ETV Bharat / city

టాప్ ​టెన్​ న్యూస్​ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్​ @9PM
టాప్​టెన్​ న్యూస్​ @9PM
author img

By

Published : Jun 26, 2021, 8:55 PM IST

Updated : Jun 26, 2021, 9:07 PM IST

  • పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి..

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(TPCC) అధ్యక్షుడిగా ఎంపీ రేవంత్‌రెడ్డి (Revanth Reddy)ని నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (AICC) ప్రకటించింది. ప్రస్తుతం ఆయన తెలంగాణ కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రతి కలెక్టరేట్​లో రాష్ట్ర ఛాంబర్​..

పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాల వారీగా క్లీనింగ్ ప్రొఫైల్​ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టణప్రగతి కార్యాచరణపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రామాలు, పట్టణాల్లో అన్ని శాఖలకు చెందిన విశ్రాంత ఉద్యోగులు, మాజీ సైనికుల జాబితా తయారు చేయాలని... పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో వారి సేవలను వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ప్రత్యక్ష తరగతులు వాయిదా..

కొవిడ్​ మహమ్మారి కారణంగా మూతబడిన బడులను తెరిచే విషయంలో అనిశ్చితి కొనసాగుతోంది. రాష్ట్రంలో పాఠశాలల్ని త్వరగా పునఃప్రారంభించనున్నాలన్న సమాచారం పెద్దయెత్తున కలకలం రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్​ పాఠశాలల ప్రారంభంపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • 'రాయలసీమ' అనుమతులు వాయిదా..

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతుల ప్రక్రియను కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ వాయిదా వేసింది. ఇటీవల కేంద్రం, కృష్ణా జలాల ట్రైబ్యునల్‌కు తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • కేంద్రానికి సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ లేఖ..

హైకోర్టుల్లో జడ్జిల పోస్టుల భర్తీపై.. కొలిజీయం సిఫార్సుల ఆధారంగా త్వరగా నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ లేఖ రాశారు. కరోనాతో ఉపాధి కోల్పోయిన న్యాయవాదులకు సాయం అందిచాలని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • మాట్లాడుకుందాం రండి..

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడు నెలలుగా కొనసాగిస్తున్న ఉద్యమానికి ముగింపు పలికి, చర్చలకు రావాలని రైతు సంఘాలను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్​ కోరారు. చట్టాలపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ముంబయిని వణికించిన విద్యార్థి!

ముంబయి పోలీసులకు ముచ్చెమటలు పట్టించాడు ఓ 9వ తరగతి విద్యార్థి. తాజ్​ హోటల్​కు ఫోన్​ చేసిన అతడు.. 'ఇద్దరు ఉగ్రవాదులు హోటల్​లోకి వస్తున్నారు.. పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేయండి' అంటూ ప్రాంక్​ కాల్​ చేశాడు. దాంతో.. హోటల్​ యాజమాన్యం, పోలీసులు సహా అక్కడి ప్రజలు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • పోలీసులతో యువకుల ఫైటింగ్​..

పోలీసులపై కొబ్బరిమట్టతో దాడి చేసి వీరంగం చేశారు కొందరు యువకులు. తమిళనాడు డిండిగుల్ వత్తలగుండు చెక్​పోస్ట్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాలపై వచ్చిన ఆరుగురు యువకులు తొలుత బారికేడ్లను తమ వాహనంతో ఢీకొట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • సౌరభ్​, మనులకు రజతం..

షూటింగ్​ ప్రపంచకప్​లో వెండి పతకం గెలిచారు భారత షూటర్లు సౌరభ్ చౌధరి, మను బాకర్. 10మీ.ల ఎయిర్ పిస్టోల్ మిక్స్​డ్ టీమ్ ఈవెంట్​లో రష్యా జోడీ చేతిలో ఓడారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • హాలీవుడ్​ సినిమాలో తెలుగమ్మాయి..

పలు తెలుగుచిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న తెలుగుమ్మాయి అవంతిక వందనపు హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. డిస్నీ ఛానల్ నిర్మించిన స్పిన్ చిత్రంలో నటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

Last Updated : Jun 26, 2021, 9:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.