేసే యంత్రం!
హ్యూస్టన్ వర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త గాలి శుద్ధీకరణ యంత్రాన్ని ఆవిష్కరించారు. ఈ యంత్రం గాలిలోని (కరోనా) వైరస్‌ను సంగ్రహించి వెంటనే నిర్వీర్యం చేస్తుందని వారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన అధ్యయన పత్రాన్ని ‘మెటీరియల్స్ టుడే ఫిజిక్స్’లో ప్రచురించారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
8. భారీ వ్యయాలు కావాలి..
కొన్నేళ్లుగా ప్రైవేటు రంగంలో పెట్టుబడులు ఊపందుకున్నా.. కరోనా పుణ్యమా అని మళ్లీ దెబ్బతిన్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను దిగజార్చే పరిస్థితులు తలెత్తుతున్నాయి. సాంకేతికత వినియోగం భారీగా పెరిగిన తరుణంలోనూ ఫలితాలు మాత్రం ఆశావహంగా లేవు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
9. 'కోహ్లీ భయ్యా... బిర్యానీ పంపు'
టీమ్ ఇండియా సారథి కోహ్లీ.. క్రికెటర్ శ్రేయస్ అయ్యర్‌కు బిర్యాని పంపినట్లు తన ఇన్‌స్టాలో పంచుకున్నాడు. అయితే దీనిపై స్పందించిన యువ బౌలర్ చాహల్.. విరాట్‌ను కవ్వించేశాడు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
10. దర్శకుడి వేటలో నాగ్
బాలీవుడ్ హిట్ సినిమా 'రైడ్'ను తెలుగులో రీమేక్ చేయడం కోసం పలువురు దర్శకులతో చర్చలు జరుపుతున్నారు ప్రముఖ కథానాయకుడు నాగార్జున. ప్రస్తుతం ఆయన 'వైల్డ్ డాగ్' చిత్రంలో నటిస్తున్నారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.