ETV Bharat / city

Telangana News : టాప్​న్యూస్ @ 7PM - 7PM టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Jul 25, 2022, 6:58 PM IST

  • సినిమా షూటింగ్‌ల బంద్‌పై.. నిర్మాతలు ఏం నిర్ణయించారంటే?

టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో సినిమాల విడుదలపై తాజాగా తెలుగు నిర్మాతల మండలి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. ఇందులో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో ఓనర్లు పాల్గొని తమ అభిప్రాయాల్ని వెల్లడించారు.

  • ఎనిమిదేళ్లలో రాష్ట్ర అప్పు ఐదు రెట్లు పెంచారు: ఉత్తమ్

తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్​ కుమార్​ రెడ్డి విమర్శించారు. పెద్ద రాష్ట్రాలతో సమానంగా అప్పులు ఉన్నాయని ఆయన తెలిపారు. రాష్ట్రాల అప్పులపై పార్లమెంట్​లో ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్​ సమాధానమిచ్చారు.

  • సర్వర్‌ల మొరాయింపుతో 'పాస్‌పోర్టు' ఇక్కట్లు

సర్వర్ మొరాయించడంతో అమీర్‌పేట పాస్ పోర్ట్ కార్యాలయం వద్ద దరఖాస్తుదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సాంకేతికలోపం తలెత్తడంతో పాస్ పోర్ట్ కార్యాలయం వద్ద దరఖాస్తు దారులు బారులు తీరారు.

  • అటవీ అధికారులకు పోడు రైతుల మధ్య తోపులాట

భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో అటవీ అధికారులకు పోడు రైతుల మధ్య తోపులాట జరిగింది. పోడు భూములను దున్నటానికి అధికారులు రావడంతో ఉద్రిక్తత నెలకొంది. అక్రమంగా పోడు భూములను స్వాధీనం చేసుకుంటున్నారని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు.

  • ఆ ఎంపీలకు ఏడుగురు సంతానం..

దేశంలో జనాభా నియంత్రణపై మరోసారి చర్చ మొదలైంది. టూ ఛైల్డ్ పాలసీకి మద్దతుగా బిల్లు తీసుకొస్తున్నట్లు భాజపా ఎంపీ ప్రకటించిన నేపథ్యంలో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. మరి, బిల్లు పార్లమెంట్ గడప దాటుతుందా? ఇద్దరికి మించి సంతానం ఉన్న ఎంపీల పరిస్థితి ఏంటి? ప్రభుత్వం దీనిపై ఏమంటోంది?

  • మోదీ సలహాతో డైట్ మార్చిన యువ నేత..

"కాస్త బరువు తగ్గు.." అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన సలహా ఆ యువ నేత జీవనశైలినే మార్చేసింది. ప్రధాని సూచనను సీరియస్​గా తీసుకున్న ఆర్​జేడీ నేత తేజస్వీ యాదవ్.. సన్నబడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అవేంటో మీరూ చూడండి.

  • నలుగురు కాంగ్రెస్​ ఎంపీలపై సస్పెన్షన్​ వేటు

లోక్​సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ధరల పెరుగుదల అంశంపై లోక్‌సభ కార్యకలాపాలకు ఆటంకం కలిగించినందుకు కాంగ్రెస్​కు చెందిన నలుగురు ఎంపీలపై సస్పెన్షన్​ వేటు పడింది. స్పీకర్​ హెచ్చరించినా అనుచిత ప్రవర్తనతో సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తున్న వారిని.. సస్పెండ్ చేయాలని లోక్​సభ తీర్మానించింది.

  • మిక్సీ బ్లేడ్స్​కు పదును తగ్గిందా?

మిక్సీ బ్లేడ్స్​కు పదును తగ్గిందా? చట్నీలు, పొడులు చేస్తుంటే మెత్తగా రావడం లేదా? అయితే.. రాళ్ల ఉప్పు సాయంతో ఇంట్లోనే ఈ సమస్యను పరిష్కరించుకోవచ్చని అంటున్నారు కిచెన్ ఎక్స్​పర్ట్స్​. మిక్సీ జార్​ను సులువుగా ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా చెబుతున్నారు. ఆ వివరాలు తెలుసుకునేందుకు ఈ వీడియో చూసేయండి.

  • బాక్సర్​ లవ్లీనా సంచలన ఆరోపణలు..

ఒలింపిక్స్​ కాంస్య పతక విజేత బాక్సర్​ లవ్లీనా​కు చేదు అనుభవం ఎదురైంది. కామన్వెల్త్​ క్రీడలకు సిద్ధమవుతున్న తనను కొంతమంది అధికారులు మానసికంగా వేధిస్తున్నట్లు ఆరోపణలు చేసింది.

  • కదలలేని స్థితిలో కైకాల.. బైడ్​పైనే కేక్​ కట్​ చేయించిన చిరు

సీనియర్​ నటుడు కైకాల సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను నిర్వహించారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన చేత కేక్​ కట్​ చేయించారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్​మీడియాలో ట్వీట్​ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.