విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలి
సీఎం కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. బీపీఎల్ కుటుంబాలు, ఎంఎస్‌ఎంఈలకు లాక్‌డౌన్ వేళ బిల్లులు మాఫీ చేయాలి లేఖలో కోరారు. బిల్లుల్లో లోపాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని పేర్కొన్నారు. టెలిస్కోపిక్ విధానంలో సవరిస్తే భారీగా బిల్లులు తగ్గుతాయన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
'రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది'
కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో పాత్రికేయులకు నిర్వహించిన హెల్త్ క్యాంపులో పాల్గొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
యాదగిరిగుట్టలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు
గురుపౌర్ణమిని పురస్కరించుకుని యాదగిరిగుట్టలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయినాథునికి ప్రత్యేక అభిషేకాలతో పాటు కాగడ హారతి, విశేష పూజలు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
డాక్యుమెంట్లు పోగొట్టిన బ్యాంకుకు రూ.5 లక్షల జరిమానా
ఇల్లు కొనుగోలు చేసేందుకు బ్యాంకు గృహ రుణం మంజూరు చేసింది. అందుకోసం ఒరిజినల్ డాక్యుమెంట్లను తాకట్టు పెట్టుకుంది. వాయిదాలు చెల్లించినప్పటికీ బ్యాంకు అధికారులు ఒరిజినల్ డాక్యుమెంట్లు తిరిగి ఇవ్వలేదు. బ్యాంకు సిబ్బంది పోగొట్టారని గ్రహించిన బాధితురాలు వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
దళపతి విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు
తమిళనాడు సాలిగ్రామంలో ఉన్న స్టార్ హీరో దళపతి విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. అప్రమత్తమైన పోలీసులు.. విజయ్ నివాసాన్ని తనిఖీ చేశారు. చివరకు అది ఫేక్ కాల్ అని నిర్ధరించారు. ఆ ఫోన్ చేసిన వ్యక్తిని 21ఏళ్ల విల్లుపురంవాసిగా పోలీసులు గుర్తించారు. అతడిలో సైకో లక్షణాలు కనిపించినట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
రాబిస్ టీకా.. జూనోసిస్ దినోత్సవం వాయిదా
ప్రతి సంవత్సరం జులై 6వ తేదీన నిర్వహించిన జూనోసిస్ డేను కరోనా కట్టడిలో భాగంగా వాయిదా వేస్తున్నట్టు నారాయణగూడ వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. పెంపుడు జంతువుల యజమానులు ఎవరూ రాబిస్ వ్యాక్సిన్ కోసం పశువులను ఆసుపత్రికి తీసుకురావద్దని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చైనాకు మరో షాక్.. హువావేపై ఆంక్షల దిశగా బ్రిటన్!
చైనా టెక్ దిగ్గజం హువావేపై ఆంక్షలు విధించే దిశగా బ్రిటన్ అడుగులు వేస్తోంది. దేశీయ అంతర్గత భద్రతకు ముప్పు ఉందనే కారణాలతో హువావే సాంకేతికతను దేశీయ 5జీ నెట్‌వర్క్‌లో వాడకుండా తప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
చీలిక దిశగా నేపాల్ అధికార పార్టీ!
నేపాల్ అధికార పార్టీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి. త్వరలోనే చీలికలు వచ్చే అవకాశం ఉన్నట్లు సహచరులతో చెప్పారు. అత్యవసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించి తాజా పరిస్థితులపై చర్చించారు ఓలి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
ఓటీటీ వర్సెస్ థియేటర్
కరోనా లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న రంగాల్లో సినిమా పరిశ్రమ ఒకటి. వేలాది మంది ఆధారపడే ఈ రంగానికి వెన్నెముక అయిన థియేటర్లను ఎప్పుడు పునరుద్ధరిస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. మరి కొత్త 'సినిమా'ను చూసిన ఆ కళ్లు... రెగ్యులర్ భారతీయ సినిమాను ఎలా చూస్తాయి? థియేటర్లకు ఓటీటీ ప్రత్యామ్నాయమా..? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
గంగూలీ ఆడిన గొప్ప మ్యాచ్‌ల్లో అదొకటి
ప్రస్తుత క్రికెట్లో టీ20 చాలా ముఖ్యమైన ఫార్మాట్ అని చెప్పిన బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. 2002 నాట్‌వెస్ట్ ఫైనల్లో చొక్కా తీసి గిరగిర తిప్పిన సందర్భాన్ని గుర్తుచేసుకున్నాడు. బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్‌తో జరిగిన లైవ్‌చాట్‌లో మాట్లాడుతూ ఈ విషయాల్ని పంచుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి