ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @5 PM - టాప్‌టెన్ న్యూస్ @5 PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

top news till now
టాప్​టెన్​ న్యూస్ @5 PM
author img

By

Published : May 28, 2021, 4:58 PM IST

ఇంకా అనుమతులు రాలేదు

కరోనా మందుపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలపై కృష్ణపట్నం ఆనందయ్య స్పందించారు. తన మందుకు ఇంకా అనుమతులు రాలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియా, కొన్ని టీవీల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. మందు తయారీకి అవసరమైన ఆకులు, దినుసులు ప్రస్తుతం సిద్దంగా లేవని వెల్లడించారు. ఎవరూ వదంతులు నమ్మి కృష్ణపట్నం గ్రామానికి రావొద్దని కొరారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరోసారి దర్యాప్తు

కరోనా మహమ్మారి మూలాలపై మరోసారి దర్యాప్తు చేపట్టాలన్న ప్రపంచ దేశాల డిమాండ్​కు భారత్​ మద్దతు పలికింది. ఈ విషయంపై విదేశాంగ శాఖ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పరువు హత్య

కుమార్తెను ప్రేమించాడనే కోపంతో ఓ యువకుడిని తండ్రి కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా పలమనేరు మండలం పెంగరగుంటలో జరిగింది. గ్రామంలో ఓ యువతిని ధనశేఖర్ రెండేళ్లుగా ప్రేమిస్తున్నాడు. ధనశేఖర్‌ను యువతి తండ్రి బాబు దారుణంగా హతమార్చాడు. బాబు పొలంలోనే ధనశేఖర్ మృతదేహం లభించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వెదర్ రిపోర్ట్

రాగల మూడు రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్​లో వచ్చే 48 గంటల్లో 38 నుంచి 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మోదీ, మమతా భేటీలో హైడ్రామా!

బంగాల్​లో ప్రధాని నరేంద్ర మోదీతో మమతా బెనర్జీ భేటీకి ముందు హైడ్రామా నెలకొంది. యాస్​ తుపాను ప్రభావంపై మోదీ సమీక్ష సమావేశం నిర్వహించగా.. ఆలస్యంగా వచ్చారు దీదీ. సుమారు 30 నిమిషాలపాటు మోదీని వెయిట్​ చేయించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'డిసెంబర్​ నాటికి​ పూర్తి'

దేశంలో 2021 డిసెంబర్​ నాటికి వ్యాక్సినేషన్​ పూర్తవుతుందని తెలిపారు కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​. మొత్తం 216 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఆ టీకాలు భారత్​కు రావా?

కొవిడ్​ కట్టడిలో భాగంగా.. మరిన్ని టీకా కంపెనీలను దేశంలోకి రప్పించేందుకు భారత్​ ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితం రావడం లేదు. ఇప్పటివరకు రష్యాకు చెందిన స్పుత్నిక్-వి మాత్రమే భారత్​లోకి అడుగుపెట్టింది. భారత్‌ పరిస్థితి చూస్తే మరికొన్ని నెలల పాటు టీకా ఉత్పత్తిలో పురోగతి కనిపించే అవకాశం లేదు. అమెరికా వద్ద గోదాముల్లో పడి ఉన్న ఆరు కోట్ల ఆస్ట్రాజెనెకా టీకాలు భారత్‌కే వస్తాయన్న గ్యారెంటీ లేదు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తగ్గిన బంగారం ధర

బంగారం ధర (Gold Price today) శుక్రవారం కాస్త తగ్గింది. పది గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో రూ.48 వేల దిగువకు చేరింది. వెండి ధర (Silver rate today) మాత్రం స్వల్పంగా రూ.61 పెరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ఆశలు గల్లంతు..

భారత స్టార్​ షట్లర్లు కిదాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్​.. ఒలింపిక్స్​(Tokyo BWF) ఆశలు ఆవిరయ్యాయి. మెగా ఈవెంట్​కు ముందు ఎలాంటి అర్హత టోర్నీలు ఉండవని ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య(BWF) స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరూ ఒలింపిక్స్​లో పాల్గొనే అవకాశాన్ని కోల్పోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

హీరోగా సేతుపతి​ ఎంట్రీ!

విలక్షణ నటుడు విజయ్​ సేతుపతి టాలీవుడ్​లో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నాయి సినీవర్గాలు. ఆయన కథానాయకుడిగా ప్రముఖ నిర్మాణసంస్థ మైత్రీ మూవీ మేకర్స్​ ఓ సినిమా తెరకెక్కించనుందని ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.