ETV Bharat / city

TOP NEWS: టాప్​ న్యూస్ @9 PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

9pm topnews
9pm topnews
author img

By

Published : Jun 27, 2022, 8:59 PM IST

  • యశ్వంత్ సిన్హా నామినేషన్​..

విపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌ వేశారు. ఆ సమయంలో ఆయన వెంట కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌ గాంధీ, మల్లికార్జున్‌ ఖర్గే, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తదితరులు ఉన్నారు.

  • యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వడానికి కారణమదే: మంత్రి కేటీఆర్

తెలంగాణలో జాతీయ సమావేశాలకు వస్తున్న భాజపా నేతలు.... రాష్ట్రానికి ఏమిచ్చారో రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రపతి విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా వేసిన నామినేషన్‌ కార్యక్రమంలో వివిధ పార్టీల నేతలతో కలిసి కేటీఆర్‌ పాల్గొన్నారు.

  • రణరంగంగా పోడురైతుల పాదయాత్ర..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో పోడు రైతులు తలపెట్టిన పాదయాత్ర రణరంగంగా మారింది. దశాబ్దాల తరబడిగా భూ సమస్యలు పరిష్కరించటం లేదంటూ.. రామన్నగూడెం వాసులు ప్రగతిభవన్​కు బయలుదేరారు. పాదయాత్రగా వెళ్తున్న గ్రామస్థులను పోలీసులు అడ్డుకోవటంతో.. తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

  • లోన్‌యాప్స్‌ కేసుల్లో వెలుగులోకి కొత్త కోణం..

రుణ యాప్‌ కేసుల్లో కొత్త కోణం వెలుగు చూసింది. గతంలో రుణాలు తీసుకున్న వారిని నేరగాళ్లు ఆకర్షిస్తున్నారు. అవసరం లేకపోయినా గతంలో బాధితుల ఖాతాల్లో నగదు జమ చేసి... తర్వాత నిర్వాహకుల వేధింపులకు పాల్పడ్డారు. రుణ గ్రహీతలు, స్నేహితులకు నగ్న ఫొటోలు పంపుతున్న నేరగాళ్లు... రుణ గ్రహీతలు డబ్బు కట్టనందున మీరు కట్టాలని స్నేహితులను వేధిస్తున్నారు.

  • బంకుల్లో నో స్టాక్​ బోర్డులు.. రాజధానిలో ఎందుకిలా..?

హైదరాబాద్​లోని పెట్రోల్ బంకుల్లో వాహనదారుల క్యూలు దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా నో స్టాక్​ బోర్టులే స్వాగతం పలుకుతున్నాయి. కార్యాలయాలకు వెళ్లే సమయాల్లో బంకుల్లో పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • అగ్నిపథ్​కు విశేష స్పందన.. 4 రోజుల్లో 94 వేల దరఖాస్తులు

అగ్నివీరుల నియామకానికి భారత వాయుసేన విడుదల చేసిన నోటిఫికేషన్​కు మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు 94 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. మరోవైపు, విపక్షాలు అగ్నిపథ్​పై విమర్శలు ఎక్కుపెట్టాయి.

  • సోనియా వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచారం కేసు

సోనియా గాంధీ వ్యక్తిగత కార్యదర్శిపై అత్యాచార ఆరోపణలు వచ్చాయి. ఉద్యోగం ఆశజూపి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని అతనిపై ఓ మహిళ కేసు పెట్టింది.

  • డబ్బులున్నా లోన్ కట్టలేకపోయిన రష్యా​..

ప్రపంచంలో బలమైన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా చెప్పుకునే రష్యా.. 104 ఏళ్ల తర్వాత తొలిసారి రుణ చెల్లింపులో విఫలమైంది. రష్యా దగ్గర రుణ చెల్లింపులకు తగినన్ని నిల్వలు ఉన్నా.. ఆంక్షల కారణంగా అంతర్జాతీయ రుణదాతలకు 100 మిలియన్ల డాలర్లు చెల్లించలేకపోయింది.

  • స్టాక్​ మార్కెట్లకు లాభాలు.. సెన్సెక్స్​ 456 ప్లస్​

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్ఛేంజీ- సెన్సెన్స్​ 456 పాయింట్లు వృద్ధి చెంది 53 వేల 184 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్ఛేంజీ- నిఫ్టీ 132 పాయింట్లు మెరుగుపడి 15 వేల 832 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయంగా సానుకూల పరిస్థితులు, ఆసియా, ఐరోపా మార్కెట్లు లాభాల్లో ఉండటం దేశీయ మార్కెట్లను ప్రభావితం చేసింది.

  • అంతర్జాతీయ క్రికెట్​కు ఇంగ్లాండ్​ కెప్టెన్​ గుడ్​బై..

ఇంగ్లాండ్​ కెప్టెన్​ ఇయాన్ మోర్గాన్​ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఫామ్​ కోల్పోయి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో వికెట్​ కీపర్​ జాస్​ బట్లర్​ బాధ్యతలు తీసుకోనున్నాడని అంటున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.