కొత్తగా 729 కేసులు
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 729 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా వైరస్‌తో ఐదుగురు మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 9,980 యాక్టివ్ కేసులున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఉపఎన్నికపై పీసీసీ .!
హుజూరాబాద్ ఉప ఎన్నికపై రాష్ట్ర కాంగ్రెస్ దృష్టి సారించింది. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ కార్యవర్గం సమావేశమై ఉపఎన్నికపై చర్చించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
రేపటి నుంచే ఓపెన్
సినిమా థియేటర్లను ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కోరింది. ఈ మేరకు ఛాంబర్ సభ్యులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను శనివారం కలిశారు. రాష్ట్రంలో థియేటర్ల పునఃప్రారంభానికి చొరవ చూపాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
''త్వరలోనే 'తెలంగాణ చేపలు'
రాష్ట్రంలో 'తెలంగాణ చేపలు' బ్రాండ్ పేరిట మార్కెటింగ్ నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. ఉచిత చేపపిల్లల పంపిణీ ద్వారా రాష్ట్రంలో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'అన్ని మండలాల్లో వనాలు'
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పచ్చదనాన్ని పెంపొందించే సంకల్పంతో గ్రామీణ ప్రాంతాల్లోని మండలాల్లో బృహత్ ప్రకృతి వనాలను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించినట్లు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. అన్ని గ్రామీణ మండలాల్లో బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటు కోసం 5300 ఎకరాల భూమిని గుర్తించినట్లు ఆయన చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'మోదీవల్లే సాధ్యమైంది'
ప్రధానిగా నరేంద్ర మోదీ వల్లే దేశానికి స్వతంత్ర భద్రతా విధానం లభించిందన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశ సార్వభౌమత్వాన్ని సవాల్ చేసే వారికి అదే రీతిలో సమాధానమిస్తామని హెచ్చరించారు. డ్రోన్ల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో.. స్వదేశీ యాంటీ డ్రోన్ సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'అక్టోబర్ 1 నుంచేె'
అక్టోబర్ 1 నుంచి ఈ ఏడాది కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని యూజీసీ వెల్లడించింది. ఆగస్టు 31 లోపు చివరి సంవత్సర పరీక్షలు నిర్వహించాలని యూనివర్సిటీలను ఆదేశించింది. ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈనెల 19 నుంచే.!
దగ్గరి ప్రాంతాలకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఈ నెల 19 నుంచి అన్ రిజర్వ్డ్ సర్వీసులను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా ఈ రైళ్లు నడపబడతాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఓ ఇంటివాడైన భారత ఆల్‌రౌండర్
భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఓ ఇంటివాడయ్యాడు. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు దూబే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఆ ఇయర్‌ఫోన్స్ ధర ఎంతో తెలుసా!
ఓ సంస్థకు చెందిన ఇయర్‌ఫోన్స్ ధర ఏకంగా లక్ష రూపాయలు పలుకుతోంది. మరి ఈ ఇయర్‌ఫోన్స్ విశేషాలేంటో తెలుసుకోండి.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.