ETV Bharat / city

ఈటీవీ భారత్ - ముఖ్యాంశాలు - ETV BHARAT HEADLINES

TOP NEWS OF THE HOUR
TOP NEWS OF THE HOUR
author img

By

Published : Sep 9, 2021, 5:58 AM IST

Updated : Sep 9, 2021, 10:07 PM IST

22:01 September 09

టాప్​ న్యూస్​ @ 10 PM

 చివర్లో వస్తే కష్టమే..!

జంటనగరాల్లో వినాయకచవితి పండుగ సందడి ప్రారంభమైంది. మండపాల్లో గణపతులను నెలకొల్పేందుకు నిర్వాహకులు విగ్రహాలను తరలిస్తున్నారు. విగ్రహాల తయారీకి పేరుగాంచిన దూల్​పేట నుంచి ఇప్పటికే భారీగా విగ్రహాలు తరలివెళ్లాయి. ఈసారి విగ్రహాలు తక్కువ సంఖ్యలో ఉన్నాయని... దీనివల్ల చివరి నిమిషంలో కొనుగోలు చేసే వారికి కొంత ఇబ్బంది తప్పదని తయారీదారులు చెబుతున్నారు.

దేశ ప్రజలకు రాష్ట్రపతి వినాయక చవితి శుభాకాంక్షలు

భారతీయులందరికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కొవిడ్​పై విజయం సాధించాలని.. ప్రజలు గణేషుడిని ప్రార్థించాలని సూచించారు.

నడిరోడ్డుపై కర్రలతో కొట్టుకున్నారు

ఓ యువతిని ఈవ్ టీజింగ్​ చేసిన ఘటన.. రెండు వర్గాల మధ్య భీకర దాడికి కారణమైంది. కర్ణాటకలోని శ్రీనివాసపుర్​ నుంచి గౌణిపల్లికి వెళ్తున్న బస్సులో ఓ యువతిని ఏడిపించాడన్న కారణంతో కోలార్​కు చెందిన బాబు అనే యువకుడిపై కొందరు దాడి చేశారు

'ప్రజలు కోరుకుంటే రాజకీయాల్లోకి వస్తా'

'తలైవి' ప్రమోషన్స్​లో నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రజలు కోరుకుంటే పాలిటిక్స్​లోకి వస్తానని తెలిపింది.

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు

భారత మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​ తర్వాత ఓవర్​లో ఆరు సిక్సర్ల రికార్డును(Yuvraj Singh Six Sixes) ఓ భారత సంతతి అమెరికన్​ క్రికెటర్​ సాధించాడు. న్యూగినియాతో జరిగిన వన్డేలోని ఆఖరి ఓవర్​లో ఆరు సిక్సర్లు బాది(Jaskaran Malhotra Sixes).. అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

20:38 September 09

టాప్​ న్యూస్​ @ 9 PM

ఘోర ప్రమాదం..

కరీంనగర్‌- లక్సెట్టిపేట ఏడో నెంబరు జాతీయ రహదారి.. పాశిగామ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చనిపోగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో చిన్నారికి గాయాలయ్యాయి. 

మసీదు సర్వేపై హైకోర్టు స్టే!

గ్యాన్వాపి మసీదులో.. ఆర్కియాలజీ సర్వేపై అలహాబాద్ హై కోర్టు స్టే విధించింది. వారణాసి ఫాస్ట్రాక్​ కోర్టు ఇచ్చిన అనుమతులను సవాలు చేస్తూ.. ఉత్తర్​ ప్రదేశ్ సునీ వక్ఫ్​ బోర్డ్​ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఈ మేరకు తాజా ఆదేశాలు జారీ చేసింది.
 
ఇక అఫ్గాన్​ పునర్నిర్మాణమే

అఫ్గాన్ తాలిబన్​ ప్రభుత్వంలో(Taliban Government) ఆపద్ధర్మ ప్రధానిగా(Afghanistan Prime Minister) నియమితులైన మహమ్మద్​ హసన్ అఖుంద్​.. కీలక ప్రకటన చేశారు. గత ప్రభుత్వ హయాంలో పని చేసిన అధికారులు అఫ్గాన్​కు తిరిగి వచ్చి, దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మరోవైపు.. తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించే హడావుడిలో తాము లేమని అమెరికా స్పష్టం చేసింది. అయితే.. అమెరికా పౌరుల తరలింపు కోసం తాలిబన్లతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది.

ఆఖరి టెస్టు అనుమానమే

ఇంగ్లాండ్​-టీమ్​ఇండియా ఐదో టెస్టుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన జట్టులోని ఫిజియోకు కరోనా పాజిటివ్​గా నిర్ధరణ కావడమే ఇందుకు కారణం.

రజనీకాంత్ 'అన్నాత్తే'

సూపర్​స్టార్ రజనీకాంత్ 'అన్నాత్తే'(rajinikanth annaatthe) అప్డేట్స్ వినాయక చవితి(vinayaka chavithi) కానుకగా రానున్నాయి. ఫస్ట్​లుక్​ను శుక్రవారం ఉదయం 11 గంటలకు, మోషన్​ పోస్టర్​ను సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఖుష్బూ, మీనా, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. శివ దర్శకుడు. దీపావళి కానుకగా థియేటర్లలోకి రానుందీ చిత్రం.
 
19:49 September 09

టాప్​ న్యూస్​ @ 8 PM

కొత్తగా 315 కరోనా కేసులు..

రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 75 వేల 199 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 315 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయ్యింది. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఆరు లక్షల ఆరవై వేల 786 మంది కరోనా బారిన పడ్డారు. వైరస్​ బారిన పడి తాజాగా ఇద్దరు మరణించగా.. ఇప్పటివరకు మృతిచెందిన వారి సంఖ్య మూడు వేల 891కి చేరింది. 

