ETV Bharat / city

Telangana News Today: టాప్​న్యూస్ @5PM - topnews in telangana

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

5PM TOPNEWS
5PM TOPNEWS
author img

By

Published : Jul 20, 2022, 5:00 PM IST

  • బియ్యం సేకరణ నిలిపేసిన కేంద్రం..

ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ఇవ్వాల్సిన బియ్యం పంపిణీలో తెలంగాణ ప్రభుత్వం విఫలమైందని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ వెల్లడించింది. అందుకే కేంద్ర ప్రభుత్వం బియ్యాన్ని సెంట్రల్ పూల్‌లోకి సేకరించడాన్ని నిలిపివేసింది.

  • ఆరో తరగతి విద్యార్థిని సూసైడ్.. సీసీ కెమెరాల్లో దృశ్యాలు

హైదరాబాద్​లో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. మూడంతస్తుల భవనంపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన ఎల్బీనగర్ పరిధి చంద్రపురికాలనీలో చోటు చేసుకుంది. విద్యార్థినికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీల్లో రికార్డయ్యాయి.

  • మెట్రో స్టేషన్​లో అమ్మాయి క్రేజీ డాన్స్​..

ఇల్లు, స్కూలు, గుడి, బడి, ఆఫీస్​, రెస్టారెంట్​... ఇలా ప్లేస్​ ఏదైనా పర్లేదు.. ట్రెండింగ్​లో ఉన్న పాటకు నాలుగు స్టెప్పులేశామా.. దాన్ని క్రేజీగా వీడియో తీశామా.. సామాజిక మాధ్యమాల్లో పెట్టేశామా.. ఇది ఇప్పుడు నడుస్తోన్న రీల్స్​ ట్రెండ్​. అలా ట్రెండ్​ ఫాలో అవుతూ.. ట్రెండింగ్​లో ఉన్న పాటకు స్టెప్పులేసిన ఓ అమ్మాయి ఇప్పుడు టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. ఇదంతా ఆమె తీసిన వీడియోనో.. చేసిన డాన్స్​ వల్లో కాదు.. ఇదంతా జరిగిన ప్లేస్​ వల్లే మరి..!!

  • 'మాటలు మాని.. వరద బాధితులను ఆదుకోండి'

గోదావరి వరదలతో జనం అల్లాడుతుంటే వారి గురించి పట్టించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఇతరులపై నెపం నెట్టి తప్పించుకునే యత్నం చేస్తోందని భాజపా నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. మాటలు చెప్పడం మాని వరద బాధితులను ఆదుకోవాలని సర్కార్‌ను డిమాండ్ చేశారు.

  • గాల్లో ఉండగా పగిలిన విమాన అద్దం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

దిల్లీ నుంచి గువాహటి వెళ్తున్న గో-ఫస్ట్​ విమాన అద్దం గాల్లో ఉండగా ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. అత్యవసరంగా జైపుర్​ ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్​ చేశారు.

  • 'ఎన్నో ప్రశ్నలు'.. మహా రాజకీయంపై సీజేఐ అనుమానాలు

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యాలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ పలు అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ వ్యాజ్యాలపై విస్తృత ధర్మాసనం పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.

  • జుబైర్​కు సుప్రీంలో ఊరట..

ప్రముఖ జర్నలిస్ట్ మహమ్మద్ జుబైర్​కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. యూపీలో నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • కంటి 'రెటీనా' సమస్య బారినపడితే.. గుండె జబ్బు వస్తుందా?

కంటి వ్యాధులకూ.. గుండె జబ్బుకు సంబంధం ఏమైనా సంబంధం ఉందా? అంటే అవుననే అంటోంది ఓ అధ్యయనం. వృద్ధుల్లో కొందరికి వచ్చే రెటీనా సమస్యకు గుండె జబ్బుకు మధ్య సంబంధం ఉన్నట్లు తొలిసారిగా గుర్తించింది. దీనిపై నిపుణులు ఏమంటున్నారంటే?

  • స్టాక్​ మార్కెట్లలో ఫుల్​ జోష్​.. సెన్సెక్స్​ 600 ప్లస్​..

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు బుధవారం భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 629 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్లు లాభపడ్డాయి.

  • టికెట్​ రేట్స్​పై దిల్​రాజు క్లారిటీ.. ఇకపై ధర ఎంతంటే?

ఇకపై సినిమా టికెట్​ రేట్లు ఎలా ఉండబోతున్నాయనే విషయమై మాట్లాడారు నిర్మాత దిల్​రాజు. అంతకుముందు టికెట్‌ ధరలపై తానొకటి చెప్తే మీడియాలో మరో రకంగా వచ్చిందని అన్నారు. అలా ఎందుకు జరిగిందో అర్థంకాలేదని చెప్పుకొచ్చారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.