ETV Bharat / city

TOP NEWS: టాప్‌న్యూస్ @ 7PM - 7PM టాప్‌న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

7PM TOPNEWS
7PM TOPNEWS
author img

By

Published : Jul 11, 2022, 7:00 PM IST

మూడు నాలుగు రోజులుగా రాష్ట్రాన్ని వర్షాలు ముసురుకోగా.. పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. అంతలోనే వాతావరణ శాఖ నుంచి మళ్లీ అలర్ట్​ రానే వచ్చింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.

  • భద్రాచలం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

గోదారమ్మ ఉగ్రరూపం మరింత ఉధృతమవుతోంది. ఎగువన కురుసున్న భారీవర్షాలు, కదం తొక్కిన ఉపనదుల వరదను కలుపుకొని భద్రాచలం వద్ద భీకరంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

  • లీవ్​ ఇవ్వలేదని జవాన్​ సూసైడ్​..

సెలవు ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ జవాన్​.. గన్​తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో జరిగింది.

  • కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ సమన్లు..

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి.. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్​ హెరాల్డ్​ కేసులో.. జులై 21న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

  • సీనియర్లు, జూనియర్​ మధ్య వాగ్వాదం.. పదో తరగతి విద్యార్థి మృతి

ఒకే పాఠశాలకు చెందిన సీనియర్లు, జానియర్​ మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. ఓ విద్యార్థి మృతికి దారితీసింది. తీవ్రమైన గాయాలతో బాధిత విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్థరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

  • సూర్య.. సూర్యకుమార్‌.. పేరు గుర్తుపెట్టుకో..

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20 సూర్యకుమార్​ అద్భుత ప్రదర్శనను మాజీలు ప్రశంసిస్తున్నారు. ఇంగ్లాండ్​ కెప్టెన్​ జోరూట్​ కూడా అతడి ఆటకు ఫిదా అయిపోయాడు. ఓ సారి అతడిని ఎవరెవరు ఏమని ప్రశంసించారో చూద్దాం..

  • 'ఉబర్' లీక్స్​.. బిజినెస్ ప్రయాణంలో చీకటి రహస్యాలు

ఉబర్ ఫైల్స్ లీకులు.. ఇప్పుడు బిజినెస్​ ప్రపంచాన్ని విస్తుగొలుపుతున్నాయి. కార్యకలాపాల విస్తరణ సమయంలో ఉబర్​ అవకతవకలకు పాల్పడ్డట్లు లీకుల్లో బయటపడింది. ఫ్రాన్స్​ అధ్యక్షుడు మేక్రాన్​తోపాటు యూరోపియన్ కమిషన్.. ఉబర్‌కు నిబంధనలకు విరుద్ధంగా సాయం చేసినట్లు కీలక పత్రాల ద్వారా తెలుస్తోంది. ఇంతకీ లీకైన ఫైల్స్​లో ఏమున్నాయి? ఎలా జరిగింది? ఉబర్​ ఏం చెబుతోంది?

  • 'లైగర్'​ సాంగ్​ రిలీజ్​.. విజయ్ మాస్​ ట్రీట్​ అదిరిందిగా!

విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'లైగర్‌'. తాజాగా ఈ సినిమాలోని తొలి గీతం 'అక్డీ పక్డీ'ని విడుదల చేసింది మూవీటీమ్​. ఇందులోని విజయ్‌ స్పీడ్‌ డ్యాన్స్‌ అందరినీ కట్టిపడేసేలా ఉంది. బీట్‌కు తగ్గట్టు ఆయన వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి.

  • కాళేశ్వరంపై తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు

కాళేశ్వరం నిర్వాసితుల పరిహారం అంశంలో సుప్రీంలో విచారణ మొదలైంది. ప్రాజెక్టు వల్ల నిర్వాసితులైన వారికి ఎంత మొత్తం చెల్లించారో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది.

  • ఎల్లుండి జరగాల్సిన ఈసెట్ వాయిదా.. ఎంసెట్ యథాతథం

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రవేశ పరీక్షలు వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఎల్లుండి జరగాల్సిన ఈసెట్ వాయిదా వేశారు.

  • రానున్న 3 రోజుల్లో మోస్తరు వానలు..

