ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @ 9PM - Telugu top news in Telugu

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​టెన్​ న్యూస్​ @ 9PM
author img

By

Published : Jul 18, 2021, 9:00 PM IST

త్వరలో "తెలంగాణ దళిత బంధు పథకం"

రాష్ట్రంలో త్వరలో తెలంగాణ దళిత బంధు పథకం అమలు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఎస్సీ సాధికారత పథకానికి 'తెలంగాణ దళిత బంధు' పేరు ఖరారు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ప్రాంతీయభాషల్లో నిర్వహించాలి

కేంద్రమంత్రి జితేంద్రసింగ్​కు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషల్లో నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కంటోన్మెంట్​పై వెంకయ్య నాయుడు.!

కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్యపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవ తీసుకున్నారు. సమస్యను పరిష్కరించాలని రక్షణశాఖ సహాయ మంత్రికి సూచించారు. విషయాన్ని పరిశీలించి, తెలియజేస్తామని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్.. ఉపరాష్ట్రపతికి తెలిపారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'హక్కులపై గళమెత్తుతాం'

ఏపీ పునర్విభజన చట్టంలో పరిష్కారం కాని అంశాలు చాలా ఉన్నాయని తెరాస లోక్‌సభ పక్షనేత నామ నాగేశ్వరరావు అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రానికి దక్కాల్సిన న్యాయపరమైన హక్కులపై గళమెత్తుతామని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జమున ఆసక్తికర వ్యాఖ్యలు

హుజూరాబాద్‌లో పోటీపై ఈటల రాజేందర్‌ సతీమణి జమున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పోటీలో తానున్నా.. రాజేందర్‌ ఉన్నా ఒకటేనని పేర్కొన్నారు. ఎవరు పోటీ చేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న ఆమె.. ఎవరికి అవకాశం వస్తే వారు బరిలో ఉండాలని యోచిస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ధరల అస్త్రంతో సిద్దమైన విపక్షాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. కీలక బిల్లులు ఆమోదించుకోవాలని మోదీ సర్కారు భావిస్తుండగా.. ధరల పెరుగుదల, కరోనా నియంత్రణ వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం అవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

జాతి ఔన్నత్యానికి ప్రతీక

మధురమైన తెలుగు భాషను భావితరాలకు అందించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. మాతృభాష..జాతి ఔన్నత్యానికి ప్రతీక అని పేర్కొన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్న అంతర్జాల అష్టావధానాన్ని ప్రారంభించిన ఆయన.. తెలుగువాడు భాషాభిమాని తప్ప దురాభిమాని కాదన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'ప్రజలకు హెచ్చరిక'

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో భారీ వర్షాలు పెను విషాదాన్ని మిగిల్చాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ప్రమాదాల్లో 25 మంది మృత్యువాత పడ్డారు. చెంబూరులో కొండచరియలు విరిగిపడి 17 మంది మృతి చెందగా... విఖ్రోలి ప్రాంతంలో ఓ భవనం కూలి ఏడుగురు, మరోచోట గోడ కూలి ఒకరు చనిపోయారు. భారీ వర్షాల నేపథ్యంలో మంచినీరు కచ్చితంగా కాచి, తాగాలని సూచించింది బీఎంసీ. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆదాయం 230% వృద్ధి​!

పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు సామాన్యులకు భారంగా మారగా.. ప్రభుత్వానికి కాసుల పంట కురిపించినట్లు తెలుస్తోంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెట్రోలియం విభాగం ద్వారా కేంద్ర ఆదాయం 45 శాతానికి పైగా పెరిగినట్లు గణాంకాలు చెబుతుండటమే ఇందుకు ఉదాహరణం.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

అరంగేట్రంలోనే అదరగొట్టాడు

అరంగేట్ర మ్యాచ్​లో ఇషాన్​ కిషన్​ అదరగొట్టాడు. శ్రీలంకాతో జరుగుతున్న తొలి వన్డేలో కేవలం 33 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. ఇషాన్​ క్రీజులో ఉన్నంతసేపు లంక బౌలర్లకు చెమటలు పట్టించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.