- పులకించిన అయోధ్య..
దీపావళి సందర్భంగా చారిత్రక అయోధ్య నగరం మహా దీపోత్సవంతో వెలిగిపోయింది. 5లక్షల 51వేల దీపాలతో నిర్వహించిన ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. పండగకు ఒకరోజు ముందే దీపోత్సవ శోభతో అయోధ్యపురి మెరిసిపోయింది. కనుచూపుమేర వెలిగిన లక్షలాది దీపకాంతులతో.. అయోధ్య నగరం కాంతులీనింది. కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలతో సరయూ నదీ తీరంలో ఆధ్యాత్మికత ఉట్టిపడింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మంత్రివర్గం ఆమోదం..
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్‌లో మంత్రివర్గ సమావేశం జరిగింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ శాసనమండలిలో రాష్ట్ర గవర్నర్ కోటాలో ఖాళీ అయిన మూడు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అభివృద్ధి చేశాం.. ఆదరించండి..
తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో నిర్మించిన లక్ష రెండు పడక గదుల ఇళ్లను దశలవారీగా పంపిణీ చేస్తామన్న మంత్రి... హైదరాబాద్‌లో ఇంకా అభివృద్ధి పనులు మిగిలి ఉన్నాయని... మున్ముందు అన్ని పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ఆదాయం పెంచి పేదలకు పంచాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆ ముగ్గురి నేపథ్యం తెలుసా...?
నామినేడ్ ఎమ్మెల్సీ స్థానాలు గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్‌ను వరించాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ స్థానాన్ని పలువురు ఆశించినప్పటికీ.. వివిధ సామాజిక, రాజకీయ సమీకరణలను పరిగణనలోకి తీసుకొని ముఖ్యమంత్రి కేసీఆర్... ఈ ముగ్గురిని ఖరారు చేశారు. గవర్నర్ ఆమోదిస్తే ముగ్గురూ రేపే ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- చంద్రబాబు వాహనంలో సాంకేతిక లోపం..
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రయాణిస్తున్న కారులో సమస్య తలెత్తింది. ఫలితంగా నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద కాసేపు చంద్రబాబు వాహనశ్రేణి నిలిచిపోయింది. ఆయన విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 4 కోట్ల లీటర్లు దాటింది..
రేణిగుంట నుంచి హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ వరకు ప్రవేశపెట్టిన దూద్ దురంతో ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా సరఫరా చేసిన పాల రవాణా 12న నాటికి 4 కోట్ల లీటర్లను దాటిందని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎంపీ సుజనాకు హైకోర్టు అనుమతి..
భాజపా ఎంపీ సుజనా చౌదరి...లుక్ అవుట్ నోటీసులను సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నోటీసులను రద్దు చేయాలని కోర్టును కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. అయితే రెండు వారాలు న్యూయార్క్ వెళ్లేందుకు సుజనాచౌదరికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. సీబీఐకి వివరాలు తెలిపి వెళ్లి రావాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ర్యాపిడ్ టెస్ట్‌లు అంతా బోగస్..
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ టెస్టులు చేస్తున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ర్యాపిడ్ యాంటీజెన్ పరీక్షల్లో ఏదో బోగస్ ఉందని పేర్కొన్నారు. తాను నాలుగు సార్లు పరీక్షలు చేసుకుంటే రెండింట్లో నెగిటివ్, రెండింట్లో పాజిటివ్‌గా తేలిన క్రమంలో ఈ మేరకు అనుమానం వ్యక్తం చేశారు మస్క్. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సచిన్ సాయం..
పేద చిన్నారుల వైద్యం కోసం సచిన్ తెందుల్కర్ మరోసారి ముందుకొచ్చాడు. అసోంలోని ఓ ఛారిటబుల్ ఆసుపత్రికి వైద్య పరికరాలను అందజేశాడు. దీని వల్ల ఆ ప్రాంతంలోని రెండు వేల మంది పిల్లలకు తక్కువ ధరలో వైద్యం అందనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- దీపావళి సర్ప్రైజ్లు..
దీపావళి సందర్భంగా ప్రేక్షకులను అలరించేందుకు తమ చిత్రాల నుంచి సర్ప్రైజ్లను అందిస్తున్నాయి చిత్రబృందాలు. రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 'ఆర్ఆర్ఆర్' తారక్, చరణ్ చిత్రాలను ఇప్పటికే పంచుకోగా.. 'క్రాక్', 'మోస్ట్ ఎలిజెబుల్ బ్యాచిలర్' వంటి చిత్రాల నుంచి కొత్త అప్డేట్లు వచ్చాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.