ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @5PM - ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @5PM
టాప్​టెన్​ న్యూస్ @5PM
author img

By

Published : Mar 16, 2021, 4:59 PM IST

  • ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల..

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది. ఏప్రిల్ 17న పోలింగ్‌ జరగనుంది. ఈ మేరకు ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • రాష్ట్ర మంత్రివర్గ సమావేశం..

రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ నెల 18న అసెంబ్లీలో బడ్జెట్​ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. రాష్ట్ర మంత్రివర్గం బడ్జెట్​కు ఆమోదం తెలపనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉద్యోగులను పంపించండి..

ఏపీలో పని చేస్తున్న తెలంగాణకు చెందిన మూడు, నాల్గో తరగతి ఉద్యోగులను సొంత రాష్ట్రానికి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణలో ఎక్కడైనా పని చేసేందుకు సిద్ధంగా ఉన్నవారిని రిలీవ్ చేయాలని ఆంధ్రప్రదేశ్​ సర్కారుకు లేఖ రాసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • తప్పుపడితే దేశద్రోహమేనా..

2014 నుంచి ఇప్పటి వరకు నమోదైన దేశద్రోహం కేసుల వివరాలు కోరుతూ... ఎంపీ రేవంత్​రెడ్డి లేవనెత్తిన అంశం లోక్​సభలో ఈరోజు చర్చకు వచ్చింది. కేసుల విషయంలో హోంశాఖ నుంచి తనకు లభించిన సమాధానం అరకొరగా ఉందని సభ దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భార్యను చంపి.. తానూ ఉరేసుకుని..

పెళ్లై 15 ఏళ్లు గడిచినా ఇంకా పిల్లలు కలగట్లేదన్న బాధ ఆ దంపతుల మధ్య చిచ్చు రేపింది. ఆ చిచ్చే వారి పట్ల మరణ శాసనమైంది. గొడవలు వారి మధ్య సాధారణమే అయినా... ఈసారి జరిగిన గొడవలో ఆ భర్త అత్యంత కఠిన నిర్ణయం తీసుకున్నాడు. బాధ, కోపం, ఆవేశంతో ఊగిపోయిన భర్త... భార్యను చంపేసి... తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భారత్​ రికార్డ్​..

కొవిడ్​-19 వ్యాక్సినేషన్​లో భారత్​ దూసుకుపోతోంది. సోమవారం ఒక్కరోజే 30 లక్షల మందికిపైగా వ్యాక్సిన్​ అందించి.. కొత్త రికార్డ్​ సృష్టించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'పక్కా లోకల్'తో కమల్​ ప్రచారం..

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో తను పోటీ చేస్తున్న దక్షిణ కోయంబత్తూర్​ నియోజకవర్గంలో ప్రచార జోరు పెంచారు మక్కల్​ నీది మయ్యం అధినేత కమల్​ హాసన్. పార్కులు, జిమ్​లు, చేపల మార్కెట్​లకు వెళ్లి స్థానిక ప్రజలతో మమేకమవుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పెరిగిన బంగారం, వెండి ధరలు..

బంగారం, వెండి ధరలు మంగళవారం స్పల్పంగా పెరిగాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.45 పెరిగింది. వెండి ధర కిలోకు రూ.116 పుంజుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కోహ్లీని చూసి నేర్చుకోండి..

భారత యువ బ్యాట్స్​మెన్ రిషభ్ పంత్, ఇషాన్ కిషన్​కు పలు సూచనలు చేశాడు మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. సారథి కోహ్లీని చూసి చాలా నేర్చుకోవాలని సలహా ఇచ్చాడు. తమదైన రోజున చివరి వరకు క్రీజులో ఉండి జట్టు విజయానికి తోడ్పడాలని తెలిపాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • బిజీగా ఉన్న టాలీవుడ్​ స్టార్లు!

లాక్​డౌన్ కారణంగా ఏడాది నుంచి స్టార్ హీరోల చిత్రాలేవీ విడుదల కాలేదు. దీంతో కరోనా కారణంగా వచ్చిన గ్యాప్​ను కవర్​ చేసేందుకు వరసు చిత్రాలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చేశారు. అలా వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీగా నటిస్తున్న హీరోలెవరూ? వాళ్లు చేస్తున్న చిత్రాలెవో తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.