ఎమ్మెల్యేకు షాక్​

నిజామాబాద్ జిల్లా బోధన్​ ఎమ్మెల్యే షకీల్​కు చేదు అనుభవం ఎదురైంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను గ్రామస్థులు అడ్డుకున్నారు. ఎలాంటి అభివృద్ధి పనులు చేయడం లేదని ఆయనను నిలదీశారు. దీంతో అడ్డుకున్న వారిపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.

సుప్రీం కీలక వ్యాఖ్యలు

నీట్ పరీక్ష(Neet Exam)​ అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రాన్ని మార్చుకునేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీం కోర్టు(Supreme Court On Neet) కొట్టివేసింది. ప్రస్తుతం కరోనా ఆంక్షలు సడలించినందున.. అభ్యర్థులు ఎక్కడికంటే అక్కడికి వెళ్లగలరని పేర్కొంది.

చెక్‌బుక్‌లు పనిచేయవు!

తమ బ్యాంక్​లో విలీనమైన.. ఓరియెంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఓబీసీ), యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(యూబీఐ) ఖాతాదారులకు పీఎన్​బీ కీలక సూచనలు చేసింది. వచ్చే నెల నుంచి ఆయా బ్యాంక్​ల చెక్​బుక్​లు పని చేయవని తెలిపింది. పీఎన్​బీ పేరుతో ఉన్న కొత్త చెక్​బుక్​లను వెంటనే తీసుకోవాలని స్పష్టం చేసింది.

గెలిచేది ఎవరు?

భారత్, ఇంగ్లాండ్ అమీతుమీకి సిద్ధమయ్యాయి. చివరి టెస్టులో తాడోపేడో తేల్చుకోవాలని తహతహలాడుతున్నాయి. ఆఖరి మ్యాచ్​లో గెలుపొంది సొంతగడ్డపై పరువు నిలుపుకోవాలని రూట్​సేన(England Cricket News) భావిస్తోంది.

18:50 September 09

టాప్​ న్యూస్​ @ 7 PM

తెలంగాణ ప్రభుత్వం లేఖ

కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. శ్రీశైలంలో ఏపీ 34 టీఎంసీలకు మించి నీరు తీసుకోకుండా చూడాలని ఈఎన్‌సీ మురళీధర్  కోరారు. 880 అడుగుల పైన నీరున్నప్పుడూ ఏపీ 34 టీఎంసీలే తీసుకోవాలని లేఖలో ప్రస్తవించారు. 11,150 క్యూసెక్కుల వరకు విడుదల చేసేందుకే ప్రాజెక్టు డిజైన్ చేశారని ఆరోపించారు. 

గ్లోబల్​ టీచర్​ ప్రైజ్​' రేసులో హైదరాబాదీ

బిహార్​కు చెందిన గణితశాస్త్ర ఉపాధ్యాయుడు సత్యం మిశ్రా, హైదరాబాద్​కు చెందిన ఇంగ్లీష్​, సోషల్​ టీచర్​ మేఘన ముసునూరి.. ప్రఖ్యాత 'గ్లోబల్​ టీచర్​ ప్రైజ్​' టాప్​-50 జాబితాలో చోటుదక్కించుకున్నారు(global teacher prize 2021). ఇందులో ఫైనలిస్ట్​గా నిలిచిన వారికి 1మిలియన్​ డాలర్లు అందుతాయి. గతేడాది కూడా ఈ ప్రైజ్​ భారతీయుడినే వరించింది.

రూ.15వేలకే అదిరిపోయే ల్యాప్​టాప్​లు!

రూ.15 వేలకు మీడియం రేంజ్​ మొబైల్స్​​ మాత్రమే వస్తాయి. అలాంటిది ల్యాప్​టాప్​ అంటే కొంచెం కష్టమనే చెప్పాలి. అయితే ఈ ధరలోనూ మేలైన ల్యాప్​టాప్​లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో మీరూ చూడండి.

ఇంగ్లాండ్​, బంగ్లాదేశ్​, దక్షిణాఫ్రికా జట్లు ఇవే

ఐసీసీ టీ20 ప్రపంచకప్​లో(ICC T20 World Cup 2021) పాల్గొననున్న తమ జట్లను ఇంగ్లాండ్​, బంగ్లాదేశ్​, దక్షిణాఫ్రికా క్రికెట్​ బోర్డులు ప్రకటించాయి. అక్టోబరు 17 నుంచి ఈ ఈవెంట్ ప్రారంభం కానుంది.

ఈ సినిమాలో అందరూ హీరోలే

థ్రిల్లర్ కథతో తెరకెక్కిన 'ప్లాన్ బీ' సినిమా.. సెప్టెంబరు 17న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్న చిత్రబృందం.. ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాల్ని చెప్పింది. ఈ చిత్రంలో హీరో అంటూ ప్రత్యేకంగా ఉండరని, అందరూ కథానాయకులేనని దర్శకుడు రాజమహీ అన్నారు. శ్రీనివాస రెడ్డి, మురళీశర్మ ప్రధాన పాత్రల్లో నటించారు.

18:21 September 09

టాప్​ న్యూస్​ @ 6 PM

సహజీవనం తప్పు కాదా?

వయోజనులైన ఇద్దరు వ్యక్తులు సహజీవనం(Live In Relationship) చేస్తే తప్పేమీ లేదని పంజాబ్​-హరియాణా హైకోర్టు(Punjab And Haryana High Court) అభిప్రాయపడింది. సహజీవనం చేస్తున్న ఓ జంట తమను రక్షించాలని కోరుతూ దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.

వారికే అనుమతి

కేసులను ఏ విధానంలో విచారణ చేపట్టాలన్న దానిపై న్యాయమూర్తులే నిర్ణయం తీసుకుంటారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రత్యక్ష విచారణ సందర్భంగా న్యాయవాదులు భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొంది.

13వ బ్రిక్స్​ సదస్సు.. మోదీ హాజరు

బ్రిక్స్​ దేశాల 13వ శిఖరాగ్ర సమావేశం గురువారం భారత్​ అధ్యక్షతన జరిగింది. భేటీలో పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ క్రమంలో బ్రిక్స్​ సాధించిన ఘనతల పట్ల గర్వపడుతున్నట్టు వెల్లడించారు.

సిగరెట్ పీకలతో రూ.లక్షలు సంపాదన- ఎలా..?

నిత్యం లక్షలాది మంది పొగ తాగిన అనంతరం సిగరెట్ పీకలను నిర్లక్ష్యంగా పడేస్తుంటారు. వాటితో పర్యావరణానికి ఎంతో హాని కలుగుతుంది. అయితే ఈ సిగరెట్ పీకలతోనే అందమైన కళాకృతులను తయారు చేస్తోంది ఓ రీసైక్లింగ్​ కంపెనీ. ఓ వైపు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తూనే.. రకరకాల బొమ్మలు, దోమ తెరలు, దిండ్లు తయారు చేసి, అమ్ముతూ లాభాలు ఆర్జిస్తోంది.

సంక్షోభానికి తాలిబన్ల 'ఆజ్యం'

తాలిబన్ల అరాచక పాలనతో అఫ్గాన్​ సంక్షోభం మరింత ముదిరింది. ప్రభుత్వాన్ని(taliban government) ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే మహిళల నిరసనలపై ఉక్కుపాదం మోపారు. జర్నలిస్టులను చితకబాదారు. ఇలా ఎన్నో వార్తలు అఫ్గాన్​ ప్రజల దుస్థితిని ప్రపంచానికి తెలియజేస్తున్నాయి. తాలిబన్లు తమ వైఖరి మార్చుకోకపోతే దేశంలో సంక్షోభం మరింత ముదిరే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు(afghanistan news).

16:55 September 09

టాప్​ న్యూస్​ @ 5 PM

టీమ్​ఇండియాలో మరొకరికి కరోనా

టీమ్ఇండియా కోచ్​ బృందానికి కరోనా సోకిన తర్వాత మరో పాజిటివ్​ కేసు నమోదయ్యింది. ఇంగ్లాండ్​ పర్యటనలో ఉన్న టీమ్​ జూనియర్​ ఫిజియో యోగేశ్​ పరమార్​కు కరోనా సోకినట్లు బీసీసీఐ వర్గాలు గురువారం వెల్లడించాయి. దీంతో ఐదో టెస్టుకు ముందు జరగాల్సిన ప్రాక్టీస్​ ఆగిపోయింది. దీంతో ఐదో టెస్టు నిర్వహణ సందేహంగా మారింది. 

ముగిసిన విచారణ

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు(Tollywood drugs case)లో ఈడీ (enforcement directorate) దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. నోటీసులు అందుకున్న ఒక్కొక్కరూ విచారణకు హాజరు హాజరుకావడంతో పాటు.. ఎక్సైజ్ కేసు(excise case)లో ప్రధాన నిందితుడుగా ఉన్న కెల్విన్(KELVIN)​ను కలిపి విచారిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. కెల్విన్​ వద్ద సేకరించిన వివరాలతో ఒక్కొక్కరిని సుధీర్ఘంగా విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ అధికారులు.. ఇవాళ నటుడు రవితేజ(HERO RAVI TEJA)తో పాటు అతడి డ్రైవర్‌ శ్రీనివాస్​ను ఈడీ అధికారులు విచారించారు. 

నెలాఖరు వరకు ఎమర్జెన్సీ

వివిధ దేశాలపై కరోనా మహమ్మారి(Covid In Worldwide) పంజా విసురుతోంది. కేసుల సంఖ్య తగ్గినప్పటికీ.. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య మాత్రం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్​కు ఆతిథ్యమిచ్చిన టోక్యో నగరంలో అత్యయిక స్థితిని(Tokyo Emergency) ఈ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు జపాన్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు.. ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం లాక్​డౌన్​ ఎత్తివేయనున్నారు.

కార్ల ఉత్పత్తికి ఫోర్డ్​ గుడ్​బై!

భారత్​లో కార్ల తయారీ ప్లాంట్లను మూసేసే యోచనలో ఫోర్డ్ ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కంపెనీ పునర్​వ్యవస్థీకరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

ధోనీకి షాక్..

మాజీ కెప్టెన్​ మహేంద్ర సింగ్​ ధోనీకి(dhoni news) విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది. అక్టోబరులో జరిగే టీ20 ప్రపంచకప్(t20 world cup 2021)​ కోసం అతడిని టీమ్​ఇండియా మెంటార్​గా ఎంపిక చేశారు. ఈ విషయమై బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్​ అతడిపై ఫిర్యాదు చేశారు.

15:45 September 09

టాప్​ న్యూస్​ @ 4 PM

బంగాళాఖాతంలో అల్పపీడనం..!

11వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది తర్వాతి 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

చిక్కుకున్న వినాయకుడు..

హైదరాబాద్​లో ఓ భారీ వినాయక విగ్రహం ఓ కమాన్ కింద చిక్కుకుపోయింది. ఎర్రగడ్డ ఈఎస్​ఐ వద్ద ఏర్పాటు చేసిన కమాన్ కింద చిక్కుకుపోవడంతో ఆ ప్రాంతంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వినాయకున్ని తరలించేలా చర్యలు చేపట్టారు.

15 ఏళ్లుగా రోజూ మాంసాహారం!

ఆ దంపతులకు సంతానం లేదు. దాంతో వీధి శునకాలపై వారు ప్రేమ పెంచుకున్నారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా వాటికి మాంసాహారాన్ని అందిస్తున్నారు. అలా పదిహేనేళ్లుగా.. వాటి ఆకలి తీరుస్తున్నారు.

ఐదుగురు మహిళలు మృతి

నీళ్ల ట్యాంకర్​ను వ్యాన్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మహిళా కూలీలు మృతి చెందారు. మరో 10 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

నా జీవితం వ్యర్థం

ప్రస్తుతం తన దగ్గర అదిరిపోయే కథలున్నాయని డైరెక్టర్ దేవా కట్టా(deva katta next movie) చెప్పారు. అవి కచ్చితంగా తీసి తీరుతానని అన్నారు. లేకపోతే తన జీవితానికి అర్థం ఉండదని తెలిపారు.

14:35 September 09

టాప్​ న్యూస్​ @ 3 PM

నగదు డిపాజిట్

ముఖ్యమంత్రి హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వాసాలమర్రి దళితులకు దళిత బంధు చేకూరింది. చెప్పినట్లుగానే లబ్ధిదారుల ఖాతాల్లో దళితబంధు నిధులు జమయ్యాయి. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకుగానూ 66 మంది ఖాతాల్లో నగదు జమయ్యింది. ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున నగదును జిల్లా కలెక్టర్‌ ఖాతా నుంచి లబ్ధిదారుల అకౌంట్లలో ప్రభుత్వం జమచేసింది.

లొంగుబాటు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 52 మంది మావోయిస్టు సానుభూతిపరులు పోలీసులకు లొంగిపోయారు. ఎస్పీ సునీల్ దత్ ఎదుట వారు లొంగిపోయారు. 

అసెంబ్లీ వెబ్​సైట్​ హ్యాక్​!

అసెంబ్లీ ఎన్నికల ముందు (UP Election 2022) హ్యాకర్లు రెచ్చిపోయారు. ఏకంగా ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ అధికారిక వెబ్​సైట్​నే హ్యాక్​ చేసి.. అభ్యంతరకర పోస్ట్​లు పెట్టారు. నిందితులను పట్టుకొనే పనిలో ఉన్నారు పోలీసులు.

ఫ్యూచర్ రిటైల్​కు ఊరట

రిలయన్స్- ఫ్యూచర్ ఒప్పందం (Reliance Future deal) విషయంలో సింగపూర్ ఆర్బిట్రేటర్ తీర్పునకు అనుగుణంగా ఫ్యూచర్ కూపన్స్ సంస్థ ఆస్తులు అటాచ్ చేయాలంటూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. తీర్పు అమలుపై హైకోర్టు విచారణను ఆపాలని ఆదేశించింది. నాలుగు వారాల వరకు ఈ విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయొద్దని సెబీ, సీసీఐకి నోటీసులు పంపింది.

భేదాభిప్రాయాలు వస్తే!'

టీమ్​ఇండియా కోచ్ రవిశాస్త్రి, మాజీ సారథి ఎంఎస్ ధోనీ మధ్య భేదాభిప్రాయాలు(Coach vs Mentor) రాకూడదని ఆశిస్తున్నట్లు భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్(Sunil Gavaskar News) తెలిపాడు. టీ20 ప్రపంచకప్​ కోసం భారత జట్టును ఎంపిక చేసి, ధోనీని మెంటార్​గా నియమిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గావస్కర్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

13:53 September 09

టాప్​ న్యూస్​ @2PM

  • హైదరాబాద్​కు సీఎం తిరుగుపయనం..

సీఎం కేసీఆర్​(CM KCR) దిల్లీ పర్యటన(DELHI TOUR) పూర్తయింది. ఈ నెల 1న దిల్లీకి బయలుదేరిన ఆయన.. హస్తినలో తెరాస కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. భూమి పూజ తర్వాత ప్రధాని, హోం, రోడ్డు రవాణా, జలశక్తి శాఖల మంత్రులను కేసీఆర్​ కలిశారు. 9 రోజుల పర్యటన అనంతరం ఈ రోజు హైదరాబాద్​కు బయలుదేరారు.

  • అక్రమాలపై విచారణ జరిపించాలి..

కోకాపేట్​, ఖానామెట్​ భూముల అమ్మకాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు దిల్లీలో సీబీఐ డైరెక్టర్​ను ఆయన కలిశారు. భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

  • లోకేశ్‌ అరెస్ట్​..

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నరసరావుపేట పర్యటన ఉత్కంఠగా మారింది. ఆంధ్రప్రదేశ్​లోని గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన లోకేశ్‌ను ఆ రాష్ట్ర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • మద్రాస్ ఐఐటీ అత్యుత్తమం..

దేశంలోని విద్యాసంస్థలకు కేంద్ర విద్యాశాఖ ర్యాంకులు ప్రకటించింది. ఈ జాబితాలో మద్రాస్ ఐఐటీ టాప్ ర్యాంక్​ను సొంతం చేసుకుంది. కళాశాలల విభాగంలో దిల్లీలోని మిరండా హౌస్ ఉత్తమ కాలేజీగా నిలిచింది.

  • పాత్రికేయులపై ఉక్కుపాదం..

అఫ్గానిస్థాన్​ పాలన పగ్గాలు చేపట్టిన తాలిబన్లు(Afghanistan Taliban) హింసాత్మక ఘటనలకు పాల్పడతున్నారు. మహిళల నిరసనను(Women Protest In Afghanistan) అణచివేస్తున్న తాలిబన్లు.. పాత్రికేయులపైనా దాడులకు తెగబడుతున్నారు. తాలిబన్ల దాడిలో తీవ్రంగా గాయపడిన కొందరు జర్నలిస్టుల(Journalsits Attacked In Afghanistan) ఫొటోలు.. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.

12:49 September 09

టాప్​ న్యూస్​ @1PM

  • మోదీ ఆత్మీయ సమ్మేళనం..

టోక్యో పారాలింపిక్స్​లో పతకాలు సాధించిన భారత​ క్రీడాకారులను ఇప్పటికే ప్రత్యేకంగా మెచ్చుకున్న ప్రధాని మోదీ(modi meets olympic athletes).. వాళ్లతో గురువారం(సెప్టెంబరు 9) ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. వారితో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ.. వారి విజయాలను, కృషిని కొనియాడారు.

  • భాగస్వామ్యం అవ్వండి..

ఆజాదీ అమృత్‌కా మహోత్సవ్‌లో భాగంగా కన్యాకుమారి నుంచి దిల్లీ వరకు చేపట్టిన సైకిల్ ర్యాలీ హైదరాబాద్​కు చేరుకుంది. ఈ సందర్భంగా పీపుల్స్ ప్లాజాలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

  • యువతి గొంతు కోసిన యువకుడు..

సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో దారుణం జరిగింది.  రాజీవ్‌నగర్‌లో ఓ యువతిపై... యువకుడు హత్యాయత్నానికి పాల్పడ్డాడు. యువతి  గొంతు కోసి హత్య చేసేందుకు యత్నించాడు. స్థానికులు స్పందించి గాయపడిన యువతిని మిర్యాలగూడ ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు.

  • రిపోర్టర్​కు షాక్..!

తల్లయిన తర్వాత.. తొలిసారి ప్రజల ముందుకు వచ్చారు ప్రముఖ నటి, తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ నుస్రత్​ జహాన్ (Nusrat Jahan)​. ఈ సమయంలో.. తన బిడ్డకు తండ్రి(Nusrat Jahan Husband) ఎవరని ఓ రిపోర్టర్​ అడిగన ప్రశ్నకు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు​. అసలేమైందంటే..

  • నాగబాబు ఫైర్..

ఇటీవల 'మా' అసోసియేషన్​ భవన్ నిర్మాణంపై(maa association building) మోహన్​బాబు అన్న మాటలకు స్పందించారు నటుడు నాగబాబు. ఎన్నికలు ఉన్నాయనే మోహన్​బాబు ఈ విషయాన్ని లేవనెత్తారని అంటూ ఆయన్ను విమర్శించారు.

11:49 September 09

టాప్​ న్యూస్​ @12PM

  • ఆవైపు అనుమతించొద్దు..

హుస్సేన్‌సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం.. పలు ఆంక్షలు విధించింది. ఆంక్షలు అమలు చేయాలని ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలిచ్చింది.

  • మంత్రుల సాహసం సక్సెస్​..

కేంద్ర మంత్రులు రాజ్​నాథ్​, గడ్కరీ, భారత వైమానిక దళ(ఐఏఎఫ్​) అధిపతి ఆర్​కెఎస్​ భదౌరియా భారీ సాహసం చేశారు. ఐఏఎఫ్​ విమానంలో ప్రయాణిస్తూ.. జాతీయ రహదారిపై అత్యవసర ల్యాండింగ్(plane landing in highway) ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు.

  • అఘాయిత్యాలకు కేరాఫ్ అడ్రస్‌..

ఏపీ సీఎం జగన్ పాలనలో ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు రాష్ట్రం కేరాఫ్ అడ్రస్‌గా మారిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనపై ఆయన విచారం వ్యక్తం చేశారు. బైక్‌పై వెళ్తున్న జంటపై దాడిచేసి అత్యాచారానికి పాల్పడటం అమానుషమని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిర్యాదు కోసం వెళ్తే తమ పరిధి కాదని పోలీసులు చెప్పడం మరింత దారుణమన్నారు.

  • నిరసనలపై ఉక్కుపాదం..

దేశంలో నిరసనలన్నింటినీ ఆపేయాలని (afghanistan protests) పౌరులకు తాలిబన్ ప్రభుత్వం (Taliban government) హెచ్చరికలు జారీ చేసింది. అనుమతి లేకుండా బ్యానర్ల ప్రదర్శన సైతం చేపట్టకూడదని స్పష్టం చేసింది. మరోవైపు, అఫ్గాన్ ప్రజలను వదిలివెళ్లాలని అనుకోవడం తన అభిమతం కాదని ఆ దేశ మాజీ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ (Ashraf Ghani) పేర్కొన్నారు. నోట్ల కట్టలతో వెళ్లారన్న ఆరోపణలను ఖండించారు.

  • ఆ ధైర్యంతోనే వచ్చా..

నటుడిగా, దర్శకుడిగా, రచయితగా రాణిస్తున్న అవసరాల శ్రీనివాస్ (Avasarala srinivas new movie).. నటనలో తనకు స్ఫూర్తినిచ్చింది సీనియర్​ నటుడు​ రాజేంద్రప్రసాద్​ అని చెప్పారు. చిత్రపరిశ్రమలోకి ఏ ధైర్యంతో, ఎందుకు వచ్చారు? ఇండస్ట్రీలో బాగా సపోర్ట్‌ చేసిందెవరు? తన లవ్​స్టోరీ సహా కెరీర్​ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అవన్నీ ఆయన మాటల్లోనే..

10:49 September 09

టాప్​ న్యూస్​ @11AM

  • మరో 43,263 కరోనా కేసులు..

దేశంలో కరోనా కేసులు (Corona cases in India) స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 43,263 మందికి వైరస్​(Covid-19) సోకినట్లు నిర్ధరణ అయింది. మరో 338 మంది కొవిడ్​ బారిన పడి మరణించారు.

  • ఈడీ విచారణకు రవితేజ..

టాలీవుడ్ మత్తుమందుల కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ ఈడీ విచారణకు సినీనటుడు రవితేజ హాజరయ్యారు. ఆయన డ్రైవర్‌, సహాయకుడు శ్రీనివాస్‌ కూడా హాజరయ్యారు. నేడు విచారణకు రావాలని గతంలో రవితేజకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే.  

  • ఫస్ట్​ వార్నింగ్​..

ఎగువ నుంచి వస్తున్న వరదతో భద్రాచలంలో గోదావరి నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. ఇవాళ నీటిమట్టం 44 అడుగులకు పెరగడంతో... అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు.

  • తగ్గిన పసిడి ధర..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం(Gold Rate Today), వెండి ధరలు గురువారం తగ్గుముఖం పట్టాయి. పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • ఫస్ట్​లుక్ అదుర్స్..

పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​-హరీశ్​ శంకర్(Pawankalyan Harishshankar movie)​ కాంబోలో తెరకెక్కనున్న సినిమా టైటిల్, ఫస్ట్​లుక్​ విడుదలై ఆకట్టుకుంటున్నాయి. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్​ ప్రారంభంకానుంది.

09:50 September 09

టాప్​ న్యూస్​ @10AM

  • ఓపెన్​గా మింగేస్తున్నాయి..!

గ్రేటర్‌ పరిధిలోని ఓపెన్‌ నాలాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు స్లాబ్‌ వేయిస్తామని ప్రభుత్వం ప్రకటిస్తోంది తప్పించి అమల్లో చిత్తశుద్ధి చూపడంలేదు. బాక్స్‌ నాలాల పూర్తికి భారీ మొత్తంలో నిధులను కేటాయించినా, విడుదల చేయకపోవడం వల్లే పనులు నత్తనడకన సాగుతున్నాయి. గత 15 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాలనీలు జలమయమవుతున్నాయి. నిండుగా ప్రవహిస్తున్న నాలాల్లో పలువురు జారిపడిపోయారు.

  • ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఒకప్పుడు సినిమా చూడాలంటే టికెట్‌ కోసం క్యూలైన్‌లో గంటల తరబడి నిలబడాల్సి వచ్చేది. టికెట్ల కోసం ఆన్‌లైన్‌ బుకింగ్‌ వెబ్‌సైట్‌/యాప్‌లు వచ్చిన తర్వాత ప్రేక్షకుడికి ఉపశమనం లభించింది. ఇప్పుడు సినిమా టికెట్ల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. టికెట్‌ ధరల విషయంలో పారదర్శకతను తీసుకొచ్చేందుకు రైల్వే ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సిస్టమ్‌ తరహాలో పోర్టల్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపింది.

  • కూతురిపై వాంఛ తీర్చుకున్న తండ్రి..

తండ్రి ఏమి చేస్తున్నాడో తెలియని పసితనం ఆమెది. ఆ పసిదాన్ని చూసిన ఆ తండ్రికి మాత్రం కనీసం జాలి కలుగలేదు. కామంతో కళ్లు మూసుకుపోయాయి అతనికి. అభం శుభం తెలియని... ఐదేళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడి పైశాచికంగా ప్రవర్తించాడు. ఒక జాతీయ విద్యాసంస్థలో పీడీగా పనిచేస్తున్న అతను.. వావివరుసలు లేకుండా... కూతురిపై వాంఛ తీర్చుకున్నాడు. రెండున్నర నెలల కింద జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

  • ఎమ్మెల్యే సస్పెండ్..

భాజపా నేతపై చేయి చేసుకున్న ఓ ఎమ్మెల్యే పార్టీ నుంచి సస్పెండ్ అయిన ఘటన ఒడిశాలో జరిగింది. ప్రభుత్వ పనితీరుపై ఆరా తీస్తున్న ఓ భాజపా నేతను ప్రజల సమక్షంలోనే కొట్టారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనపై అధిష్ఠానం వేటు వేసింది.

  • మరో హిట్​ రీమేక్​లో..

ఇటీవల 'నారప్ప'(Venkatesh narappa cinema) సినిమాతో సూపర్​హిట్​ అందుకున్న హీరో వెంకటేశ్​ మరో తమిళ సినిమాను రీమేక్​ చేయాలని భావిస్తున్నారట! త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. ఇంతకీ ఆ చిత్రం ఏంటంటే?

08:48 September 09

టాప్​ న్యూస్​ @9AM

  • వదలని వరద..

గత అయిదు రోజులుగా రాష్ట్రంలో కురిసిన కుండపోత వానలతో వర్షపాతం లెక్కలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి. జూన్‌ ఒకటి నుంచి బుధవారం వరకూ ప్రస్తుత వానాకాలంలో రాష్ట్ర సాధారణ వర్షపాతం 636 మిల్లీమీటర్ల(మి.మీ.) కన్నా 40 శాతం అదనంగా కురిసినట్లు వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

  • ఆపరేషన్​ యూపీ..

త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాలకు(Assembly Election 2022) భాజపా రంగంలోకి సమాయత్తమవుతోంది. వివిధ రాష్ట్రాలకు ఎన్నికల బాధ్యులను ప్రకటించింది. ఉత్తర్​ప్రదేశ్​ బాధ్యతలను కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ చూసుకోనున్నారు. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్​కు గోవా ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఆయనకు కేంద్ర మంత్రులు జీ. కిషన్ రెడ్డి, దర్శన జర్దోష్ సహకరించనున్నారు.

  • మహిళపై సామూహిక అత్యాచారం..

ఏపీలోని గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. మేడికొండూరు ఠాణా పరిధిలో మహిళపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బుధవారం రాత్రి పాలడుగు అడ్డరోడ్​లో బైక్​పై వెళ్తున్న దంపతులను అడ్డుకున్న దుండగులు.. భర్తను కొట్టి మహిళను పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు.

  • అతడు.. ఆమెలా..

‘అతడు’.. ‘ఆమె’లా నటించాడు. ఇన్‌స్టాగ్రాంలో వల విసిరాడు. రోడ్డు ప్రమాదానికి గురయ్యానంటూ డబ్బు వసూలు చేశాడు. తిరిగి ఇవ్వమంటే పెళ్లి చేసుకుంటానంటూ నటించాడు. చివరకు వ్యక్తిగత చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానంటూ ఇంటర్మీడియట్‌ విద్యార్థిని(18)కి నరకం చూపించాడు. ఆమె రాచకొండ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

07:49 September 09

టాప్​ న్యూస్​ @8AM

  • అభివృద్ధికి సహకార మంత్రం..

భారత్‌ అధ్యక్షతన నేడు 'బ్రిక్స్‌' 13వ శిఖరాగ్ర సభ వర్చువల్‌గా (13th brics summit) జరగనుంది. 15వ వార్షికోత్సవం సందర్బంగా తమ మధ్య సహకారాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడానికి, ఏకాభిప్రాయ సాధనకు బ్రిక్స్‌ దేశాలు (brics summit 2021) గట్టి కృషి చేయనున్నాయనే అంచనాలు నెలకొన్నాయి.

  • జౌళి ప్రాజెక్టులకు ఊతం..

రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అనేక జౌళి ప్రాజెక్టులు కేంద్ర సాయం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జౌళి రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రం అయిదేళ్లలో రూ.10,683 కోట్లు వెచ్చించేలా ప్రొడక్షన్‌ లింక్డ్‌ ఇన్‌సెంటీవ్‌(పీఎల్‌ఐ) పథకాన్ని ప్రకటించింది. దాంతో లబ్ధి పొందనున్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ కూడా ఉంది.

  • సంకల్పమే ఊపిరైంది..

సివిల్స్‌ ఇంటర్వ్యూకు ఎంపికయ్యాక ఓ యువకుడికి కరోనా సోకింది. తగ్గిపోతుందిలే కదా అనుకుని ధైర్యాన్ని కూడగట్టుకున్నాడు. కానీ కరోనా మాత్రం కనికరించలేదు. రోజు రోజుకు అతని పరిస్థితి విషమించసాగింది. అయినా యువకుడు ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. నాలుగు నెలలపాటు మృత్యువుతో పోరాటం చేసి... విజయం సాధించాడు. అతని ధైర్యాన్ని చూసిన యూపీఎస్సీ ప్రత్యేకంగా మరో అవకాశమిచ్చింది. ప్రస్తుతం అతను సివిల్స్​కు సిద్ధమవుతున్నాడు.

  • మోడల్​పై అత్యాచారం!

ఓ బాలీవుడ్​ నిర్మాత.. మోడల్​ను అత్యాచారం చేశాడంటూ కేసు నమోదైంది. పోలీసులు అతడిని అరెస్ట్​ చేసి విచారిస్తున్నారు.

  • స్వితోలినాకు షాక్..

యూఎస్​ ఓపెన్(US Open 2021) మహిళల సింగిల్స్​లో స్వితోలినాకు షాక్​ ఇచ్చింది కెనడా అమ్మాయి లీలా ఫెర్నాండెజ్(Leylah Fernandez Tennis). ఈ గ్రాండ్​ స్లామ్​ టోర్నీలో సెమీస్​ చేరిన పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. మరోవైపు సబలెంక కూడా సెమీస్​కు చేరగా మెద్వెదెవ్​ తొలి గ్రాండ్ స్లామ్ అందుకునే దిశగా ముందడుగు వేశాడు.

06:41 September 09

టాప్​ న్యూస్​ @7AM

  • దేశంలోనే తొలిసారి..

దేశంలో తొలిసారిగా ఆకాశమార్గాన డ్రోన్​ల సహాయంతో ఔషధాల పంపిణీ ప్రయోగానికి తెలంగాణను వేదిక కానుంది. ఈ నెల11న కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సిందియా, రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా వికారాబాద్​లో లాంఛనంగా ఈ కార్యక్రమం ప్రారంభించనున్నారు.

  • దిన'ధన' గండం..

రెండు మూత్రపిండాలు ఓ వ్యక్తిలో నిత్యం 1500 లీటర్ల రక్తాన్ని శుద్ధిచేసి మలినాలను తొలగిస్తాయి. ఏ కారణం చేతనైనా అవి పనిచేయడం మానేస్తే రక్తంలో, శరీరంలో విషతుల్యాలు పేరుకుపోతాయి. అలాంటి పరిస్థితుల్లో డయాలసిస్‌ చేయడం తప్పనిసరి. రాష్ట్రవ్యాప్తంగా రెండు కిడ్నీలు పనిచేయని వారు 23,451 మంది ఉన్నట్టు అంచనా.

  • అధికారం ఇవ్వండి..

క్రియారహితంగా ఉన్న రాజకీయ పార్టీలను రద్దు చేసే అధికారం కల్పించాలని ఈసీ కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. విరాళాలపై ఆదాయపు రాయితీలు పొందడానికి మాత్రమే ఇవన్నీ రాజకీయ పార్టీల ముసుగును తొడుక్కున్నట్లు ఈసీ అనుమానిస్తోంది.

సర్వం అంతర్జాలమయం..

ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో పనిచేస్తున్న యువతికి వివాహం నిశ్చయమైంది. ఆ ఏర్పాట్లలో ఉండగా ఆమె ఫోన్‌కు ఓ మెసేజ్‌ వచ్చింది. ఆ యువతి వైద్య చికిత్స సమాచారం అందులో ఉంది. పెళ్లి రద్దు చేసుకోకపోతే ఈ వివరాలన్నీ పెళ్లికొడుకు తరఫు వారికి పంపుతామని బెదిరించారు కూడా. పోలీసులు దర్యాప్తు చేయగా గతంలో తనతో కలిసి పనిచేసిన యువకుడే ఈ వివరాలు సేకరించినట్లు తేలింది.

  • షేక్​ నోట ఎస్పీ బాలు పాట..

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం(sp balasubramanyam songs) ఎన్నో అద్భుతమైన పాటలు పాడారు. తాజాగా దుబాయ్​కు చెందిన ఓ షేక్​ ఆయన పాడిన ఓ గీతాన్ని అలవోకగా ఆలపించి ఆశ్చర్యానికి గురి చేశారు. వైరల్​గా మారిన ఆ వీడియోను చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

05:25 September 09

టాప్ న్యూస్ @ 6AM

  • రాష్ట్ర ప్రభుత్వానికి  భారీగా రాబడి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో(current financial year) ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని రకాలుగా 43 వేల కోట్ల రూపాయల పైబడి ఆదాయం(INCOME TO TELANGANA) సమకూరింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం రూ.35 వేల కోట్లు కాగా... కేంద్రం నుంచి రూ.8,600 కోట్లు వచ్చాయి. మే నెలలో కనిష్ఠంగా రూ.6,500 కోట్లు రాగా... జూన్​లో గరిష్ఠంగా రూ.పదివేల కోట్ల మార్కు దాటింది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.24 వేల కోట్ల రుణం తీసుకొంది.

  • పరిహారం గురించి ప్రస్తావనేదీ?

రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. వర్షం భీభత్సంతో పలు జిల్లాల్లో పత్తి, వరి, మెుక్కజొన్న పంటలు నీటి మునిగిపోయాయి. దాదాపు లక్ష ఎకరాల పైచిలుకు విస్తీర్ణంలోని పంటలు నష్టపోయినట్లు అంతర్గతంగా వ్యవసాయ శాఖ ప్రాధమిక అంచనాలు తెలియజేస్తున్నాయి. రైతుబంధు, రైతుబీమా, సాగు నీటి సరఫరా, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్న దృష్ట్యా... ఈ ఏడాది పంట నష్టం లెక్కింపు, పరిహారం అన్న అంశాల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

  • నేడే తీర్పు..

వినాయక నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణలపై నేడు హైకోర్టు ఉత్తర్వులను వెల్లడించనుంది. జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీ నివేదికలు సమర్పించడంలో శ్రద్ధ చూపడం లేదని ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం.. తీర్పును రిజర్వ్ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ వినోద్ కుమార్ ధర్మాసనం ఇవాళ తీర్పు ఇవ్వనుంది.

  • నేటి విచారణకు రవితేజ, అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌

టాలీవుడ్‌ డ్రగ్స్ కేసు(Tollywood drugs case)లో ఈడీ (enforcement directorate) దర్యాప్తు కొనసాగుతోంది. నోటీసుల జారీ చేసిన ఒక్కొక్కరూ విచారణకు హాజరు హాజరుకావడం... వారితో పాటు ఎక్సైజ్ కేసు(excise case)లో ప్రధాన నిందితుడుగా ఉన్న కెల్విన్(KELVIN)​ను కలిపి విచారిస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అతని వద్ద సేకరించిన వివరాలతో ఒక్కొక్కరిని సుధీర్ఘంగా విచారిస్తున్నారు. ఇప్పటికే పలువురిని విచారించిన ఈడీ అధికారులు.. నేడు నటుడు రవితేజ(HERO RAVI TEJA)తోపాటు అతని డ్రైవర్‌ శ్రీనివాస్‌ కూడా విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన గతంలోనే వీరికి ఈడీ అధికారులు నోటిసులు జారీ చేశారు.

  • ఉసురు తీసుకుంటున్న దైన్యం

భారత్​లో.. 2019లో ప్రతి లక్షమంది వైద్యుల్లో 16 మందికి పైగా బలవన్మరణాలకు (suicide among doctors) పాల్పడ్డారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అంతులేని ఒత్తిడి, మితిమీరిన ఆందోళన, నిరాశ, వ్యాకులత వంటి సమస్యలతో వీరు ఆత్మహత్యలకు ప్రేరేపితులవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు.

  • అభివృద్ధికి సహకార మంత్రం

  • శుభవార్త చెప్పిన ఎయిర్​ ఇండియా

హైదరాబాద్ నుంచి లండన్​కు నేరుగా విమానాలు నడపనున్నట్లు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ మేరకు లండన్ నుంచి మొదటి ఫ్లైట్ నేడు హైదరాబాద్ చేరుకుంటుందని ఒక ప్రకటనలో తెలిపింది.

  • 18 నుంచి విలాస క్రూజ్‌ లైనర్‌

ఈనెల 18 నుంతి తొలి స్వదేశీ క్రూజ్​ లైనర్ (irctc cruise)​ సేవలను ప్రారంభించనున్నట్లు ఐఆర్​సీటీసీ ప్రకటించింది. కార్డెలియా క్రూజెస్‌ అనే ప్రైవేటు సంస్థ భాగస్వామ్యంతో దీన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది.

  • సరికొత్త కొవిడ్​ టీకాలు

ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టకోగలిగే కొవిడ్​ వ్యాక్సిన్​ను (Covid Vaccine) రూపొందించారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ పరిశోధకులు. కొన్ని రకాల మొక్కలు, బ్యాక్టీరియాల నుంచి సేకరించిన కీలక పదార్థాలతో వీటిని రూపొందించారు.

  • అది బాధగా ఉంది

తాను కూడా గ్లామర్ పాత్రల్లో నటించేందుకు సిద్ధంగా ఉన్నానని రీతూవర్మ చెప్పింది. 'టక్ జగదీష్'లో అన్ని రకాల భావోద్వేగాలు ఉంటాయని తెలిపింది. ఈ సినిమా సెప్టెంబరు 10న ఓటీటీలో విడుదల కానుంది.

Last Updated : Sep 9, 2021, 10:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.