ETV Bharat / city

టాప్​టెన్​ వార్తలు@9PM - top ten news telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news telangana
top ten news telangana
author img

By

Published : Dec 18, 2020, 8:59 PM IST

1.ఆదిలాబాద్​లో కాల్పుల కలకలం

ఆదిలాబాద్‌ తాటిగూడ కాలనీలో కాల్పుల మోతతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. పాతకక్షలతో రాజకీయ ప్రత్యర్థులైన ఫరూక్‌ అహ్మద్‌, వసీం వర్గాలు పరస్పరం ఘర్షణకు దిగాయి. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు ఫరూక్‌ అహ్మద్‌ కాల్పులు జరపగా... ముగ్గురు గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2.పరువు తీసి వేధిస్తున్న లోన్​ యాప్స్

ఆన్‌లైన్​ లోన్‌ యాప్‌ల నిర్వాహకుల ఆగడాలు మితిమీరుతున్నాయి. రుణం ఇస్తామంటూ దారుణాలకు పాల్పడుతున్నారు. వాళ్ల వేధింపులకు ఒక్కనెలలోనే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు అనేకం జరిగినా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3.కేసీఆర్ నిజాం పాలనను మరిపిస్తున్నారు

భాజపా ప్రభుత్వం.. ప్రజల ఒక్కో సమస్యను క్రమంగా పరిష్కరిస్తోందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​ఛార్జి తరుణ్​చుగ్​ తెలిపారు. కరోనా వేళ ప్రజలు అవస్థలు పడినా.. ఫాంహౌస్​ నుంచి కేసీఆర్​ బయటకురాలేదన్నారాయన. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4.కీలకంగా మారిన నిఘా నేత్రలు

జంటనగరాల్లో రహదారి ప్రమాదాల నిర్ధరణలో నిఘానేత్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఊహించని రీతిలో ప్రమాదాలు జరిగినప్పుడు అసలు ఏం జరిగింది, తప్పెవరిది తెలుసుకునేందుకు నిఘా నేత్రాల్లో నమోదైన దృశ్యాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5.కరోనా దావాగ్నిలా వ్యాపించింది

నిబంధనలు సరిగా పాటించకపోవడం వల్ల దేశంలో కరోనా దావాగ్నిలా వ్యాప్తి చెందిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. కరోనా మార్గదర్శకాలపై దాఖలైన పలు పిటిషన్ల విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6.కరోనా టీకా తీసుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్​ బహిరంగంగా కరోనా వ్యాక్సిన్​ తీసుకున్నారు. ఈ దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారం చేసింది అమెరికా మీడియా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.లాక్​డౌన్​లో 45శాతం పెరిగిన​ వాచ్​టైం

భారత్​లో అంతర్జాల వేదికగా వీడియోలు చూసే సమయం ఈ ఏడాది భారీగా పెరిగినట్లు యూట్యూబ్​ తెలిపింది. ప్రాంతీయ భాషల్లో కంటెంట్​ అందుబాటులో ఉండడమే ప్రధాన కారణని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8.పెరిగిన బంగారం ధర

దేశీయంగా బంగారం ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. దిల్లీలో 10 గ్రాముల మేలిమి పసిడి ధరపై శుక్రవారం రూ.21 పెరిగింది. వెండి ధర కిలోకు రూ. 259 తగ్గింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9.ఒకే బంతికి ఔటైన సచిన్,లారా, సెహ్వాగ్

ఆసీస్​తో తొలి టెస్టులో పృథ్వీషా ఔటైన తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అతడిపై గతంలో వచ్చిన ప్రశంసలనే ఉపయోగిస్తూ ట్రోలింగ్ చేస్తున్నారు. విఫలమవుతున్న షా కు ఎలా అవకాశమిచ్చారని మేనేజ్​మెంట్​ను ప్రశ్నిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10.సీక్రెట్ చెప్పిన అనుపమ..

హైదరాబాద్​లో ఓ వస్త్ర దుకాణం ప్రారంభోత్సవానికి వచ్చిన హీరోయిన్ అనుపమ.. తాను మెరుపు తీగలా మారడానికి గల కారణాన్ని చెప్పింది. తెలుగు చక్కగా మాట్లాడటం వెనుకున్న రహస్యాన్ని వెల్లడించింది. దీనితో పాటే తాను చేస్తున్న కొత్త సినిమాల విశేషాలు తెలిపింది.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.