ETV Bharat / city

టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM

author img

By

Published : Nov 20, 2020, 1:00 PM IST

Updated : Nov 20, 2020, 2:19 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS @1PM
టాప్‌టెన్‌ న్యూస్‌ @1PM
  • భాగ్యలక్ష్మి సాక్షిగా..

వరద సాయంపై ఎస్‌ఈసీకి భాజపా లేఖరాసినట్టు సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఖండించారు. ముందుగా చెప్పినట్టుగానే మధ్యాహ్నం 12 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఎన్నికల జిమ్మిక్కుల్లో భాగంగానే నకిలీ లేఖను సృష్టించారని, తమ సంతకాన్నే ఫోర్జరీ చేసిన ఘనత తెరాసదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

సీఎం లేఖ..

మాజీ ప్రధాని పీవీ నర్సింహరావు స్మారక తపాలా స్టాంపును హైదరాబాద్​లో విడుదల చేయాలని రాష్ట్రపతికి రాసిన లేఖలో కేసీఆర్​ కోరారు. శత జయంతి ఉత్సవాల సందర్భంగా పీవీ స్మారక తపాలా స్టాంపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • జోరుగా నామినేషన్లు..

హైదరాబాద్​ నగరవ్యాప్తంగా జీహెచ్​ఎంసీ ఎన్నికల నామినేషన్​ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అబిడ్స్​ జీహెచ్​ఎంసీ కార్యాలయానికి ఆఖరు రోజున వివిధ పార్టీల అభ్యర్థులు చేరుకుని.. నామపత్రాలను సమర్పించారు. నామినేషన్​ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు బందోబస్తును ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పోలీస్ ఉన్నతాధికారులకు బాధ్యతలు..

జీహెచ్ఎంసీ ఎన్నికల దృష్ట్యా పోలీస్ ఉన్నతాధికారులకు బాధ్యతలనిస్తూ హైదరాబాద్​ సీపీ అంజనీ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జోన్ల వారీగా బాధ్యులను నియమించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఉల్లంఘనలపై చర్యలు..

జీహెచ్ఎంసీ ఎన్నికల నియమావళి అమలులో భాగంగా పోస్టర్లు, బ్యానర్లు, ఫ్లెక్సీలను తొలగించినట్లు ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు అధికారి విశ్వజిత్ తెలిపారు. ఈ తొలగింపు ప్రక్రియ పోలింగ్ అయ్యేంతవరకు కొనసాగుతుందన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మన్యంలో మాయదారి రోగం..

ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం జిల్లాలోని అన్నెం పున్నెం ఎరుగని గిరిజనాన్ని అంతుచిక్కని వ్యాధి చుట్టుముట్టింది. ఒక్కొక్కరినీ కబళిస్తోంది. అసలే అంతంతమాత్రం వైద్యంతో నెట్టుకొచ్చే అడవి బిడ్డలు... ప్రాణాలు కాపాడుకొనే దారి తెలియక వణికిపోతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన వేళ.... గూడెంలో పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • దిల్లీని వీడనున్న సోనియా..

దేశరాజధాని దిల్లీని కొద్ది రోజుల పాటు వీడనున్నారు కాంగ్రెస్​ అధ్యక్షురాలు సోనియా గాంధీ. దిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో శ్వాసకోస సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందన్న కారణంగానే వైద్యులు ఆమెను హస్తినను వీడాలని సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో గోవా లేదా చెన్నైకి సోనియా వెళ్లనున్నట్లు పేర్కొన్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఇటలీ ప్రజలకు టీకా ఎప్పుడంటే!

రెండోసారి కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఆంక్షలతో పాటు మరిన్ని ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది ఇటలీ. అందులో భాగంగా త్వరలో అందుబాటులోకి రాబోతున్న ఫైజర్‌ టీకా కొనుగోలుకు కసరత్తులు మొదలు పెడుతుంది. కరోనా సోకే ముప్పు అధికంగా ఉన్న అందరికీ 2021 జనవరి చివరికల్లా టీకా అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అంత వయసు ఉండాల్సిందే..

అంతర్జాతీయ క్రికెటర్లకు కనీస వయోపరిమితిని ఐసీసీ ప్రవేశపెట్టింది. అన్ని ప్రపంచస్థాయి టోర్నీల్లో పాల్గొనడానికి ఆటగాళ్లకు కనీసం 15 ఏళ్లు నిండాలని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • అజిత్​కు మళ్లీ గాయం..

'వాలిమై' సినిమా షూటింగ్​లో కోలీవుడ్​ టాప్ హీరో అజిత్​కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. చికిత్స అనంతరం బాగానే ఉన్నారని, ప్రస్తుతం చెన్నైలోని తన ఇంట్లో ఉన్నారని సమాచారం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Nov 20, 2020, 2:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.