- " class="align-text-top noRightClick twitterSection" data="">
- సీఎం కేసీఆర్ కీలక సమావేశం
పల్లెప్రగతి, పట్టణప్రగతి కార్యచరణపై అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గనిర్దేశం చేయనున్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి అమలు చేసే కార్యక్రమాలపై చర్చించేందుకు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, అటవీ అధికారులతో సీఎం ఇవాళ సమావేశం కానున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- కోటి మార్క్ దాటిన కరోనా టీకా
రాష్ట్రంలో కరోనా టీకా పంపిణీ కోటి మార్క్‌ను దాటింది. ఇప్పటి వరకు మొదటి, రెండో డోస్‌లు కలిపి మొత్తం కోటీ టీకాలు పంపిణీ చేసినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. ఈ మేరకు హర్షం వ్యక్తం చేసిన అధికార యంత్రాంగం... వ్యాక్సిన్ వేడుకలు జరుపుకుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మూడు పూటల ఆహారమా?
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆహారం సహా పలు వ్యయాలకు సంబంధించి నిధుల కేటాయింపును పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించింది. సాధారణ పడకలో రోగి ఆహారానికి ప్రస్తుతం ఉన్న రూ.40లను రూ.80కి పెంచాలని, హైప్రొటీన్ ఆహారానికి ఇప్పటివరకు.. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- పింఛన్ చెల్లించాల్సిందే
తెలంగాణ విభజనకు ముందు పదవీ విరమణ చేసిన ఏపీ గృహ నిర్మాణ మండలి ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్.. పింఛను చెల్లించకపోవడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఒకే దేశంలో ఉన్నవారిపట్ల ప్రాంతీయ వివక్ష చూపడం తగదని వ్యాఖ్యానించింది. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- పెరిగిన కేంద్రం అప్పులు
కేంద్ర ప్రభుత్వం అప్పులు అంతకంతకూ పెరగుతూ వస్తున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన తాజా వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చి నాటికి రూ.116.21 లక్షల కోట్లకు చేరాయి. గడిచిన మూడు నెలల్లో 6.3 శాతం మేర పెరిగాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- అన్నింటికీ పనిచేస్తాయి
అన్ని వేరియంట్లపైనా కొవాగ్జిన్(covaxin), కొవిషీల్డ్(covishield) టీకాలు సమర్థవంతంగా పనిచేస్తాయని స్పష్టం చేశారు ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ. డెల్టా ప్లస్ రకానికి సంబంధించి టీకాల సామర్థ్యం ఎంతమేరకు ఉందన్న విషయంపై ప్రయోగశాలల్లో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- తల్వార్‌తో దాడి- ముగ్గురు మృతి...
జర్మనీలో దారుణం జరిగింది. ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కత్తి(తల్వార్) దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- మరోసారి పెట్రో పిడుగు
చమురుధరలు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసల వరకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- కోహ్లీపై అవమానకర మీమ్
టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో(WTC Final) న్యూజిలాండ్ పేసర్ జేమిసన్ బౌలింగ్‌లో రెండుసార్లు ఔటయ్యాడు టీమ్ఇండియా కెప్టెన్ కోహ్లీ(Virat Kohli). దీంతో ఇతడిని న్యూజిలాండ్‌కు చెందిన ఓ వెబ్సైట్ ట్రోల్ చేసింది. అది కాస్త అవమానకరంగా ఉండటం వల్ల ఫ్యాన్స్ మండిపడుతున్నారు. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
- కార్తిక్ ప్రేమలో శ్రద్ధ!
కన్నడ సినిమా 'యాక్ట్ 1978' తెలుగు రీమేక్‌లో నటి ప్రియమణి(Priyamani) నటించనున్నట్లు సమాచారం. అలాగే బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్(Karhik Aryan) కథానాయకుడిగా తెరకెక్కనున్న చిత్రం 'సత్యనారాయణ్ కీ కథ'లో హీరోయిన్గా శ్రద్ధాకపూర్‌ను... పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.