1.నరసింహావతారంలో భద్రాద్రి రాముడు
భద్రాద్రి రాముడు నరసింహావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు భాగంగా అధ్యాయనోత్సవాల నాలుగోరోజైన శుక్రవారం హిరణ్య సంహారుడై భక్తుల పూజలందుకుంటున్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2.మార్చి నాటికి ప్రతి పల్లెకు..
మిషన్ భగీరథ పథకాన్నికేంద్రం ప్రశంసించి... పురస్కారాలు ఇచ్చింది కానీ... ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యానించారు. వచ్చే మార్చి నాటికల్లా ప్రతి పల్లెకు, గూడానికి భగీరథ నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3.వివాహ బంధంతో ఒక్కటి కావాలనుకున్నారు.. ఇంతలోనే..
ఏపీలోని విశాఖ జిల్లా గాజువాక శ్రీనగర్‌లో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. ఇవాళ రిజిస్టర్ వివాహం చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్న ప్రేమజంట... ఇంతలో అఘాయిత్యానికి పాల్పడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4.కొవిడ్ ఆస్పత్రుల్లో తనిఖీలకు సుప్రీం ఆదేశాలు
కొవిడ్ ఆస్పత్రుల్లో అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో పరిశీలించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను సుప్రీం కోర్టు ఆదేశించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5.రాహుల్ చెప్పేవన్నీ..
పార్లమెంటరీ ప్యానెల్ కమిటీ భేటీ నుంచి రాహుల్ గాంధీ వాకౌట్ చేసేందుకు దారి తీసిన పరిణామాలను.. కమిటీ ఛైర్మన్ జువెల్ ఓరం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు వివరించినట్లు సమాచారం. ఈ విషయంలో రాహుల్ ఆరోపణలను ఖండించినట్లు తెలిసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
6.బంగాల్ సీఎస్, డీజీపీకి మళ్లీ నోటీసులు
కేంద్రం, బంగాల్ ప్రభుత్వం మధ్య వివాదం ముదురుతోంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనలో.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, డీజీపీలను తమ ఎదుట హాజరుకావాలని తాజాగా మరోసారి నోటీసులు పంపింది కేంద్ర హోం శాఖ. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
7.న్యూయార్క్‌లో రికార్డు స్థాయిలో హిమపాతం
అమెరికా న్యూయార్క్ నగరాన్ని మంచు దుప్పటి కప్పేసింది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో మంచు కురిసింది. మొకాళ్ల లోతులో మంచు పేరుకుపోయింది. సహాయక సిబ్బంది మంచు తొలగించే పనిలో నిమగ్నమయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
8.కల్యాణ్ బాబాయ్ ఆటపట్టించే వాడు
'మెగా డాటర్' నిహారిక వారానికి రూ.1000 జీతంతో కేఫ్‌లో పనిచేశారు అనే విషయం మీకు తెలుసా? తన నాలుగేళ్ల వయసులోనే 'అంజి' సినిమా కోసం ముఖానికి రంగులద్దుకున్నారనే సంగతి విన్నారా? ఇటీవల చైతన్యతో ఏడడుగులు వేసిన మెగా ప్రిన్సెస్ నిహారిక పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా తన జీవితంలోని ఆసక్తికర విశేషాలు మీకోసం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
9.చిన్న మొత్తమైనా 'సిప్'తో ప్రయోజనాలెన్నో..
పిల్లల చదువు, వారి పెళ్లి, సొంతిల్లు, పదవీ విరమణ తర్వాత జీవితం.. ఒక వ్యక్తికి ఉండే ఆర్థిక లక్ష్యాల్లో ప్రధానమైనవి ఇవే. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే దీర్ఘకాలిక పెట్టుబడుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. భవిష్యత్ అవసరాలకు కావాల్సిన నిధిని ఎలా కూడబెట్టుకోవాలి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
10.ఆమిర్‌ను నాకు అప్పగించండి..
పాకిస్థాన్ యువ బౌలర్ మహ్మద్ ఆమిర్ రిటైర్మెంట్పై షోయబ్ అక్తర్ స్పందించాడు. పాకిస్థాన్ బోర్డు అంగీకరిస్తే అతన్ని జట్టుకు ఉపయోగపడేలా తీర్చిదిద్దుతానని పేర్కొన్నాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.