ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top ten news in telangana today till now
టాప్​టెన్ న్యూస్ @9AM
author img

By

Published : Jan 18, 2021, 8:59 AM IST

  • శంషాబాద్‌ విమానాశ్రయం పరిసరాల్లో పులి

శంషాబాద్‌ విమానాశ్రయం పరిసరాల్లో పులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అర్ధరాత్రి రన్‌వే సమీపంలో 10 నిమిషాలు సంచరించినట్లు ఎయిర్​పోర్ట్ సిబ్బంది గుర్తించారు. పులి సంచారంతో భద్రతా అధికారులు అప్రమత్తమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నేడు 16,200 మందికి టీకాలు..

రాష్ట్రంలో రెండో రోజు వ్యాక్సినేషన్​కు ఆరోగ్యశాఖ సర్వసన్నద్ధమైంది. రెండోరోజు 184 కేంద్రాలను కొత్తగా నెలకొల్పడం వల్ల మొత్తం కేంద్రాల సంఖ్య 324కు చేరింది. ఒక్కో కేంద్రంలో 50 మంది చొప్పున 16,200 మంది వైద్యసిబ్బందికి టీకా వేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రక్షణ @42 రోజులు

రాష్ట్రంలో కొవిడ్‌ టీకా తొలి డోసు పొందిన వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. రెండు డోసుల మధ్య వ్యవధి 4 వారాలు ఎందుకుండాలి? 28వ రోజునే ఎందుకు రెండో డోసు తీసుకోవాలి? పూర్తి రక్షణకు 42 రోజుల సమయం ఎందుకు? తదితర అంశాలపై అవగాహన కల్పించనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • ఎన్టీఆర్​కు బాలకృష్ణ నివాళి

ఎన్టీఆర్​ 25 వ వర్ధంతిని పురష్కరించుకుని ఎన్టీఆర్​ ఘాట్​ను పూలతో అలంకరించారు. ఘాట్​ను సందర్శించిన బాలకృష్ణ... తారక రాముడికి నివాళి అర్పించారు. ఎన్టీఆర్​ ఘాట్​కు నందమూరి అభిమానులు భారీగా తరలివచ్చారు. ఎన్టీఆర్​ జోహార్​ అంటూ నినాదాలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • మహారాష్ట్రలో భూకంపం

మహారాష్ట్ర పాల్​గఢ్​లో ఆదివారం రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్​ స్కేల్​పై తీవ్రత 3.5గా నమోదైనట్లు జాతీయ భూ విజ్ఞాన కేంద్రం తెలిపింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • గుజరాత్​లో మెట్రో ప్రాజెక్టులకు శంకుస్థాపన

అహ్మదాబాద్, సూరత్ మెట్రో ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ నేడు శంకుస్థాపన చేయనున్నారు. వర్చువల్​గా మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • నల్లసముద్రంలో మునిగిన ఓడ

టర్కీ తీర ప్రాంతంలో ఓ కార్గో షిప్ నీట మునిగింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఓడలో 12 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 182 పరుగుల ఆధిక్యంలో ఆసీస్​

టీమ్​ఇండియాతో జరుగుతున్న నాలుగో(చివరి) టెస్టు నాలుగో రోజు ఆటలో భోజన విరామ సమయానికి ఆసీస్ 182 పరుగుల ఆధిక్యంలో ఉంది. ​రెండో ఇన్నింగ్స్​లో నాలుగు వికెట్లు కోల్పోయి 149 పరుగులు చేసింది. క్రీజులో స్మిత్​(28), గ్రీన్​(4) ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • 'మహాభారతం'లో కర్ణుడిగా షాహిద్​ కపూర్​!

బాలీవుడ్​ ప్రముఖ దర్శకనిర్మాత రాకేష్​ ఓం ప్రకాష్​ మెహ్రా 'మహాభారతం' చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కర్ణుడి పాత్ర కోసం హీరో షాహిద్​ కపూర్​ను ఎంపిక చేశారని సమాచారం. ఈ చిత్రం పౌరాణిక నేపథ్యమా? ఆధునిక సమకాలిన అంశాల సమాహారమా? అనేది తెలియాల్సిఉంది. ​ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

  • రూపం మనోహరం..

తెలుగు తెరపై తన పేరును శాశ్వతంగా ముద్రించుకుని.. నట సార్వభౌముడిగా.. యుగపురుషుడిగా ఖ్యాతి గడించిన నందమూరి తారక రామారావు వర్ధంతి నేడు (జనవరి 18). ఈ సందర్భంగా ఎన్నో చిత్రాల్లో తన మరపురాని నటనతో చిరస్థాయిగా నిలిచిపోయిన ఆయన గురించి ఓ ప్రత్యేక కథనం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.