ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @9PM
టాప్​టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Mar 29, 2021, 8:59 PM IST

  • ధాన్యం కొంటాం..

యాసంగిలో వచ్చే వరి ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని... ఇందుకోసం గ్రామాల్లో 6,408 కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నోముల వారసుడికే టికెట్..

నాగార్జునసాగర్​ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో తెరాస తరఫున దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య కుమారుడు భగత్​కుమార్​ను బరిలోకి దించారు. ప్రగతిభవన్​లో ముఖ్యమంత్రి కేసీఆర్ భగత్​కు బీ-ఫారమ్​ అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సాగునీరు అందించాలి..

సాగునీటి ప్రాజెక్టుల కింద సాగవుతున్న పంటలు ఎండిపోకుండా నీరందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా చూడాలని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాష్ట్రవ్యాప్తంగా హోలీ సంబురాలు..

రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు హోలీ సంబురాల్లో మునిగితేలారు. రంగులు చల్లుకుంటూ.. డీజే పాటలకు డ్యాన్స్‌లు చేస్తూ ఉత్సాహాంగా గడిపారు. కరోనా కారణంగా ఎక్కువశాతం మంది వేడుకలకు దూరంగా ఉన్నారు. మరికొన్ని ప్రాంతాల్లో నిబంధనలు పాటిస్తూ పండుగ జరుపుకున్నారు. చిన్నారులు కేరింతలు కొడుతూ.. చిందులు వేస్తూ రంగులు చల్లుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ ఘనత ఎన్టీఆర్‌దే..

నష్టపోతున్న తెలుగుజాతి ఉద్ధరణకే ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. తెలుగువారి ఆత్మగౌరవం ప్రపంచానికి చాటిన ఘనత ఎన్టీఆర్‌దేనని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • నలుగురు సజీవ దహనం..

మహారాష్ట్రలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో ఓ చిన్నారి సహా.. ఇద్దరు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రూ.12 కోట్ల బంగారం స్వాధీనం..

తిరునేల్​వేలిలో అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని ఎన్నికల అధికారులు సీజ్​ చేశారు. దీని విలువ రూ.12 కోట్లు ఉంటుందని తెలిపారు. కన్యాకుమారికి చెందిన ఓ వ్యాపారి వీటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఎప్పుడో హెచ్చరించా..

ముకేశ్​ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాల వాహనం నిలిపిన కేసులో అరెస్టైన మాజీ ముంబయి పోలీసు అధికారి వల్ల మహారాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలు తప్పవని తాను ముందే ఊహించినట్లు శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. ఈ అంశంపై కొందరు నేతలను హెచ్చరించానని ఆయన పేర్కొన్నారు. సచిన్ వాజే ఉదంతం మహా వికాస్ అగాఢీ(ఎంవీఏ) సంకీర్ణ ప్రభుత్వానికి కొన్ని పాఠాలు నేర్పిందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆడేందుకు ఎదురుచూస్తున్నా..

ఐపీఎల్​లో తిరిగి ఆడనుండటంపై స్పందించాడు భారత టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా. ధోనీ ఆధ్వర్యంలో ఆడటానికి ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టీకా తీసుకున్న మోహన్​బాబు..

టాలీవుడ్​ నటుడు మోహన్​బాబు కరోనా టీకా తీసుకున్నారు. తిరుపతిలోని తన నివాసంలో కొవిడ్​ టీకా తొలి డోసును స్వీకరించినట్లు సోమవారం ట్వీట్​ చేశారు. ఈ సందర్భంగా నిస్వార్థమైన వైద్యుల సేవను ఆయన కొనియాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.