ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @9PM
టాప్​టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Apr 24, 2021, 9:00 PM IST

  • కేంద్రం కొత్త మార్గదర్శకాలు..

మే1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి కరోనా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది కేంద్రం. మరిన్ని ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉచితంగా టీకా..

రాష్ట్రంలో అందరికీ కొవిడ్ టీకా ఉచితంగా ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర సొంత జనాభాతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు వచ్చి పనిచేస్తున్న వారందరికీ వయసుతో సంబంధం లేకుండా వ్యాక్సినేషన్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మరో రెండు కొత్త మండలాలు..

రాష్ట్రంలో మరో రెండు కొత్త మండలాలు ఆవిర్భవించాయి. మహబూబ్​నగర్​ జిల్లాలో మహమ్మదాబాద్​, వికారాబాద్​ జిల్లాలో చౌడాపూర్​ పేరిట కొత్త మండలాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు..

మినీ పురపోరు ఏర్పాట్లపై ఎస్‌ఈసీ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించింది. ఈ సమావేశంలో పోలీసు ఉన్నతాధికారులు, ప్రజారోగ్య సంచాలకులు, ఎన్నికల పరిశీలకులు పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణపై పలు ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఓరుగల్లు భాజపాదే..

ఓరుగల్లులో అన్ని సర్వేలు భాజపాకు అనుకూలంగా ఉన్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ వెల్లడించారు. కమలం పార్టీ పూర్తి మెజార్టీతో గెలబోతోందన్నారు. ఓరుగల్లులో 40 సీట్లకు పైగా గెలవబోతున్నామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఏపీలో కరోనా ఉద్ధృతి..

ఆంధ్రప్రదేశ్​లో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. ఏపీ వ్యాప్తంగా 50,972 పరీక్షలు నిర్వహించగా.. 11,698 కేసులు నిర్ధరణ అయ్యాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆస్పత్రి తీరుపై వీడియో- మరుసటి రోజే మృతి..

'సరైన వైద్యం అందించకుండా నన్ను చంపేస్తారు, ఇక్కడి నుంచి తీసుకెళ్లండి'అని వీడియో చేసిన ఓ యువకుడు మరుసటి రోజునే కన్నుమూశాడు. ఈ ఘటన బెంగళూరు రూరల్​ జిల్లాలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అంతరిక్ష కేంద్రాన్ని చేరుకున్న వ్యోమగాములు..

స్పేస్​ఎక్స్​ నౌక ద్వారా నలుగురు వ్యోమగాములు అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. ఆరు నెలల పాటు వీరు అక్కడ వివిధ పరిశోధనలు చేపట్టనున్నారు. ప్రస్తుతం అంతరిక్ష కేంద్రంలో మొత్తం 11 మంది ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హాకీ మాజీ అంపైర్​ మృతి..

హాకీ మాజీ అంపైర్​ సురేష్ కుమార్ ఠాకుర్​ కరోనా సంబంధిత సమస్యల కారణంగా మరణించారు. 51 ఏళ్ల ఠాకుర్​ మొహాలీలో మృతి చెందినట్లు హాకీ ఇండియా ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బన్నీ-ప్రశాంత్‌ల చిత్రం అప్పుడే!

వచ్చే ఏడాది జనవరిలో ప్రశాంత్​ నీల్​-అల్లు అర్జున్​ కాంబోలో ఓ సినిమా తెరకెక్కనుందని జోరుగా ప్రచారం సాగుతోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.