ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @9PM
TOP TEN NEWS @9PM
author img

By

Published : Apr 15, 2021, 8:59 PM IST

  • టెన్త్, జూనియర్ ఇంటర్ పరీక్షలు రద్దు..

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ ఆదేశాలు జారీ చేశారు. కరోనా ఉద్ధృతి దృష్ట్యా పదో తరగతి పరీక్షలు రద్దు చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పరీక్షలు లేకుండా పై తరగతులకు..

కరోనా 2.0 ఉధృతమవుతున్నందువల్ల చాలా రాష్ట్రాలు పాఠశాలల్ని మూసివేశాయి. ప్రస్తుత పరిస్థితుల్లో పరీక్షలు నిర్వహించడం కష్టంగా మారడం వల్ల అవి లేకుండానే.. విద్యార్థులను పై తరగతులకు పంపించాలని నిర్ణయం తీసుకున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముగిసిన ఎన్నికల ప్రచారం..

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 17న పోలింగ్​ జరగనుంది. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • షర్మిల దీక్ష భగ్నం..

వైఎస్​ షర్మిల చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అనుమతి సమయం ముగిసినా దీక్ష కొనసాగించడంతో షర్మిలను అక్కడి నుంచి తరలించారు. అనంతరం ఇందిరాపార్క్ నుంచి లోటస్‌పాండ్‌కు నడిచి వెళ్లేందుకు షర్మిల యత్నించగా.. తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై అడ్డుకుని లోటస్​పాండ్​కు తరలించారు. రెండ్రోజులు ఇంటి ముందే దీక్ష చేస్తానని షర్మిల తేల్చి చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అత్యాచార నిందితుడికి 20ఏళ్ల కఠిన కారాగారం..

ముక్కుపచ్చలారని ఐదేళ్ల చిన్నారిపై ఆఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి నాంపల్లి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు 10వేల రూపాయల జరిమానా విధించింది. నిందితుడికి శిక్ష పడటంతో బాలిక తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 6హత్యల కేసులో షాకింగ్ నిజాలు..!

ఏపీలోని విశాఖను గజగజ వణికేలా చేసిన ఆరు హత్యల కేసు మరో కోణంలోకి వెళ్లింది. ఈ కేసును తవ్వుతుంటే ట్విస్ట్​ల మీద ట్విస్టులు బయటకు వస్తున్నాయి. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా హత్యలు చేసిన నిందితుడు చెబుతున్న విషయాలు అవాక్కయ్యేలా ఉన్నాయి. పగ ఇప్పటిది కాదు ఏళ్ల నాటిదని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు..

కరోనా ఉద్ధృతి నేపథ్యంలో మహారాష్ట్ర తరహాలోనే మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆంక్షలను కఠినతరం చేశాయి. దిల్లీలో వారాంతపు లాక్‌డౌన్‌ ప్రకటించగా.. రాజస్థాన్‌ సర్కార్‌ రాత్రిపూట కర్ఫ్యూను రాష్ట్రమంతా విధించింది. కేసులు అధికంగా ఉన్న పది జిల్లాల్లో యూపీ ప్రభుత్వం రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. కరోనా గొలుసును తెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రెమిడెసివిర్ వాడకానికి అనుమతించండి..

రెమిడెసివిర్ ఔషధం ఎగుమతులపై నిషేధం అనంతరం మిగిలిన వాటిని దేశీయ విపణిలో పంపిణీ చేయడానికి అనుమతించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే కోరారు. దీంతో ఔషధానికున్న డిమాండ్, సరఫరాల మధ్య అంతరం తగ్గుతుందని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దిల్లీ బ్యాటింగ్..

ముంబయిలో జరుగుతున్న మ్యాచ్​లో రాజస్థాన్ జట్టు టాస్ గెలిచి, ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించింది. ఇరుజట్లు మ్యాచ్​ గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'అపరిచితుడు'​ వివాదం..

అన్నియన్​(తెలుగులో అపరిచితుడు) హిందీ రీమేక్ విషయమై హక్కులు తనవంటూ వ్యాఖ్యలు చేసిన ఈ చిత్ర నిర్మాతకు తిరిగి బదులిచ్చారు దర్శకుడు శంకర్​. దీనికి సంబంధించిన హక్కులు కేవలం తనకు మాత్రమే సొంతమని గట్టిగా చెప్పారు. నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.