మూడు నాలుగు రోజులుగా రాష్ట్రాన్ని వర్షాలు ముసురుకోగా.. పలు ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే కాస్త తగ్గుముఖం పడుతోంది. అంతలోనే వాతావరణ శాఖ నుంచి మళ్లీ అలర్ట్​ రానే వచ్చింది. రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.

  • భద్రాచలం వద్ద గోదారమ్మ ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ

గోదారమ్మ ఉగ్రరూపం మరింత ఉధృతమవుతోంది. ఎగువన కురుసున్న భారీవర్షాలు, కదం తొక్కిన ఉపనదుల వరదను కలుపుకొని భద్రాచలం వద్ద భీకరంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 53 అడుగులకు చేరడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

  • లీవ్​ ఇవ్వలేదని జవాన్​ సూసైడ్​..

సెలవు ఇవ్వలేదని మనస్తాపం చెందిన ఓ జవాన్​.. గన్​తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాద ఘటన రాజస్థాన్​లోని జోధ్​పుర్​లో జరిగింది.

  • కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి ఈడీ సమన్లు..

కాంగ్రెస్​ అధినేత్రి సోనియా గాంధీకి.. ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ తాజాగా మరోసారి సమన్లు జారీ చేసింది. నేషనల్​ హెరాల్డ్​ కేసులో.. జులై 21న విచారణకు హాజరుకావాలని పేర్కొంది.

  • సీనియర్లు, జూనియర్​ మధ్య వాగ్వాదం.. పదో తరగతి విద్యార్థి మృతి

ఒకే పాఠశాలకు చెందిన సీనియర్లు, జానియర్​ మధ్య జరిగిన చిన్నపాటి గొడవ.. ఓ విద్యార్థి మృతికి దారితీసింది. తీవ్రమైన గాయాలతో బాధిత విద్యార్థిని ఆసుపత్రికి తీసుకెళ్లినా.. అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్థరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ విషాద ఘటన ఛత్తీస్​గఢ్​లో జరిగింది.

  • సూర్య.. సూర్యకుమార్‌.. పేరు గుర్తుపెట్టుకో..

ఇంగ్లాండ్​తో జరిగిన మూడో టీ20 సూర్యకుమార్​ అద్భుత ప్రదర్శనను మాజీలు ప్రశంసిస్తున్నారు. ఇంగ్లాండ్​ కెప్టెన్​ జోరూట్​ కూడా అతడి ఆటకు ఫిదా అయిపోయాడు. ఓ సారి అతడిని ఎవరెవరు ఏమని ప్రశంసించారో చూద్దాం..

  • 'ఉబర్' లీక్స్​.. బిజినెస్ ప్రయాణంలో చీకటి రహస్యాలు

ఉబర్ ఫైల్స్ లీకులు.. ఇప్పుడు బిజినెస్​ ప్రపంచాన్ని విస్తుగొలుపుతున్నాయి. కార్యకలాపాల విస్తరణ సమయంలో ఉబర్​ అవకతవకలకు పాల్పడ్డట్లు లీకుల్లో బయటపడింది. ఫ్రాన్స్​ అధ్యక్షుడు మేక్రాన్​తోపాటు యూరోపియన్ కమిషన్.. ఉబర్‌కు నిబంధనలకు విరుద్ధంగా సాయం చేసినట్లు కీలక పత్రాల ద్వారా తెలుస్తోంది. ఇంతకీ లీకైన ఫైల్స్​లో ఏమున్నాయి? ఎలా జరిగింది? ఉబర్​ ఏం చెబుతోంది?

  • 'లైగర్'​ సాంగ్​ రిలీజ్​.. విజయ్ మాస్​ ట్రీట్​ అదిరిందిగా!

విజయ్‌ దేవరకొండ - పూరి జగన్నాథ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పాన్‌ ఇండియా చిత్రం 'లైగర్‌'. తాజాగా ఈ సినిమాలోని తొలి గీతం 'అక్డీ పక్డీ'ని విడుదల చేసింది మూవీటీమ్​. ఇందులోని విజయ్‌ స్పీడ్‌ డ్యాన్స్‌ అందరినీ కట్టిపడేసేలా ఉంది. బీట్‌కు తగ్గట్టు ఆయన వేసిన స్టెప్పులు అదిరిపోయేలా ఉన్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.