ETV Bharat / city

Telangana Top News: టాప్​ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Jul 4, 2022, 6:58 PM IST

ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.

  • కాంగ్రెస్​ గూటికి తెరాస మేయర్..

హైదరాబాద్‌ను కీలక నగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని తెరాస నేతలు అబద్ధాలు చెప్పారని విమర్శించారు. దిల్లీలో రాహుల్​ గాంధీ సమక్షంలో బడంగ్​పేట్​ మేయర్​తో పారిజాతతో సహా పలువురు తెరాస నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

  • ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఔటర్‌రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా.. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

  • సాగు పనులకు కూలీలు కొరత... ఆ రైతు ఏం చేశాడంటే..!

వర్షాలు కురవడంతో.. రైతన్న సాగు పంటపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ.. సాగు పనులకు కూలీల కొరత ఏర్పడింది. సొంతూళ్లలో కూలీలు దొరక్కపోతే పక్క ఊర్ల నుంచి తీసుకొచ్చుకుని... పని అయిపోయాక తిరిగి వాళ్ల ఊర్లలో దించిరావాలి. పైగా కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న హనుమకొండ జిల్లా రైతు వినూత్నంగా ఆలోచించి... వారితో వరినాట్లు వేయించారు. అతనేం చేశాడో చూద్దాం...

  • రేప్​ నుంచి యువతిని కాపాడిన ట్రాన్స్​జెండర్లు..

ఓ కామాంధుడికి ఇద్దరు ట్రాన్స్​జెండర్లు బుద్ధి చెప్పారు. ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని కొట్టి, పోలీసులకు అప్పగించారు.

  • భర్తను వీడి ప్రియుడి ఇంటికి 'ఆమె'.. వివస్త్రను చేసి చితకబాదిన గ్రామస్థులు

మధ్యప్రదేశ్​లో ఓ మహిళపై అమానవీయంగా దాడి చేశారు గ్రామస్థులు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న కారణంతో ఆమెను చితకబాదారు.

  • హోటల్స్, రెస్టారెంట్స్​ సర్వీస్ ఛార్జ్ విధించడంపై బ్యాన్

హోటల్, రెస్టారెంట్​ బిల్​లో సర్వీస్​ ఛార్జ్ చూసి షాకయ్యారా? ఎందుకు కట్టాలని అక్కడి సిబ్బందితో వాదించి విసుగెత్తిపోయారా? చివరకు చేసేదేమీ లేక వారు చెప్పినంత బిల్ చెల్లించి వచ్చేశారా? ఇకపై అలా కుదరదు. కొత్త రూల్స్ ప్రకారం.. సర్వీస్ ఛార్జ్​ విధించడం నిషిద్ధం.

  • 'రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే'..

కల్యాణ్​రామ్ హీరోగా రూపొందుతున్న 'బింబిసార' సినిమా ట్రైలర్​ సోమవారం విడులైంది. యుద్ధ విన్యాసాలు, అదిరిపోయే సంభాషణలతో.. కల్యాణ్​రామ్ కొత్త లుక్​లో కనిపిస్తున్న సినిమా ట్రైలర్​ ఎలా ఉందో మీరూ చూసేయండి.

  • 'ఈ మాల్​వేర్​తో నగదు ఖాళీ'..

టోల్​ ఫ్రాడ్​ పట్ల ఆండ్రాయిడ్​ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్. బిల్లింగ్​, కాల్ ఫ్రాడ్​ కన్నా​ టోల్​ ఫ్రాడ్​ ప్రమాదకరమైందని.. వైఫై కనెక్షన్​ ఆఫ్​ చేసి బ్యాంకు ఖాతాల్లోని నగదును ఖాళీ చేస్తుందని హెచ్చరిస్తుంది.

  • భాగ్యనగరవాసులపై వరుణుడి ప్రతాపం..

హైదరాబాద్​లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒక్కసారిగా వరుణుడి రాకతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారులపై వర్షపు నీరు నిలిచి పలు చోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

  • రేపు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌..!

ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈనెల 5న రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు బంద్‌లో పాల్గొని విజయవంతం చేయాలని కోరింది.

  • కాంగ్రెస్​ గూటికి తెరాస మేయర్..

హైదరాబాద్‌ను కీలక నగరంగా తీర్చిదిద్దింది కాంగ్రెస్ పార్టీయేనని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని తెరాస నేతలు అబద్ధాలు చెప్పారని విమర్శించారు. దిల్లీలో రాహుల్​ గాంధీ సమక్షంలో బడంగ్​పేట్​ మేయర్​తో పారిజాతతో సహా పలువురు తెరాస నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

  • ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ప్రమాదం.. ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఔటర్‌రింగ్‌రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఢీకొట్టగా.. అందులో ఉన్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

  • సాగు పనులకు కూలీలు కొరత... ఆ రైతు ఏం చేశాడంటే..!

వర్షాలు కురవడంతో.. రైతన్న సాగు పంటపై భారీ ఆశలు పెట్టుకున్నాడు. కానీ.. సాగు పనులకు కూలీల కొరత ఏర్పడింది. సొంతూళ్లలో కూలీలు దొరక్కపోతే పక్క ఊర్ల నుంచి తీసుకొచ్చుకుని... పని అయిపోయాక తిరిగి వాళ్ల ఊర్లలో దించిరావాలి. పైగా కూలీల రేట్లు కూడా పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న హనుమకొండ జిల్లా రైతు వినూత్నంగా ఆలోచించి... వారితో వరినాట్లు వేయించారు. అతనేం చేశాడో చూద్దాం...

  • రేప్​ నుంచి యువతిని కాపాడిన ట్రాన్స్​జెండర్లు..

ఓ కామాంధుడికి ఇద్దరు ట్రాన్స్​జెండర్లు బుద్ధి చెప్పారు. ఒంటరిగా ఉన్న యువతిపై అత్యాచారానికి యత్నించిన వ్యక్తిని కొట్టి, పోలీసులకు అప్పగించారు.

  • భర్తను వీడి ప్రియుడి ఇంటికి 'ఆమె'.. వివస్త్రను చేసి చితకబాదిన గ్రామస్థులు

మధ్యప్రదేశ్​లో ఓ మహిళపై అమానవీయంగా దాడి చేశారు గ్రామస్థులు. మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న కారణంతో ఆమెను చితకబాదారు.

  • హోటల్స్, రెస్టారెంట్స్​ సర్వీస్ ఛార్జ్ విధించడంపై బ్యాన్

హోటల్, రెస్టారెంట్​ బిల్​లో సర్వీస్​ ఛార్జ్ చూసి షాకయ్యారా? ఎందుకు కట్టాలని అక్కడి సిబ్బందితో వాదించి విసుగెత్తిపోయారా? చివరకు చేసేదేమీ లేక వారు చెప్పినంత బిల్ చెల్లించి వచ్చేశారా? ఇకపై అలా కుదరదు. కొత్త రూల్స్ ప్రకారం.. సర్వీస్ ఛార్జ్​ విధించడం నిషిద్ధం.

  • 'రాక్షసుడైనా, భగవంతుడైనా ఈ బింబిసారుడొక్కడే'..

కల్యాణ్​రామ్ హీరోగా రూపొందుతున్న 'బింబిసార' సినిమా ట్రైలర్​ సోమవారం విడులైంది. యుద్ధ విన్యాసాలు, అదిరిపోయే సంభాషణలతో.. కల్యాణ్​రామ్ కొత్త లుక్​లో కనిపిస్తున్న సినిమా ట్రైలర్​ ఎలా ఉందో మీరూ చూసేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.