- హైదరాబాద్ ఆదర్శం..
భవన నిర్మాణ వ్యర్థాల రీ-సైక్లింగ్ ప్లాంట్‌ను మంత్రి మల్లారెడ్డి రెడ్డితో కలిసి కేటీఆర్ ప్రారంభించారు. దక్షిణ భారత్‌లోనే అతి పెద్దదైన ఈ ప్లాంట్... అత్యాధునిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించినట్టు వివరించారు. సంక్రాంతికి ఎల్బీనగర్ పరిధిలో మరో ప్లాంటున్న ప్రారంభిస్తామన్న మంత్రి... ఇంకే రెండింటి ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుమార్తెల గొంతు కోసిన తండ్రి..
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. పరిస్థితి విషమంగా ఉన్న బాలికలను సిద్దిపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగారు మోసం..
ఇల్లు అద్దెకు కావాలని వచ్చాడు. బంగారు కడ్డీలున్నాయని నమ్మించాడు. డబ్బులు అత్యవసరమున్నాయని నమ్మించాడు. చాలా చౌకకు ఇస్తానని మాయచేశాడు. ఇల్లు తాకట్టు పెట్టి మరీ ఇచ్చిన డబ్బు తీసుకుని... నకిలీ బంగారు కడ్డీలు చేతులో పెట్టి ఉడాయించాడు. ఇదంతా... కూరగాయలమ్ముకునే ఓ మహిళకు జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు ప్రారంభం..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని ఎంఎంఆర్ వ్యాయామ కళాశాలలో వ్యాయామ విద్య ప్రవేశ పరీక్షలు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న 557 మంది అభ్యర్థులకు... లాంగ్ జంప్, హై జంప్, షార్ట్ పుట్, రన్నింగ్ పోటీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మమ్మల్ని చంపేయండి..
కేసులతో తన కుమారుడిని ఇబ్బందులు పెట్టవద్దని ఓ రైతు తల్లి రోదించింది. రోజూ వేధించే కంటే అధికారులే తమను చంపేయాలని కన్నీటితో వేడుకుంది. నిజాయితీగా ఉండటం కూడా తప్పేనా అని సూటిగా ప్రశ్నించింది. కన్నకొడుకుని చొక్కాపట్టుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది. కలెక్టరే తమకు న్యాయం చేయాలని చేతులు జోడించి గోడు వెళ్లబోసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- స్వయం సమృద్ధీ ముఖ్యమే..
కొవిడ్ అనంతర ప్రపంచంలో అనేక మార్పులు వస్తాయని, సాంకేతికత కీలకంగా వ్యవహరిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ప్రపంచీకరణ ఎంత ముఖ్యమో, స్వయం సమృద్ధి సాధించడమూ అంతే ముఖ్యమని ఉద్ఘాటించారు. సులభతర వ్యాపారానికి దేశం అందిస్తున్న అవకాశాల ద్వారా ప్రజల జీవనవిధానాన్ని మెరుగుపరచాలని యువతకు పిలుపునిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 19.74 శాతం ఓటింగ్..
బిహార్ ఎన్నికల మూడో విడత పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.74 శాతం ఓటింగ్ నమోదైంది. వందల సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులుతీరారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సుప్రీంలో ట్రంప్‌కు ఊరట..
పెన్సిల్వేనియాలో పోస్టల్ ఓట్ల లెక్కింపుపై అమెరికా సుప్రీంకోర్టు అధ్యక్షుడు ట్రంప్‌కు అనుకూలంగా కీలక తీర్పునిచ్చింది. ఎన్నికల రోజున రాత్రి 8 గంటల తర్వాత వచ్చిన ఓట్లను వేరు చేసి లెక్కించాలని అధికారులను ఆదేశించింది. మరోవైపు పెన్సిల్వేనియాలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయానికి అత్యంత సమీపంలో ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కెప్టెన్సీ నుంచి తప్పించాలి..
బెంగళూరు జట్టు సారథి కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని అభిప్రాయపడ్డాడు టీమ్ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. విరాట్ పేలవమైన ప్రదర్శన వ్లలే ఆర్సీబీ టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చిందన్నాడు. దీనికి అతడు వివరణ ఇవ్వాలని అన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఉత్కంఠ కలిగించే 'గతం'..
థ్రిల్లర్ కథతో రూపొందిన 'గతం'.. అమెజాన్ ప్రైమ్ వేదికగా ప్రేక్షకుల్ని పలకరించింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఎంతలా ఆకట్టుకుంది? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.