ETV Bharat / city

TOP NEWS: టాప్ న్యూస్ @ 9PM - 9PM టాప్ న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9pm topnews
9pm topnews
author img

By

Published : Jul 2, 2022, 8:58 PM IST

  • రాబోయే ఎన్నికలే లక్ష్యంగా భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు..

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు హెచ్​ఐసీసీ వేదికగా కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ, జేపీ నడ్డా సారథ్యంలో భేటీ నడుస్తోంది. ఈసమావేశాల్లో 2024 ఎన్నికల్లో తెలంగాణాతో పాటు వివిధ రాష్ట్రాల్లో భాజపాను అధికారంలోకి తీసుకురావడం.. ప్రధాని మోదీ ఎనిమిదేళ్ల పాలన, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

  • 'ఒక వ్యక్తి చెబితే 135 కోట్లమంది వినాలా?.. ఇదేనా ప్రజాస్వామ్యం?'

హైదరాబాద్​లోని జలవిహార్​లో తెరాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్​ సిన్హా పాల్గొన్నారు. తనకు సంపూర్ణ మద్దతు ప్రకటించిన తెరాసకు ధన్యావాదాలు తెలిపారు. చాలారోజులుగా కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామన్న సిన్హా.. రాష్ట్రపతి ఎన్నిక తర్వాత కూడా కొనసాగిస్తామని తెలిపారు.

  • ఇక్కడ సర్కారు కూలిస్తే.. అక్కడ వారిని గద్దె దింపుతాం: కేసీఆర్​

మహారాష్ట్ర మాదిరిగా తెలంగాణలోనూ ప్రభుత్వాన్ని కూలదోస్తామని ఓ కేంద్రమంత్రి అంటున్నారని.. వారు ఇక్కడ సర్కారు కూలిస్తే తాము దిల్లీలో వారిని గద్దె దింపుతామని సీఎం కేసీఆర్​ హెచ్చరించారు. తెలంగాణ కోసం ప్రజలు 60 ఏళ్లు పోరాటం చేశారని.. మరో పోరాటానికి వెనకాడరని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

  • మళ్లీ భగ్గుమన్న విభేదాలు.. రేవంత్​పై జగ్గారెడ్డి నిప్పులు..

"అందరిది ఓ గొడవైతే.. ఆయనది మరో గొడవ" అన్నట్టుంది కాంగ్రెస్​ పరిస్థితి. రాష్ట్రంలో హాట్రిక్​ కొట్టాలని తెరాస.. ఈసారి ఎలాగైన అధికారం దక్కించుకోవాలని భాజపా శతవిధాల ప్రయత్నిస్తుంటే.. కాంగ్రెస్​ మాత్రం అంతర్గత విభేదాలతో ఆయాసపడుతోంది.

  • డేంజర్ బెల్స్.. 516 కరోనా కేసులు నమోదు

రాష్ట్రంలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. రాష్ట్రంలో తాజాగా 500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొత్తగా 516 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా నుంచి మరో 434 మంది బాధితులు కోలుకున్నారు.

  • నుపుర్​ శర్మకు మద్దతుగా పోస్ట్.. కెమిస్ట్​ దారుణ హత్య..

మహ్మద్‌ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన భాజపా మాజీ అధికార ప్రతినిధి నుపుర్‌ శర్మకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టిన మరో వ్యక్తి హత్యకు గురయ్యాడు. మహారాష్ట్ర అమరావతి జిల్లాలో కెమిస్ట్‌ను దుండగులు కత్తితో పొడిచి చంపిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.

  • అప్పుడు యువీ.. ఇప్పుడు బుమ్రా వరల్డ్​ రికార్డ్​..

టెస్టు క్రికెట్‌ చరిత్రలో జస్​ప్రీత్ బుమ్రా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బుమ్రా నిలిచాడు. బర్మింగ్‌హామ్‌ టెస్టులో స్టువర్ట్‌బ్రాడ్ ఒకే ఓవర్‌లో 35 పరుగులు ఇచ్చాడు. ఇందులో 29 పరుగులు చేశాడు బుమ్రా. గతంలో లారా పేరిట ఉన్న 28 పరుగుల రికార్డును అధిగమించాడు.

  • కుబేరులను పెద్దదెబ్బ తీసిన 2022..

ప్రపంచ బిలియనీర్లకు ఈ ఏడాది కలిసి రాలేదు. కేవలం ఆరు నెలల్లోనే 1.4 ట్రిలియన్​ డాలర్ల సంపద ఆవిరైందట. ఉద్దీపనలను ఉపసంహరించడం, వడ్డీరేట్ల పెంపు మొదలైన కారణాల వల్ల ఈ నష్టం వచ్చింది. అయితే సంపద ఎంత కరిగినప్పటికీ వ్యవస్థలో ఆర్థిక అంతరాలు ఏమాత్రం తగ్గలేదు.

  • ఒకే సినిమాలో ప్రభాస్, యశ్.. ప్రశాంత్​ నీల్​ డైరెక్షన్​లోనే!

ప్రభాస్, యశ్.. ఇప్పుడు ట్రెండింగ్​లో పాన్​ ఇండియా స్టార్స్​. ఇప్పుడు ఈ ఇద్దరి సినిమాలకు మామూలు డిమాండ్​ లేదు. ప్రభాస్, యశ్ మూవీస్​ వేరు వేరుగా వస్తేనే.. అభిమానులు థియేటర్లకు క్యూ కట్టేస్తుంటారు. అయితే ఈ ఇద్దరూ ఒకే సినిమాలో నటిస్తే.. దానికి సెన్సేషనల్​ డైరెక్టర్​ ప్రశాంత్​ నీల్​ దర్శకత్వం వహిస్తే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.