జలవిద్యుత్ ఉత్పత్తి ఆపండి
జలవిద్యుత్ ఉత్పత్తి ఆపాలని ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. తెలంగాణ జెన్‌కో సంచాలకుడికి కేఆర్ఎంబీ సభ్యుడు మౌంతాంగ్ లేఖ రాశారు.
శ్రీశైలం ఎడమగట్టులో విద్యుత్ ఉత్పత్తికి నీటి విడుదల ఆపాలని లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బోర్డుల పరిధిపై రేపు గెజిట్ విడుదల
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిపై కేంద్ర జల్‌శక్తి శాఖ రేపు గెజిట్ నోటిఫికేషన్లు విడుదల చేయనుంది. తెలుగు రాష్ట్రాల జలవివాదం నేపథ్యంతో ఈ గెజిట్లకు ప్రాధాన్యత ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ గెజిట్లు విడుదల చేయనున్నట్టు సమాచారం. గెజిట్లలో ప్రాజెక్టుల పరిపాలన, నియంత్రణ, నిర్వహణ అంశాలు పొందుపర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఈనెల 26 నుంచే.!
కొత్త రేషన్ కార్డుల(New Ration Cards) పంపిణీ ఈనెల 26వ తేదీ నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) ఆదేశించారు. పౌరసరఫరాల శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ
స్వరాష్ట్ర ఫలాలను వర్తమాన, భవిష్యత్ యువతకు పూర్తి స్థాయిలో అందించేలా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణను తీర్చిదిద్దుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ప్రపంచ యువజన నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా యువతకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'రేపు చలో రాజ్‌భవన్..!'
పెరిగిన ఇంధన ధరలకు నిరసనగా హైదరాబాద్‌లో రేపు చలో రాజ్‌భవన్ కార్యక్రమానికి కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఈ మేరకు కార్యకర్తలు అందరు పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'అది దేశానికి అవసరం'
మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవడం అత్యంత ప్రాధాన్యమని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. వరల్డ్ యూత్ స్కిల్స్ డే సందర్భంగా యువతకు ఆయన మార్గనిర్దేశం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'ఆ చట్టం అవసరమా..!'
దేశద్రోహం చట్టం(ఐపీసీ సెక్షన్ 124ఏ)పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతున్నప్పటికీ రాజద్రోహం కేసుల నమోదుకు వీలు కల్పిస్తున్న 124ఏ సెక్షన్‌ను అమలు చేయడం వెనక ఆంతర్యం ఏమిటని కేంద్రాన్ని ప్రశ్నించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
జేఈఈ కొత్త తేదీలివే..!
జేఈఈ మెయిన్ నాలుగో విడత షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ కేంద్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అలాగే.. నాలుగో ఎడిషన్ జేఈఈ దరఖాస్తుల గడువు ఈనెల 20 వరకు పొడిగించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
బంగారం తగ్గేదెప్పుడు?
బంగారాన్ని నగల రూపంలో మహిళలు ధరిస్తారు. అలంకరణకే కాకుండా ఆర్థికంగా కూడా దీనివల్ల ప్రయోజనాలు ఉన్నాయి. ఏఏ కారణాల వల్ల బంగారం ధర పెరుగుతుంది, తగ్గుతుంది? బంగారం ఎలాంటి సందర్భాల్లో కొనుగోలు చేయాలి? తదితర విషయాలు తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
'కోహ్లీసేనలో స్పష్టత లేదు..'
టీమ్ఇండియాలో(Teamindia) జట్టు కూర్పులో సరైన స్పష్టత ఉండట్లేదని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్(Mohammed kaif) అన్నాడు. ఈ విషయాన్ని అందరూ అంగీకరించాలని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.