ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @9PM
టాప్​టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : May 30, 2021, 8:58 PM IST

  • తగ్గిన ఉద్ధృతి..

రాష్ట్రంలో కొత్తగా 1,801 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​ బారినపడి మరో 16 మంది మృతి చెందారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • లాక్​డౌన్​ పొడిగింపు..

రాష్ట్రంలో లాక్‌డౌన్ మ‌రో 10 రోజులు పొడిగిస్తూ రాష్ట్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • హస్తినకు ఈటల..

మాజీమంత్రి ఈటల రాజేందర్ భాజపాలో చేరుతున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఆయన దిల్లీకి బయల్దేరి వెళ్లారు. రేపు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఈటల కలవనున్నారు. ప్రస్తుతం కరీంనగర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్... రేపు ఉదయం దిల్లీ వెళ్లనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మ‌రో 7 మెడిక‌ల్ కాలేజీలు..

రాష్ట్రంలో కొత్తగా మరో 7 వైద్య కళాశాలల ఏర్పాటు కాబోతున్నాయని మంత్రి కేటీఆర్​ వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడక ముందు 4 వైద్య కళాశాలలే ఉన్నాయన్న కేటీఆర్‌... 2014 తర్వాత ప్రభుత్వం 5 వైద్య కళాశాలలు నిర్మించిందని పేర్కొన్నారు. మెడికల్​ కళాశాలలతో పాటు 13 నర్సింగ్​ కాలేజీలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రిజిస్ట్రేషన్​ @పోస్టాఫీస్​..

వ్యాక్సిన్​ రిజిస్ట్రేషన్​ కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు తపాలా శాఖ ముందుకొచ్చింది. స్థానిక తపాలా కార్యాలయానికి వెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని ఆ శాఖ అధికారులు తెలిపారు. ఇందు కోసం ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని... ఉచితంగా సేవలు వినియోగించుకోచ్చని చెప్పారు.

  • రుతుపవనాల రాక ఆలస్యం..

నైరుతి రుతుపవనాల రాక రెండు రోజులు ఆలస్యం కానుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ 3న ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశముందని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • 10 కోట్ల కొవిషీల్డ్​ డోసులు సరఫరా..

జూన్​లో కొవిషీల్డ్(Covishield)​ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి.. 9-10 కోట్ల డోసులు సరఫరా చేస్తామని కేంద్రానికి తెలిపింది సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియా. మహమ్మారితో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ తమ ఉద్యోగులు రోజులో 24 గంటలు పని చేస్తున్నారని పేర్కొంది. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • తారాస్థాయికి సీఎస్​ వివాదం..

బంగాల్​ ప్రభుత్వ సీఎస్​ ఆలాపన్​ బంధోపాధ్యాయ్​ సోమవారం దిల్లీలో రిపోర్ట్​ చేయటం లేదని అధికార వర్గాలు తెలిపాయి. ఉదయం 10 గంటలకు దిల్లీ రావాలని డీఓపీటీ ఇచ్చిన నోటిఫికేషన్​ను పక్కనపెట్టే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • మిల్కా సింగ్ డిశ్ఛార్జ్..

భారత స్టార్ అథ్లెట్ మిల్కా సింగ్ ఆదివారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారినపడిన ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

  • జాస్మిన్​, కిటీ​లతో సరదాగా!

బాలీవుడ్​ బ్యూటీ దిశా పటానీ(Disha Patani).. వారంతపు సమయాన్ని తన పెంపుడు జంతువులతో గడుపుతోంది. పెంపుడు పిల్లులు జాస్మిన్​, కిటీ​లతో కలిసి ఉన్న ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పంచుకుంది. వీటిపై పలువురు అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.