ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @11AM

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ప్రధాన వార్తలు
ఇప్పటి వరకు ప్రధాన వార్తలు
author img

By

Published : Jun 15, 2020, 11:03 AM IST

దేశంలో కరోనా విజృంభణ

భారత్​లో కరోనా మహమ్మారి మహోగ్రరూపం దాలుస్తూనే ఉంది. కేసులతో సహా మరణాల సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతూనే ఉంది. గడచిన 24 గంటల్లో ఎంత మంది ప్రాణాలు వదిలారంటే?

ఈటల​ ఓఎస్​డీకి కరోనా

రాష్ట్రంలో రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. ఇప్పుడు తాజాగా మంత్రి ఈటల రాజేందర్​ ఓఎస్​డీకి కరోనా పాజిటివ్​ అని తేలడం ఆందోళన కలిగిస్తోంది.

సంగారెడ్డిలో చిరుత

సంగారెడ్డి జిల్లా రామాపురంలో చిరుత పులుల సంచారం కలవరం రేపింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పులి పంజా గుర్తులను గుర్తించారు. దీనిపై అటవీశాఖ అధికారులకు సమాచారం పంపించారు.

ఉద్యోగుల పాత్రపై అనిశా ఆరా

ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏపీ సచివాలయ ఉద్యోగుల్లో కొందరిని ప్రశ్నించేందుకు అవినీతి నిరోధక శాఖ (అనిశా) సిద్ధమవుతోంది. పలు అంశాలపై ఆరా తీయనుంది.

కోతులకో పార్కు..

కోతుల నుంచి కాపాడండి మొర్రో.. అని వేడుకున్నారు అక్కడి ప్రజలు. ప్రభుత్వం స్పందించి రూ. 5 కోట్లు ఖర్చు చేసి కపిరాజులకు ప్రత్యేక పార్కు కట్టేసింది. ప్రజలకు వానరాల నుంచి విముక్తి కలిగించింది. ఎక్కడంటే...

చైనాలో పెరుగుతున్న కేసులు

చైనాలో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. ఒక్కరోజులోనే 49 కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని బీజింగ్​లోనే 36 కేసులు వెలుగు చూశాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో అక్కడి ప్రభుత్వం లాక్​డౌన్ ప్రకటించింది. ఎన్ని ప్రాంతాల్లో విధించింది అంటే...

కొవిడ్​-19లో 3 దశలు

ప్రపంచ దేశాలపై కొద్దిరోజులుగా ఉగ్రరూపం దాల్చుతున్న కరోనా వైరస్​ ఎలా ప్రబలుతోందనే విషయంపై ఇటలీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. ఇందులో మూడు దశలను పరిశోధకులు గుర్తించారు. వివరాలు ఇలా ఉన్నాయి.

సెన్సెక్స్​ను వెంటాడుతున్న కరోనా​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు, నిరంతర విదేశీ నిధుల ప్రవాహం కారణంగా స్టాక్​ మార్కెట్లు నష్టాలతో వారాన్ని ప్రారంభించాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ ఆరంభ ట్రేడింగ్​లో భారీగా నష్టపోయింది. సెన్సెక్స్​ ఎన్ని పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతుందంటే...

''ఇట్స్ ఓకే' అంటే నాట్​ ఓకే'

హీరో సుశాంత్ సింగ్ మృతిపై స్పందించిన క్రికెటర్ ఊతప్ప.. మానసిక ఒత్తిడి గురించి ఆప్తులతో మాట్లాడాలని సూచించాడు. ఎవరైనా 'ఇట్స్ ఓకే' అన్నారంటే అంతా సరిగా ఉన్నట్లు కాదని చెప్పుకొచ్చాడు. ఇంకేమన్నాడంటే..

'పెదరాయుడు'@25

కలెక్షన్ కింగ్ మోహన్​బాబు, సూపర్​స్టార్ రజినీకాంత్ కాంబినేషన్​లో వచ్చిన అద్భుత సినిమా 'పెదరాయుడు'.. ఈ సోమవారానికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పలు చిత్రబృందం పలు విశేషాలను పంచుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.