ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9AM - top ten news in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top-ten-news-in-telangana-today-till-now
టాప్​టెన్ న్యూస్ @9AM
author img

By

Published : Dec 17, 2020, 8:59 AM IST

1. పెళ్లింట్లో విషాదం..

మరికాసేపట్లో పెళ్లి. బంధువులు, స్నేహితులతో ఇళ్లంతా సందడి సందడిగా ఉంది. పెళ్లి వారు వచ్చారు అనే మాట వినిపించాల్సిన చోట.. ప్రమాదం జరిగిందనే వార్త అందర్ని ఉలిక్కిపడేలా చేసింది. వివాహం జరుగుతున్న ఇంటికి నీటిని తీసుకెళ్తున్న ట్రాక్టర్​ బోల్తా పడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం చిన్నదేవడాలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

2. గీత మా అమ్మాయే..

తన కుటుంబాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్న మూగ యువతి గీత తమ అమ్మాయేనని మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం నేరడ శివారు రాయినిపట్నానికి చెందిన కోల యాకయ్య, శాంత దంపతులు తెలిపారు. భారత్‌ నుంచి తప్పిపోయి పాకిస్థాన్‌ చేరిన గీతను నాటి కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌ వెనక్కు రప్పించిన విషయం తెలిసిందే. ఆమె స్వగ్రామాన్ని గుర్తించడం కోసం స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మంగళవారం బాసర తీసుకువచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

3. చలానా కలిపింది!

అతను.. సాఫ్ట్​వేర్ కొలువు వదిలి.. సేద్యం చేస్తానని తల్లిదండ్రులకు చెప్పాడు. వారు ఒప్పుకోకపోవడం వల్ల.. జీవితాంతం తోడుగా ఉంటానని ఇల్లాలికి చేసిన ప్రమాణాన్ని, గుండెలమీద పెట్టుకుని చూసుకుంటానని కూతురికిచ్చిన మాటను తప్పి అందర్నీ వదిలేసి వెళ్లిపోయాడు. 3 ఏళ్లుగా అతని కోసం ఎదురుచూస్తున్న ఆ కుటుంబం నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. పోలీసులు విధించిన చలానా వాళ్లందర్నీ మళ్లీ కలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

4. అభివృద్ధికే కేరళ ప్రజల ఓటు..

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్​డీఎఫ్​ పార్టీ సంపూర్ణ ఆధిపత్యం కనబరిచింది. లెఫ్ట్ పార్టీని గద్దె దింపాలన్న యూడీఎఫ్, ఎన్​డీఏ కూటముల ఎత్తులు ఫలించలేదు. ముఖ్యమంత్రి పినరయి విజయన్ సారథ్యంలోని ఈ పార్టీ మున్సిపాలిటీలు మినహా మిగతా అన్నిట్లో జోరు కొనసాగించింది. ఈ ఎన్నికల్లో ప్రజలు సీనియర్లను కాదని యువతకు పట్టం కట్టడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

5. నిపుణులకు 'టీకా' శిక్షణ

కరోనా టీకాల మూడో దశ ప్రయోగాల కోసం పొరుగుదేశాలకు చెందిన వంద మంది నిపుణులకు శిక్షణ ఇచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అఫ్గానిస్థాన్, భూటాన్, మాల్దీవులు, మారిషస్, నేపాల్, శ్రీలంకకు చెందిన నిపుణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపింది. మరింత మంది నిపుణులకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

6. భారత శక్తి... బంగ్లాదేశ్ విముక్తి!

1971 పాకిస్థాన్​ యుద్ధంలో భారత్ విజయం సాధించి యాభయ్యేళ్లు అవుతోంది. పాక్ నుంచి విడివడి నూతన దేశంగా ఆవిర్భవించిన బంగ్లాదేశ్‌కు భారత్‌తో విడదీయలేని పేగుబంధం ఏర్పడింది. ఈ సందర్భంగా అప్పటి రోమాంచిత ఘట్టాన్ని ప్రస్తావించుకోవడం ఎంతైనా అవసరం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

7. ఇక ఇంటివద్దే కొవిడ్​ టెస్ట్​

అమెరికాలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న నేపథ్యంలో.. ఇంటివద్దే చేసుకునే నూతన యాంటీజెన్ టెస్ట్ విధానానికి అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. ఆస్ట్రేలియా కంపెనీ ఎల్యూమ్​ అభివృద్ధి చేసిన ఈ 'హోమ్ కొవిడ్​ టెస్టు'తో పరీక్ష చేసుకుంటే 20 నిమిషాల్లోపే ఫలితం వస్తుందని ఎఫ్​డీఏ పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

8. చైనా టెలికాం సామాగ్రికి చెక్​

చైనా నుంచి దిగుమతి అయ్యే టెలికాం సామాగ్రికి అడ్డుకట్ట వేసేలా తాజా నిబంధనలకు ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ భద్రత దృష్ట్యా 'ద నేషనల్ సెక్యూరిటీ డైరెక్టివ్ ఆన్ టెలికాం సెక్టార్​'ను రూపొందించినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

9. పింక్​బాల్​తో జాగ్రత్త..

ప్రతిష్ఠాత్మక బోర్డర్​-గావస్కర్​ ట్రోఫీలో తొలిపోరుకు రంగం సిద్ధమైంది. అడిలైడ్​ వేదికగా తొలి డే/నైట్​ మ్యాచ్​ జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ఇండియా సన్నద్ధత గురించి భారత మాజీ క్రికెటర్​ వెంకటపతిరాజు తన అభిప్రాయాలను పంచుకున్నారు. గులాబి బంతి ఎక్కువగా స్వింగ్​ అవుతుందని ఆయన అంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

10. 'రామ్​ సేతు'తో అక్షయ్​ ?

బాలీవుడ్​ స్టార్​ హీరో అక్షయ్​ కుమార్​ తన అభిమానులకు మరో తీపి కబురు చెప్పారు. ఆయన నటిస్తున్న కొత్త సినిమా 'రామ్ సేతు' విడుదల తేదీని ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.