- కరోనా పరీక్ష ధర ఎంతంటే...
ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా పరీక్ష ధర రూ.2,200గా నిర్ణయించామని మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. వెంటిలేటర్‌పై లేకుండా ఐసీయూలో ఉంచితే రోజుకు రూ. 7,500గా నిర్ణయించామని తెలిపారు. ఇంకేమన్నారంటే...?
- బీఆర్కే భవన్లో మరో కేసు
తెలంగాణలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో పరిస్థితి దారుణంగా తయారైంది. సచివాలయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న బీఆర్కే భవన్లో మరో ఉద్యోగికి కొవిడ్ పాజిటివ్ వచ్చింది. వివరాలు ఇలా..
- 'కేసీఆర్ వడ్డీ వ్యాపారి'
హైదరాబాద్ విద్యుత్ సౌధతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో ధర్నాలకు భాజపా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు భాజపా కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. దీనిపై స్పందించిన బండి సంజయ్ ఏమన్నారంటే...
- 'ఫోన్ కొట్టు- ముచ్చట పెట్టు'
సాధారణంగా వైద్యులు ఏం చేస్తారు..? రోగుల ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని అందుకు తగ్గ వైద్యం చేస్తారు. కానీ, దిల్లీలోని ఓ ఆసుపత్రిలో మాత్రం.. కరోనా బాధితులతో ముచ్చటిస్తున్నారు. నర్సులు బాధితులకు ఎప్పటికప్పుడు ఫోన్ చేసి పలకరిస్తున్నారు. ఇంతకీ ఆ ఆసుపత్రి సిబ్బంది ఉన్నట్టుండి కరోనా రోగులతో ఎందుకిలా మాటామంతి కార్యక్రమం చేపట్టారు..?
- అఖిలపక్షం భేటీ
దిల్లీలో కరోనా మహమ్మారి తీవ్రస్థాయికి చేరుతున్న నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. దిల్లీలో కరోనా పరిస్థితి, తీసుకోవాల్సిన నిర్ణయాలపై సూచనలను కోరినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
- 'మళ్లీ టెస్ట్ చేయాల్సిందే'
కరోనా నిర్ధరణకు ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలకు సంబంధించి కీలక మార్గదర్శకాలు విడుదల చేసింది భారత వైద్య పరిశోధన మండలి. యాంటిజెన్ టెస్టులో నెగిటివ్ వస్తే ఆ శాంపిళ్లను ఆర్టీ-పీసీఆర్ ద్వారా పరీక్షించాలని సిఫార్సు చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తిస్థాయి నిబంధనలను వెల్లడించింది.
- ' మేం మంచే కోరుకుంటాం.. కానీ!'
చైనాతో క్రియాశీలక సంబంధాలను పెంచుకోవాలనే అమెరికా కోరుకుంటోందని.. అయితే చైనా ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తూ వాగ్దానాలను ఉల్లంఘిస్తోందని ఆరోపించారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇంకేమన్నారంటే...
- 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల దిశగా సాగుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ భయాలతో ఆసియా మార్కెట్లలో బలహీన సంకేతాలే నష్టాలకు కారణం. బ్యాంకింగ్, లోహ రంగాల షేర్లు భారీ ఒడుదొడుకుల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ ట్రేడ్స్ ఎలా ఉన్నాయంటే..?
'టీమ్ ఇండియాకు భయం పోయింది'
టీమ్ ఇండియా బౌలర్లపై ప్రశంసలు కురిపించిన మాజీ పేసర్ షాన్ పొలాక్.. అదనపు బౌలర్ కోసం ఇబ్బందిపడే రోజులు భారత జట్టుకు పోయాయని వెల్లడించాడు.
ఆ నటి బాడీగార్డ్ జీతం ఎంతంటే?
తన బాడీగార్డ్‌ను సోదరుడిలా చూస్తున్న హీరోయిన్ దీపికా పదుకొణె.. అతడికి ఏడాది కళ్లు చెదిరే జీతం ఇస్తోందట. ఆ మొత్తం గురించి తెలుసుకున్న నెటిజన్లు.. ఆశ్చర్యానికి గురవుతున్నారు. జీతం ఎంత?