ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @5PM
టాప్​టెన్​ న్యూస్​ @5PM
author img

By

Published : Apr 24, 2021, 5:00 PM IST

  • రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఫ్రీగా టీకా

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు రూ.2,500 కోట్లు ఖర్చవుతుందన్న సీఎం.. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదని స్పష్టంచేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శానిటైజర్ తాగి ఐదుగురు మృతి..

కరోనా వ్యాప్తి వల్ల వైన్ షాపులు మూతపడ్డాయి. దీంతో ఆల్కహాల్ దొరక్క శానిటైజర్ తాగి ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వాణి పట్టణంలో జరిగింది.

  • అప్పుడే గ్రామ స్వరాజ్యం సాధ్యం..

జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రజలకు సీఎం కేసీఆర్​ శుభాకాంక్షలు తెలియజేశారు. పల్లెలే దేశానికి పట్టుకొమ్మలని అన్నారు. పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్ఠం చేస్తేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందనేది నిజమని పునరుద్ఘాటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాష్ట్రంపై కేంద్రం వివక్ష..

పంచాయతీరాజ్​ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పంచాయతీలకు ప్రధాని పురస్కారాలు అందించారు. ఈ తరుణంలో రాష్ట్ర స్థానిక సంస్థలకు 12 జాతీయ స్థాయి అవార్డులు దక్కాయి. వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలు, పంచాయతీలకు మోదీ పురస్కారాలు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • శ్వాస సమస్యలా..?

శ్వాస సంబంధ సమస్యలు, కొన్ని రకాల వైరస్‌ల వల్ల ఇన్‌ఫెక్షన్‌లు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే ఈ ఆసనాలను ప్రయత్నించండి. ఏ వయసువారైనా వీటిని వేయొచ్చు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తెరాస విజయం ఖాయం: పువ్వాడ

ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో తెరాస విజయం ఖాయమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. నగరానికి వెయ్యి కోట్లపైచిలుకు నిధులతో అభివృద్ధి చేసిన తెరాసను నగర ప్రజలు మరోసారి ఆశీర్వదిస్తారన్న విశ్వాసం తమకు ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'లీడ్​ఇట్​'లోకి అమెరికా..

పర్యావరణ పరిరక్షణకు, పరిశ్రమ రంగంలో మార్పుల కోసం ఏర్పాటైన ఇండియా​-స్వీడన్​​ నేతృత్వంలోని బృందంలో అమెరికా చేరటాన్ని స్వాగతించింది భారత్​. అది ప్యారిస్​ ఒప్పంద లక్ష్యాలను చేరుకునేందుకు దోహదపడుతుందని పేర్కొంది. అమెరికా నిర్ణయాన్ని స్వీడన్​ ప్రధాని సైతం స్వాగతించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఆ పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు..

దేశంలో మెడికల్ ఆక్సిజన్ సరఫరా పెంచేందుకు ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆక్సిజన్, సంబంధిత పరికరాలపై కస్టమ్స్ డ్యూటీ మినహాయిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హైదరాబాద్ రంజీ ప్లేయర్​ మృతి..

హైదరాబాద్ రంజీ ఆటగాడు అశ్విన్ యాదవ్ గుండెపోటుతో మరణించాడు. 2007 నుంచి 2009 వరకు హైదరాబాద్​ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు ఈ ఫాస్ట్​ బౌలర్. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'వాలిమై' ఫస్ట్​లుక్​ వాయిదా..

కరోనా పరిస్థితుల వల్ల తమిళ హీరో అజిత్​ నటిస్తున్న 'వాలిమై' సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేయట్లేదని ఓ ప్రకటన విడుదల చేసింది చిత్రబృందం. దీంతో ఎప్పటినుంచో దీని కోసం ఎదురుచూస్తున్న అభిమానులు నిరాశకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.