ETV Bharat / city

Telangana Top News: టాప్​ న్యూస్ @7PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Jul 2, 2022, 6:58 PM IST

  • 'తెరాస పాలనకు తెరదించేలా భాజపా భేటీలో చర్చ'

హైదరాబాద్​లో భాజపా కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చేలా.. రాష్ట్రంలో తెరాసకు చెక్ పెట్టేలా కమలనాథులు మేధోమధనం ప్రారంభించారు. ప్రధాని మోదీ సహా భాజపా అగ్రనేతలు ఈ సమావేశాలకు హాజరయ్యారు.

  • హైదరాబాద్​ పరిసరాల్లో భారీ వర్షం..

హైదరాబాద్​ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. హెచ్​ఐసీసీ ప్రాంగణం సహా పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేని వాన పడుతోంది. రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు రంగంలోకి దిగిన జీహెచ్​ఎంసీ సిబ్బంది.. సహాయక చర్యలను ముమ్మరం చేశారు.

  • 'ప్రోటోకాల్‌ ప్రకారం సీఎం తప్పనిసరిగా రావాలని ఎక్కడా లేదు'

మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ స్పష్టం చేశారు. ప్రధానికి స్వాగతం పలికేందుకు ప్రొటోకాల్‌ ప్రకారం సీఎం తప్పనిసరిగా రావాలని ఎక్కడా లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు ఎవరైనా ప్రతినిధిగా వెళ్లవచ్చని ఆయన తెలిపారు.

  • 'సమస్యలపై చర్చించకుండా ప్లెక్సీలతో చిల్లర రాజకీయం చేస్తున్నారు..'

తెరాస, భాజపా ప్లెక్సీల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి మరోసారి మండిపడ్డారు. వారం రోజులుగా ప్రజా సమస్యలను వదిలేసి తెరాస, భాజపా చిల్లర రాజకీయాలకు తెర లేపాయని దుయ్యబట్టారు. ఇందిరాగాంధీ విగ్రహానికి నేరుగా తెరాస జెండాలు కట్టడాన్ని ఏం రాజకీయం అంటారని నిలదీశారు.

  • రైల్వే పోలీసుల కస్టడీకి సికింద్రాబాద్ అల్లర్ల కేసు నిందితులు..

సికింద్రాబాద్ అల్లర్ల కేసులో చంచల్​గూడ జైలులో రిమాండ్​లో ఉన్న 45మంది నిందితులను రైల్వే పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఈరోజు, రేపు వారిని ఘటనకు సంబంధించిన పలు అంశాలపై వారిని ప్రశ్నించనున్నారు.

  • ప్రియుడి మోజులో భర్తకు విడాకులు..

ప్రియుడి మోజులో అప్పటికే భర్తను వదిలేసిన ఆ మహిళ.. తన ఇద్దరు చిన్నారులను కూడా భారంగా భావించింది. ఒకరోజు ఆస్పత్రికి వెళ్తున్నా అని చెప్పి.. వారిని కూడా విడిచి పెట్టి తన ప్రేమికుడితో పారిపోయింది. ఈ అమానవీయ ఘటన మధ్యప్రదేశ్​ ఉజ్జయిన్​లో జరిగింది.

  • వింత చోరీ.. ఇంట్లోకి అవసరమైన వాటినే ఎత్తుకెళ్లిన దొంగలు

ఎక్కడైనా దొంగలు కనిపించిన ప్రతి వస్తువును దోచుకెళ్తారు.. ఏదైనా షాపులోకి చొరబడితే విలువైన వస్తువులన్నీ ఎత్తుకెళ్తారు.. కానీ ఇక్కడ మాత్రం ఇంట్లోకి అవసరమైన సామాను మాత్రమే తీసుకెళ్లారు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..

  • నయా 'వీరు'డు పంత్​ రికార్డుల మోత..

సుదీర్ఘ ఫార్మాట్‌లో రాణించాలంటే కాస్త ఓర్పు కావాలంటారు.. ఆచితూచి ఆడుతూ పరుగులు రాబట్టాలి. నిలకడగా ఆడి రన్స్ చేస్తేనే జట్టులో స్థానం పదిలంగా ఉంటుంది. కానీ ఇవేవీ ఒకప్పుడు వీరేంద్ర సెహ్వాగ్‌కు నచ్చేవి కావు. ఇప్పుడు ఈ టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌ కూడా అంతే..

  • గులాబీ పూలతో.. 'గుల్​కండ్​ మిల్క్​షేక్'..

మీ ఒంట్లో శక్తి ఆవిరైపోతోందా? రోజంతా ఉల్లాసంగా ఉంచే.. చల్లచల్లని టేస్టీ మిల్క్​షేక్​ తాగితే బాగుండనుకుంటున్నారా? గుబాళించే గులాబి పూలను, తేనె, చక్కెరలో ఊరబెడితే తయారవుతుంది గుల్​కండ్​. ఇంకెందుకు ఆలస్యం.. గులాబి పరిమళంతో మిమ్మల్ని మైమరపించే 'గుల్​కండ్​ షేక్​'ను రెండు నిమిషాల్లో తయారు చేసేసుకోవడానికి ఈ వీడియో చూసేయండి.

  • బాలయ్య డైలాగ్స్​తో అదరగొట్టిన తమిళ డైరెక్టర్

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని నటించిన 'ది వారియర్'. తమిళ డైరెక్టర్ లింగుసామి ఈ సినిమాకు దర్శకుడు. లింగుసామి డైరెక్ట్​గా తెలుగులో చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ఈ సినిమా జులై 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుండగా.. అనంతరపురంలో ప్రీరిలీజ్​ ఈవెంట్​ నిర్వహించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.