ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్ @3PM - టాప్‌టెన్‌ న్యూస్ @3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @3PM
TOP TEN NEWS @3PM
author img

By

Published : Nov 14, 2020, 2:58 PM IST

  • దీటుగా బదులిస్తాం..

రాజస్థాన్​ జైసల్మేర్​లో జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు చేసుకున్నారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా ప్రసంగించిన ఆయన.. పాక్​, చైనాకు పరోక్ష హెచ్చరికలు పంపారు. సరిహద్దుల్లో భారత్​ సహనాన్ని పరీక్షిస్తే దీటైన జవాబు తప్పదని స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దీపావళి కానుక..

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ముంగిట నగరవాసులపై రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు కురిపించింది. జీహెచ్​ఎంసీ పరిధిలో ఆస్తిపన్ను 50శాతం రాయితీ ప్రకటించింది. ఇప్పటికే చెల్లించిన వారికి వచ్చే ఏడాది తక్కువ వసూలు చేస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. దీపావళి కానుకగా జీహెచ్​ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు రూ.14,500 నుంచి రూ.17,500 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వరద సాయం అర్హులందరికీ అందుతుందని మంత్రి భరోసా ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • భాజపా కుట్ర..

హైదరాబాద్​ గాంధీభవన్​లో జవహర్​లాల్​ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, వి.హన్మంతరావు తదితరులు పాల్గొని నెహ్రూ చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం... రాష్ట్ర ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ తరఫున దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పుష్కరఘాట్ల పరిశీలన..

ఈనెల 20 నుంచి జరగబోయే తుంగభద్ర నది పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్యే అబ్రహం పుష్కరఘాట్​లను పరిశీలించారు. భక్తుల సౌకర్యార్థం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దటీజ్ ప్రసాద్..

రోజువారీ జీవితంలో వ్యాయామాన్ని ఒక భాగం చేస్తే శారీరక దృఢత్వంతో పాటు.. మానసిక ఉల్లాసం మన దరిచేరుతుంది. ఉరుకుల పరుగుల ఈ నగర జీవనంలో రోజులో కొద్దిపాటి వ్యాయామం మనల్ని చురుకైన వ్యక్తులుగా తయారు చేస్తుంది. ఇలా రోజూ చేసే వ్యాయామంలోనూ వ్యక్తిగత రికార్డులు కొల్లగట్టవచ్చని నిరూపిస్తున్నారు.. హైదరాబాద్​కు చెందిన ప్రసాద్ వడ్డేపల్లి. ఫిట్ నెస్ కోసం సైక్లింగ్ ఎంచుకొని.. 77 వేల కిలోమీటర్లు రైడ్​ చేసి దేశంలోనే ఈ ఘనత సాధించిన వ్యక్తిగా అరుదైన రికార్డు సాధించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఈ-టికెట్‌’ తప్పనిసరి..

తుంగభద్ర పుష్కరాల్లో ‘ఈ-టికెట్​’కు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈమేరకు శుక్రవారం ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా.. ఘాట్ల వద్ద సంప్రదాయ పూజలు, పిండ ప్రదానాలు దేనికైనా టికెట్‌ ఉంటేనే అనుమతిస్తామంటూ కర్నూలు కలెక్టర్‌ వీరపాండియన్‌ స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జాతీయ సంపదగా గుర్తిస్తాం..

ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా తిరుమలలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమలలో పద్మావతి అతిథి గృహం ప్రాంగణంలో ఎర్రచందనం మొక్కలను నాటారు. ఎర్రచందనం వృక్షాల పరిరక్షణపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • టిక్​టాక్​ అమ్మకానికి డెడ్​లైన్​..

అమెరికాలో ప్రముఖ చైనా యాప్​ టిక్​టాక్ భవితవ్యంపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. తాజాగా ఆ యాప్​ను అమెరికా సంస్థలకు అమ్మేందుకు ఇచ్చిన గడువును మరో 15 రోజులు పెంచింది ట్రంప్​ సర్కార్​. మరోవైపు బైట్‌డ్యాన్స్‌లో ఒరాకిల్‌ సాంకేతిక భాగస్వామిగా ఉండేందుకు చర్చలు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కోహ్లీ నచ్చడు కానీ..

టీమ్​ఇండియా కెప్టెన్ కోహ్లీ గురించి మాట్లాడిన ఆసీస్ టెస్టు సారథి టిమ్ పైన్.. అతడితో ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పాడు. విరాట్ అంటే నచ్చకపోయినా సరే అతడి బ్యాటింగ్ స్టైల్​ను ఆస్వాదిస్తానని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'రామ్​సేతు' ఆధారంగా సినిమా..

అక్షయ్​ కుమార్ మరో సినిమాను ప్రకటించారు. ఈసారి ప్రఖ్యాత 'రామసేతు' ఆధారంగా చిత్రం తీయనున్నట్లు తెలుస్తోంది. దీపావళి సందర్భంగా కొత్త పోస్టర్లను కూడా విడుదల చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.