- వరంగల్ చేరుకున్న సీఎం..
ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్‌కు చేరుకున్నారు. వరంగల్ ఎంజీఎంను పరిశీలిస్తున్నారు. అనంతరం సెంట్రల్ జైలును సందర్శించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- పది ఫలితాలు విడుదల..
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు bse.telangana.gov.in, results.bsetelangana.org వెబ్సైట్లలో ఫలితాలు లభ్యం కానున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాధ్యతల స్వీకరణ..
టీఎస్పీఎస్సీ కొత్త ఛైర్మన్, సభ్యులు బాధ్యతలు స్వీకరించారు. కరోనా దృష్ట్యా నిరాడంబంరంగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐఏఎస్ అధికారి జనార్దన్‌రెడ్డి సహా ఏడుగురు సభ్యులను ప్రభుత్వం నియమిస్తూ రెండురోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆగిన వ్యాక్సినేషన్..
రాష్ట్రంలో వారం రోజులుగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిలిచిపోయింది. కొవిడ్ కేసుల కట్టడిలో వ్యాక్సినేషన్ కీలక భూమిక పోషిస్తోంది. కరోనా మూడో దశ ముప్పు తప్పాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్న తరుణంలో.. టీకాల పంపిణీకి బ్రేక్ పడటం ఆందోళన కలిగిస్తున్న విషయం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కొవిడ్‌పై చిన్నారి గెలుపు..
కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. పిల్లా పెద్దా, ఉన్నోడు లేనోడు అన్న తేడా లేకుండా అందరినీ పట్టిపీడిస్తోంది. వైరస్ బారిన పడిన వారు సరైన చికిత్స పొందకపోతే ఊపిరొదిలిన ఉదంతాలెన్నో ఉన్నాయి. ఈ క్రమంలో జగిత్యాల జిల్లాలో పది నెలల చిన్నారి ఈ మహమ్మారిని జయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఆస్ట్రాజెనెకా' సామర్థ్యం 90శాతం..
ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ రెండు డోసుల సమర్థత 85-90 శాతంగా ఉందని ఇంగ్లాండ్ ప్రజా ఆరోగ్య విభాగం ప్రకటించింది. 60 ఏళ్లపైబడిన వారిలో సుమారు 13వేల మరణాలను నిరోధించిందని పేర్కొంది. ఈ మేరకు వ్యాక్సిన్ తీసుకున్న వారిపై అధ్యయనం చేసి వారం నివేదికను విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వారణాసి భేష్..
కరోనా కట్టడిలో ఉత్తర్‌ప్రదేశ్ వారణాసి నగరం.. గొప్ప ఉదాహరణగా నిలిచిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తక్కువ సమయంలోనే పీటీ రాజన్ మిశ్రా ఆస్పత్రిని నిర్మించడాన్ని అభినందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తేజ్‌పాల్ నిర్దోషి..
సహోద్యోగిపై లైంగిక దాడి, అత్యాచారం కేసులో తెహెల్కా మేగజైన్ వ్యవస్థాపకుడు తరుణ్ తేజ్పాల్ను నిర్దోషిగా ప్రకటిస్తూ గోవాలోని జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు..
టెస్టు సిరీస్ లో మార్పుల కోసం బీసీసీఐ తమకు అధికారికంగా విజ్ఞప్తి చేయలేదని స్పష్టంచేసింది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు. దీంతో షెడ్యూల్ ప్రకారమే మ్యాచ్ లు జరుపుతామని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఇప్పుడు మొదలైంది కాదు..
'పూరీ మ్యూజింగ్స్'తో పలు రకాల విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్. తాజాగా 'వ్యాన్ లైఫ్' అనే అంశం గురించి వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.