- సాగు చట్టాలపై ఆందోళన
రాజ్యసభ కార్యకలాపాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, డీఎంకే జోరో అవర్ నోటీసులిచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- దీప్ సిద్ధూపై రివార్డు
రిపబ్లిక్ డే రోజున ఎర్రకోటలో జరిగిన హింసాత్మక ఘటనలతో సంబంధమున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న దీప్ సిద్ధూపై సమాచారం అందిస్తే రూ.లక్ష రివార్డు ఇవ్వనున్నట్లు దిల్లీ పోలీసులు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సామాన్యుడికి తిప్పలు
రేషన్ పంపిణీ విధానంలో ప్రభుత్వం తెచ్చిన మార్పులు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఐరిస్, మొబైల్ ఓటీపీ విధానం అమలు కానుండటంతో ప్రజలు మీసేవా, బ్యాంకులు, ఆధార్ కేంద్రాల చుట్టూ తిరుగుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- సచివాలయానికి కమెండో భద్రత!
తెలంగాణలో శాంతిభద్రతలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. కీలకమైన ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర సచివాలయ భద్రతకు సుశిక్షితులను నియమించే దిశగా యోచిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రాహుల్ చిక్కాడు!
రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పీఎస్ పరిధిలోని గుర్రంగూడలో సోమవారం ఓ వివాహితపై గొడ్డలితో దాడి చేసిన నిందితుణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళపై దాడి చేసి ద్విచక్రవాహనంపై పారిపోయిన రాహుల్‌ను మీర్పేట్ పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- ఏరోఇండియా షో
ఏరో ఇండియా 2021 కార్యక్రమాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించారు. ఇందులో భాగంగా.. తేజస్ యుద్ధ విమానాలకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
తొలి ట్రాన్స్‌జెండర్ మంత్రి
అమెరికా రవాణా మంత్రిగా పీట్ బుట్టిగీగ్ నియామకాన్ని సెనేట్ ఆమోదించింది. దీంతో కేబినెట్ మంత్రి పదవికి ఎంపికైన తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలిచారు పీట్. బైడెన్ కేబినెట్లో ఏకైక మిలేనియల్గానూ రికార్డుకెక్కారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- లాభాల జోరులో మార్కెట్లు
స్టాక్ మార్కెట్లలో మూడో రోజూ లాభాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 230 పాయింట్లకుపైగా లాభంతో 50,027 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 60 పాయింట్లు పెరిగి 14,711 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- చెపాక్ బంతి ఎవరి చేతికో?
ఇంగ్లాండ్‌తో జరగబోయే టెస్టు సిరీస్ కోసం టీమ్ఇండియా నెట్స్‌లో శ్రమిస్తోంది. అయితే తుదిజట్టు కూర్పులో మాత్రం మేనేజ్మెంట్కు తలనొప్పి తగ్గేలా లేదు. బౌలింగ్ విషయానికొస్తే ఎవరిని తీసుకోవాలనే విషయంలో సందిగ్ధంలో పడింది బోర్డు. ఓవైపు అనుభవం, మరోవైపు యువ సత్తాతో కూడిన బౌలర్లలో మేటి ఆటగాళ్లను ఎంచుకోవడం కాస్త కష్టమే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
- రైతులకు మద్దతుగా రిహాన్న
ప్రముఖ పాప్ సింగర్ రిహాన్న రైతులకు మద్దతుగా చేసిన ట్వీట్‌పై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ మండిపడింది. వారు రైతులు కాదు ఉగ్రవాదులంటూ ఘాటు రిప్లై ఇచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి