ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 5PM - టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP NEWS in ts
TOP NEWS in ts
author img

By

Published : Apr 24, 2022, 5:03 PM IST

  • ' గల్లీల్లో గల్లలెగరేసుకుని తిరిగేలా చేస్తా..'

Bandi sanjay Comments: జాతీయ పంచాయతీరాజ్ దివాస్ సందర్భంగా పాదయాత్రలో భాగంగా.. నారాయణపేట జిల్లా నర్వలో సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో బండి సంజయ్​ సమావేశమయ్యారు. కొత్తచట్టం పేరుతో సర్పంచులకు అధికారాలే లేకుండా చేశారని తెరాస ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఎంపీటీసీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చారని, జడ్పీటీసీలంటే ఎవరో తెలియకుండా చేశారని మండిపడ్డారు.

  • బాలికపై అత్యాచారం.. నిందితుడికి రిమాండ్​

Rape on Minor Girl: నిజామాబాద్​ జిల్లాలో బాలికపై అత్యాచారం కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం(ఏప్రిల్​ 22) సాయంత్రం జరిగిన బాలికపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్పందించిన పోలీసులు.. చర్యలు తీసుకున్నారు.

  • అందువల్లే పోలవరంపై నీలినీడలు

Gorantla fire on YSRCP: రంకెలేస్తే పోలవరం పూర్తికాదనే సంగతి ఏపీ మంత్రి అంబటి రాంబాబు గ్రహించాలని.. తెదేపా నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి హితవు పలికారు. జగన్‌ పాలనలో పోలవరం ప్రాజెక్టు పూర్తిపై నీలినీడలు కమ్ముకున్నాయని విమర్శించారు.

  • ఇదెక్కడి ఓపెనింగయ్యా సామీ..!

MLA Sofa Opening: కార్యాలయ ప్రారంభోత్సవం ఘనంగా ప్లాన్​ చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే ధర్వాజకు కట్టిన రిబ్బన్​ను కత్తెరతో కట్​ చేశారు. ఇంకేముంది కార్యాలయం ఓపెనింగ్​ అయిపోయినట్టే అనుకుంటే పొరపాటే.. ఆఫీస్​లోకి కొత్తగా కొనుక్కొచ్చిన సోఫాలు, కుర్చీలను ఎవరు ప్రారంభించాలి..? వాటిని కూడా ఎమ్మెల్యేనే రిబ్బన్లు కత్తిరించి ప్రారంభించాలి..! అలాగే చేశారు కూడా..!! ఎక్కడ..? ఎవరో చూడండి..

  • లొంగిపోయిన ఆశిష్‌ మిశ్ర

Ashish Mishra surrender: లఖింపుర్​ ఖేరీ నిందితుడు ఆశిష్ మిశ్ర.. జిల్లా కోర్టులో ఆదివారం లొంగిపోయారు. వారం రోజుల లోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఆదేశాల మేరకు ఒకరోజు ముందే జిల్లా కోర్టులో సరెండర్​ అయ్యారు.

  • సర్కారు బ్యాంకులో భారీగా ఉద్యోగాలు..

Bank of India Recruitment: బ్యాంకు ఉద్యోగాలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు గుడ్​న్యూస్. కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉండే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ కానున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ వెలువడింది. ఆ వివరాలు ఇలా..

  • ప్రసవం కోసం 4 కిలోమీటర్లు డోలీలోనే..!

రోడ్డు సౌకర్యం లేక నిండు గర్భిణీని ప్రసవం కోసం నాలుగు కిలోమీటర్ల దూరం.. డోలీలో మోసుకువెళ్లిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. పాల్ఘర్ జిల్లాలోని ముకుందపాద అనే గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. తాలూకా కేంద్రానికి సైతం ఆ గ్రామం 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

  • 'నిత్యం రూ.20వేల కోట్ల డిజిటల్‌ లావాదేవీలు'

Modi Mann Ki Baat today: చిన్న ఆన్‌లైన్‌ చెల్లింపులే పెద్ద డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో దోహదం చేస్తున్నాయన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. దేశంలో నిత్యం రూ.20వేల కోట్ల డిజిటల్​ లావాదేవీలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మన్​ కీ బాత్​ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

  • చాక్లెట్ అనుకొని ఎలుకల తిన్న చిన్నారి!

Eat rat poison Nagpur: మహారాష్ట్రలో విషాదకర ఘటన జరిగింది. చాక్లెట్ అనుకొని ఎలుకల మందు తిని నాలుగేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

  • 'హరిహర వీరమల్లు'లో బాలీవుడ్ హాట్​ బ్యూటీ?

పవర్​ స్టార్​ పవన్​కల్యాణ్​ నటిస్తున్న మొదటి పాన్​ ఇండియా చిత్రం 'హరిహర వీరమల్లు'. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాలో కీలక పాత్రల్లో ఇద్దరు బాలీవుడ్ స్టార్స్​ కనిపించనున్నారు. వారితో పాటు బాలీవుడ్​ హాట్​బ్యూటీ​ నటించబోతున్నారట. త్వరలో దీనిపై స్పష్టత రానుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.