ETV Bharat / city

టాప్​ న్యూస్ @ 7AM - top news today in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​ న్యూస్ @ 7AM
టాప్​ న్యూస్ @ 7AM
author img

By

Published : Jan 23, 2022, 6:59 AM IST

  • రాష్ట్రంలో నేడు మోస్తరు వర్షాలు

Rain Alert in Telangana Today : రాష్ట్రాన్ని మరోసారి వరణుడు పలకరించే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ, దక్షిణ భారత ప్రాంతాల నుంచి తెలంగాణ వైపు తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో ఈ రోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.

  • ఇంటింటా సుస్తీ

Fever Survey Updates in Telangana : కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఫీవర్ సర్వే కొనసాగుతోంది. వైద్యబృందాలు ఇంటింటికీ వెళ్లి ప్రజలను లక్షణాలు అడిగి తెలుసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలాచోట్ల ప్రజలు జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. ప్రతి నలుగురిలో ఒకరికి ఏదో ఒక సమస్య ఉన్నట్లుగా సర్వే ఫలితాల్లో వెల్లడైంది.

  • గణతంత్ర వేడుకలకు మార్గదర్శకాలు

Republic day Guidelines In TS: కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో గణతంత్ర వేడుకల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. జనసమ్మర్దం లేకుండా, జనం గుమిగూడకుండా వేడుకలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.

అమ్మాయిలకు ఫ్రీగా ఎలక్ట్రిక్ స్కూటర్లు

Punjab Assembly Polls: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పంజాబ్ కాంగ్రెస్ ఛీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ.. కళాశాలకు వెళ్లే అమ్మాయిలకు బంపర్​ ఆఫర్​ ప్రకటించారు. లుథియానాలో అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ స్కూటర్లు ఫ్రీగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

  • గాంధీకి ఇష్టమైన కీర్తన తొలగింపు

Beating Retreat Ceremony: గణతంత్ర వేడుకల అనంతరం ఈ ఏడాది జరిగే బీటింగ్ రిట్రీట్​ కార్యక్రమం నుంచి మహాత్మా గాంధీకి ఇష్టమైన కీర్తనను తొలగించారు. ఈ మేరకు ఇండియన్ ఆర్మీ కరపత్రం విడుదల చేసింది. దీంతో ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడింది కాంగ్రెస్.

  • అలా తినాలి.. ఆహా అనాలి!

children's food habits: తినే తిండి ఏదైనా దాన్ని ఆస్వాదించాలి. తినేటప్పుడు ఆ ఆహార పదార్థాలు ఎంత రుచికరంగా ఉన్నాయో తెలియజెప్పేలా ముఖ కవళికలను ప్రదర్శించాలి. నోట్లో ముద్ద పెట్టుకోగానే.. ‘వావ్‌.. చాలా బాగుంది’ అన్నట్లుగా ముఖంలో భావాన్ని పలికించాలి. అప్పుడే పిల్లలూ పెద్దలను అనుసరిస్తారు. ఆరోగ్యకరమైన పదార్థాలను చిన్నారులకు అలవాటు చేయడంలో పెద్దలు ఈ తరహా ధోరణిని అవలంబించాలని అధ్యయనాలు సూచిస్తున్నాయి. రుచిని ఆస్వాదిస్తూ తింటున్న తల్లిదండ్రులను చూసి అనుసరించడానికి ఎక్కువమంది పిల్లలు మొగ్గుచూపినట్లుగా ఓపరిశోధనలో తేలింది. ఈ నేపథ్యంలో చిన్నతనం నుంచి పిల్లల్లో ఆరోగ్యకరమైన ఆహారాలను ఎలా అలవాటు చేయాలనే అంశంపై ప్రత్యేక కథనం.

  • విశ్వ వేదికలపై మనోళ్ల హవా

Indian professors in Abroad: మనోళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా విశ్వగురువులుగా రాజ్య మేలుతున్నారు. అమెరికా, యూకేలో భారీగా ప్రవాస భారతీయ ఆచార్యులు ఉన్నారు. యూనివర్సిటీల డీన్లు, విభాగాధిపతులుగానూ వందల సంఖ్యలో మనవాళ్లే ఉంటున్నారు. కొన్ని వర్సిటీలకు అధ్యక్షులుగా బాధ్యతలు చేపడుతున్నారు. తాజాగా తెలుగు మహిళ నీలి బెండపూడి అమెరికాలోని పెన్సిల్వేనియా స్టేట్‌ యూనివర్సిటీకి తొలి మహిళా ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు.

  • ట్రంప్‌ అంతకు తెగించారా?

Trump News: అధ్యక్ష పదవిలో కొనసాగడం కోసం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విశ్వప్రయత్నాలు చేశారట. తాజాగా ఇందుకు సంబంధించిన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ట్రంప్.. ఏకంగా ఓటింగ్‌ యంత్రాలను స్వాధీనం చేసుకోమని ఆదేశిస్తూ రక్షణశాఖ సెక్రటరీకి ఓ లేఖ రాయడానికి సిద్ధమయ్యారని తెలిసింది.

  • దక్షిణాఫ్రికాతో చివరి వన్డే నేడు

IND vs SA 3rd ODI: మన జట్టేమీ చెత్తగా ఆడలేదు. ఏ మ్యాచ్‌లోనూ చిత్తుగా ఓడలేదు. మెరుగైన ప్రదర్శనే చేసినా.. కీలక సమయాల్లో పట్టు కోల్పోయి ఓటమలు చవిచూసింది. ఈసారి దక్షిణాఫ్రికా పర్యటనను గొప్ప విజయంతో ఆరంభించి.. ఆ తర్వాత వరుస ఓటములతో ముందుగా టెస్టు సిరీస్‌ను, ఆపై వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇప్పుడిక వన్డే పోరులో చివరి మ్యాచ్‌కు వేళైంది. విజయంతో ఆరంభించిన పర్యటనను విజయంతోనే ముగించి కాస్త సంతృప్తితో టీమ్‌ఇండియా ఇంటిముఖం పడుతుందేమో చూడాలి.

  • ఆ ఇద్దరి వల్లే బతికున్నా: సమంత

Samantha News: కథానాయిక సమంత విహారయాత్రల్లో బిజీగా ఉంది. ప్రస్తుతం స్విట్జర్లాండ్​లో ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికరమైన పోస్ట్ చేసింది సామ్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.