ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM - Telugu top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @ 9PM
టాప్​ టెన్​ న్యూస్​ @ 9PM
author img

By

Published : Jul 7, 2021, 8:59 PM IST

మోదీ​ టీం ఇదే..

కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో 43 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు. పలువురికి పదోన్నతి కల్పించగా.. కొంత మంది కొత్తవారికి చోటు కల్పించారు. ప్రమాణస్వీకారం చేసిన వారిలో మొత్తం 15 మందికి కేబినెట్​ హోదా దక్కింది. మరో 28 మంది సహాయ మంత్రులు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సామాన్య కార్యకర్త నుంచి..!

కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. భాజపా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన మొదటి మంత్రివర్గ విస్తరణలో కిషన్​రెడ్డికి పదోన్నతి దక్కింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

'సమష్టి పోరాటంతోనే అధికారం'

అమరవీరుల ఆశయాలు నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు నూతన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన అనంతరం గాంధీభవన్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, భాజపాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

షర్మిల షెడ్యూల్​ ఇదే..

వైఎస్సార్​ జయంతి సందర్భంగా వైఎస్​ షర్మిల పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. షర్మిల షెడ్యూల్​ సైతం ఖారారైంది. వైఎస్సార్​ సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి అనంతరం హైదరాబాద్​కు చేరుకుని​ పార్టీని ప్రకటించనున్నారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కేటీఆర్​ లేఖ

కరోనా సంక్షోభం క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో తెలంగాణలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) పరిశ్రమలకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

కీలక నేతల రాజీనామాలు

కేంద్ర కేబినెట్ విస్తరణకు ముందే పలువురు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. కేబినెట్ మంత్రులైన రమేశ్ పోఖ్రియాల్, సదానంద గౌడ, హర్షవర్ధన్, ప్రకాశ్ జావడేకర్, రవిశంకర్ ప్రసాద్​.. రాజీనామా సమర్పించారు. మొత్తం 12 మంది మంత్రుల రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ఆ విషయంలో జోక్యం చేసుకోలేం

కరోనా నుంచి కోలుకున్న వారికి అవసరమైన చికిత్సలతో పాటు... మానసిక కౌన్సెలింగ్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా చికిత్సల గరిష్ఠ ధరలకు సంబంధించిన జీవోకు కోరలు సరిగా లేవని అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

హైకోర్టు సీరియస్‌

ఉస్మానియా ఆస్పత్రి (Osmania Hospital) నిర్మాణంపై ఆరు వారాల్లో తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు (High court) ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణ వివాదంపై విచారణ జరిపిన ధర్మాసనం... ఆస్పత్రి నిర్మాణంపై ఏ నిర్ణయం తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

విమానం దారి తప్పింది.!

ఇంగ్లాండ్‌ నుంచి బయల్దేరిన శ్రీలంక క్రికెట్‌ జట్టు ప్రయాణిస్తున్న విమానం.. ఇంధన సమస్య తలెత్తడం వల్ల అకస్మాతుగా భారత్‌లో ల్యాండ్​ అయింది. దీంతో ఆటగాళ్లు, సహాయ సిబ్బంది కంగారు పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

రామ్​-కృతి జంటగా.!

టాలీవుడ్‌ యువ కథనాయకుడు రామ్‌ పోతినేని.. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి కాంబోలో తెరకెక్కబోయే సినిమా చిత్రీకరణ జులై 12 నుంచి ప్రారంభంకానుందని తెలిపింది చిత్రబృందం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.