ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @ 5PM

author img

By

Published : Aug 24, 2020, 5:00 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్​ న్యూస్ @ 5PM
టాప్​టెన్​ న్యూస్ @ 5PM

1. బస్సు సర్వీసుల పునః ప్రారంభం!

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్టీసీ బస్సుల పునరుద్ధరణకు చర్యలు జరిగాయి. బస్సులు నడపడంపై ఇరు రాష్ట్రాల ఆర్టీసీ అధికారులు.. హైదరాబాద్ బస్​భవన్‌లో సమావేశమయ్యారు.

పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

2. అనిశా కస్టడీకి నిందితులు

కీసర లంచం కేసులో అరెస్ట్​ అయిన నలుగురు నిందితులను కస్టడీకి అనుమతిస్తూ అనిశా కోర్టు తీర్పు వెల్లడించింది. రేపటి నుంచి 3 రోజులపాటు నాంపల్లి అనిశా కార్యాలయంలో విచారణ సాగనుంది. రూ.కోటి 10 లక్షల లంచం వ్యవహారంపై మాజీ తహసీల్దార్ నాగరాజు, వీఆర్ఏ సాయిరాజ్‌, శ్రీనాథ్, అంజిరెడ్డిని అధికారులు విచారించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

3. రాహుల్​ అలా అనలేదట!

రాహుల్ అలా అనలేదు: ఆజాద్మరో సీనియర్ నేత గులాం నబీ ఆజాద్​ కూడా రాహుల్ వ్యాఖ్యలపై స్పష్టతనిచ్చారు. సీడబ్ల్యూసీలో కానీ, బయట కానీ భాజపాకు మద్దతుగా సీనియర్లు లేఖ రాశారని రాహుల్ అనలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

4. డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంబీఏ సీటు

డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంబీఏ, పీజీడీఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు ఏఐసీటీఈ అనుమతించింది. కరోనా కారణంగా ప్రవేశ పరీక్షలు నిర్వహించలేని పరిస్థితి నెలకొన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఒక్క సంవత్సరానికి ఈ నిబంధన వర్తిస్తుందని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

5. నీ మూతి పగలకొడతా: దేశాధ్యక్షుడి వార్నింగ్

రాజకీయ నేతలు ఎంతో సహనంతో విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. కానీ.. బ్రెజిల్​ అధ్యక్షుడు జైర్​ బోల్సోనారో.. సహనం కోల్పోయి నిన్ను చితకబాదాలని ఉందని విలేకరిని బెదిరించారు. ఒక్కసారిగా అంత ఆగ్రహానికి గురి కావటానికి కారణం ఏంటి? ఆ విలేకరి అడిగి ప్రశ్నేంటి ? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

6. 'కోమాలోకి ఉత్తర కొరియా అధినేత కిమ్'

ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్ ఉన్ కోమాలోకి వెళ్లినట్లు దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడి సహచరుడు వ్యాఖ్యానించారు. కొంతకాలంగా కిమ్ ఆరోగ్య పరిస్థితిపై ఊహాగానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

7. దేశీయంగా ఐఫోన్ ఎస్​ఈ2 ఉత్పత్తి షురూ

భారత్​లో సెకండ్ జనరేషన్​ ఐఫోన్​ ఎస్​ఈ మోడళ్ల ఉత్పత్తి ప్రారంభించినట్లు యాపిల్ ప్రకటించింది. వీటిని త్వరలోనే దేశీయంగా విక్రయానికి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వెల్లడించింది.

పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

8. ఆర్థిక షేర్ల అండతో దూసుకెళ్లిన మార్కెట్లు

ఆర్థిక షేర్ల అండతో స్టాక్ మార్కెట్లు వారంలో మొదటి రోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 364 పాయింట్లు పుంజుకుంది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 11,450 మార్క్ దాటింది. కరెన్సీ మార్కెట్లో రూపాయి 52 పైసలు బలపడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

9. బ్యాట్స్​మన్​కు ఫ్రీ హిట్ ఉంది.. మరి బౌలర్లకు?

బ్యాట్స్​మన్ ఫ్రీ హిట్​తో లాభం పొందుతున్నారని, ఇలాంటి నిబంధనే బౌలర్లకు తీసుకురావాలని అభిప్రాయపడ్డాడు సీనియర్ స్పిన్నర్ అశ్విన్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

10. సోనూ దాతృత్వం.. 20 వేల మంది కూలీలకు ఉద్యోగాలు

ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సోనూసూద్.. 20 వేల మంది వలసకూలీలకు పని కల్పించారు. వారందరికీ నోయిడాలో ఉద్యోగాలు ఇప్పించినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.