- " class="align-text-top noRightClick twitterSection" data="">
- తెలంగాణలో లాక్‌డౌన్ తొలగింపు?
రాష్ట్రంలో లాక్‌డౌన్ అంశం ఇవాళ తేలిపోనుంది. కరోనా పరిస్థితులపై సమీక్షించనున్న మంత్రివర్గం... తదుపరి చర్యలను ఖరారు చేయనుంది. మరిన్ని మినహాయింపులు ఇచ్చే దిశగా నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. పల్లె, పట్టణ ప్రగతి తనిఖీలు... జిల్లాల పర్యటనలు, కృష్ణాపై ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న ప్రాజెక్టుల అంశాలు భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రేపటి నుంచే కేసీఆర్ జిల్లాల పర్యటన
రేపటి నుంచి జిల్లాల వరుస పర్యటనలో సీఎం కేసీఆర్ బిజీగా మారనున్నారు. 20న సిద్దిపేట, కామారెడ్డి, 21న వరంగల్లో పర్యటించనున్న సీఎం... ఆకస్మిక తనిఖీలతోపాటు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. 22న వాసాలమర్రిలో సహపంక్తి భోజనాల్లో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- అఖండ భారతం అందించిన ఆణిముత్యం
తన పరుగుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్(Milkha Singh). భారత కీర్తి పతాకాన్ని విశ్వ వేదికపై ఎగురవేసిన ఈ పరుగుల వీరుడు.. అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన జీవితంలోని మధుర క్షణాలను ఓసారి గుర్తు చేసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మిల్కాకు ప్రధాని, రాష్ట్రపతి నివాళి
మిల్కా సింగ్ మృతి పట్ల యావత్ భారతం.. ఘన నివాళులు అర్పిస్తోంది. మిల్కా మరణం తన హృదయాన్ని దుఃఖంతో నింపేసిందని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- మోదీకి పాలించే హక్కు లేదు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశాన్ని పాలించే నైతిక హక్కును కోల్పోయారని కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ అన్నారు. కరోనా రెండో దశలో మోదీ రాజకీయ ప్రచారం కోసమే వెంపర్లాడారని మండిపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలతో ప్రధాని భేటీ!
జమ్ముకశ్మీర్ రాజకీయ పార్టీలతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 24న భేటీ కానున్నారు. కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించటం, రాజకీయ ప్రక్రియల పునరుద్ధరణ తదితర అంశాలపై ప్రధాని చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- తితిదే సమావేశంలో 85 అంశాలపై చర్చ
తితిదే ధర్మకర్తల మండలి సమావేశం(ttd board meeting) ఇవాళ జరగనుంది. తిరుమల అన్నమయ్య భవనంలో ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- గట్టెక్కేనా?
దేశవ్యాప్తంగా ప్రస్తుతం 6.3కోట్ల ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలు ఉన్నాయి. ఈ లఘు సంస్థల ద్వారా దాదాపు 11కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఎగుమతుల్లోనూ 40శాతం వాటా వాటిదే. స్థూల దేశీయోత్పత్తిలో దాదాపు 30శాతం లఘు పరిశ్రమలదే ప్రాతినిధ్యం. దేశార్థికంలో అంతటి కీలక భూమిక పోషిస్తున్న సంస్థలు.. కరోనా వేళ కుదేలయ్యాయి. భారీ ఆర్థిక గ్రాంటు కోసం కేంద్రాన్ని వేడుకుంటున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రిజర్వ్ డే ఉంటుందా?
ప్రతిష్ఠాత్మక డబ్ల్యూటీసీ మ్యాచ్ తొలి రోజు కనీసం టాస్ పడకుండానే వృథా అయింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో ఔట్ ఫీల్డ్ తడిగా మారింది. దీంతో గత్యంతరం లేక మ్యాచ్ను తదుపరి రోజుకు వాయిదా వేశారు అంపైర్లు. ఈ తరుణంలో కీలకంగా మారిన రిజర్వ్ డేను ఎలా వాడుకోనున్నారు. ఐసీసీ నిబంధనలు ఏం చెప్తున్నాయో ఓ సారి చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- హైదరాబాద్లో సర్కారు వారి పాట
మహేశ్ బాబు(Mahesh Babu) నటిస్తున్న 'సర్కారు వారి పాట'(Sarkaru Vaari Paata) రెండో షెడ్యూల్ షూటింగ్ జులైలో పునఃప్రారంభం కానుంది. ఈ సారి హైదరాబాద్లోనే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి