1. కృష్ణమ్మ దోబూచులు... ప్రవాహంలో హెచ్చుతగ్గులు..!
నారాయణపూర్-జూరాల జలాశయాల మధ్య కృష్ణానదిలో వరద తగ్గుతూ... పెరుగుతూ వస్తోంది. కర్ణాటక, తెలంగాణ సరిహద్దుల్లో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి నారాయణపూర్‌కు వస్తున్న ప్రవాహాన్ని బట్టి హెచ్చుతగ్గులు నమోదవుతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
2. ధైర్యమే కరోనాకు విరుగుడు... విశ్లేషిస్తున్న వైద్యులు..
ధైర్యంగా ఉంటే కరోనాను ఇంట్లో ఉండే జయించవచ్చు. భయపడితే ఐసీయూ వరకూ వెళ్లాల్సి రావొచ్చు. కరోనాకు ఇప్పటి వరకూ సరైన చికిత్సా విధానం రాకపోయినా ఇన్ని రోజుల అనుభవంతో వైద్యులు చెబుతున్నదేమిటంటే ధైర్యమే దివ్యౌషధమని. వీరిలో కొందరైతే అసలు పరీక్షలు చేయించుకోకుండానే, కరోనా ఉన్నట్లు నిర్ధారణ కాకముందే భయంతో తనువు చాలిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
3. 'పారదర్శక పన్ను విధానం' వేదికను ప్రారంభించనున్న మోదీ
పన్ను విధానాన్ని మరింత సులభతరం చేయడం, నిజాయతీగా పన్నుచెల్లిస్తున్న వారికి బహుమతులు ఇచ్చే విధంగా పన్ను వ్యవస్థలో మరిన్ని సంస్కరణలు తీసుకురానుంది ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం. ఇందుకు సంబంధించి 'ట్రాన్స్పరెంట్ ట్యాక్సేషన్ హానరింగ్ ద హానెస్ట్' ప్లాట్‌ఫాంను నేడు ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
4. రష్యా టీకా పనిచేస్తే ప్రజలు అదృష్టవంతులే!
కొవిడ్-19 వైరస్‌కి విరుగుడుగా రష్యా అభివృద్ధి చేసిన టీకా సమర్థంగా పనిచేస్తే ప్రజలు అదృష్టవంతులేనని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ(సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్‌మిశ్రా వ్యాఖ్యానించారు. టీకా సమర్థత, భద్రత గురించి ఇంకా ఏం తెలియదని, ఇప్పుడే వ్యాక్సిన్ పనితీరు గురించి చెప్పలేమని ఆయన పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
5. హెచ్1బీ వీసా ఆంక్షలు సడలింపు- వారికి అనుమతి
హెచ్1బీ వీసాలపై ఇటీవల తాత్కాలిక నిషేధం విధించిన ట్రంప్ సర్కార్.. తాజాగా పలు ఆంక్షలను సడలించింది. నిషేధ ప్రకటనకు ముందు చేసిన ఉద్యోగాల కోసం.. తిరిగి రావాలనుకునే వీసాహోల్డర్లు దేశానికి వచ్చేందుకు అనుమతిస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అడ్వైజరీ పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
6. సింగిల్ డోసుతో 21 రోజుల్లోనే యాంటీబాడీలు
ఔషధ దిగ్గజం ఫైజర్-జర్మనీ బయోటెక్ సంస్థ, బయాన్‌టెక్‌లు సంయుక్తంగా తయారుచేస్తున్న వ్యాక్సిన్... ఆరోగ్యవంతులైన 18-55 ఏళ్ల వయస్కుల రోగనిరోధక శక్తిని ప్రభావవంతంగా బలోపేతం చేస్తున్నట్టు తేలింది.పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
7. కుదుటపడుతున్న కశ్మీరం.. సవాళ్లను దాటి శాంతి దిశగా!
గతేడాది కేంద్రం తీసుకున్న సాహసోపేత నిర్ణయాల్లోని అత్యంత ముఖ్యమైన వాటిల్లో జమ్ముకశ్మీర్ ప్రత్యేకప్రతిపత్తి హోదా రద్దు ఒకటి. అప్పటి నుంచి సామాజిక, భద్రతపరమైన మార్పులు జరిగాయి. ఉగ్రదాడులు, నిరసనలతో హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతూ ఉండే కశ్మీరం శాంతి దిశగా అడుగులు వేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
8. నాలుగేళ్ల తర్వాత ఫోన్ల మార్కెట్లోకి మైక్రోసాఫ్ట్
స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లోకి మైక్రోసాఫ్ట్ మళ్లీ ప్రవేశించింది. ఈ నేపథ్యంలో సర్ఫేస్ డ్యూయో అనే సరికొత్త రెండు తెరలుండే ఆండ్రాయిడ్ ఫోన్‌ను బుధవారం ఆవిష్కరించింది. సంప్రదాయ స్మార్ట్‌ఫోన్ కంటే మరింత ఎక్కువ ఉపయోగాలు ఈ ఫోన్‌తో ఉన్నాయని మైక్రోసాఫ్ట్ అంటోంది. అవేంటో.. దాని ధర ఎంతో తెలుసా! పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
9. భారత మహిళా క్రికెట్లో పట్టుబడ్డ తొలి డోపీ
మధ్యప్రదేశ్ ఆల్‌రౌండర్ అన్షులారావు.. నిషేధిత ఉత్పేరకాలు తీసుకున్నట్లు డోప్ పరీక్షల్లో నిర్ధరణ అయింది. దీంతో డోపింగ్‌కు పాల్పడిన భారత తొలి మహిళా క్రికెటర్‌గా నిలిచింది. తనపై రెండేళ్ల నుంచి నాలుగేళ్ల వరకు నిషేధం విధించే అవకాశముంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.
10. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు గ్రీన్ ఇండియా ఛాలెంజ్
హరితహారంలో పాల్గొన్న నటి శ్రుతిహాసన్.. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్, రానా, తమన్నాలకు ఈ సవాలు విసిరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.