ETV Bharat / city

టాప్ న్యూస్ @ 3PM - తెలంగాణ సమాచారం

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in telangana
టాప్ న్యూస్ @3PM
author img

By

Published : Apr 24, 2022, 3:00 PM IST

  • 'కశ్మీర్​ కొంత పంథాలో అభివృద్ధి'

PM Modi Jammu: 370వ అధికరణ రద్దుతో జమ్ముకశ్మీర్​లో ప్రజాస్వామ్యం క్షేత్రస్థాయికి చేరిందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ ప్రాంతంలో అభివృద్ధికి ఊపునిచ్చేలా పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. దీనివల్ల స్థానిక యువతకు పెద్దఎత్తున ఉద్యోగాలు లభిస్తాయని ఆదివారం జమ్మూ పర్యటన సందర్భంగా పేర్కొన్నారు.

  • ఎంపీ నవనీత్​ కౌర్​ దంపతులకు షాక్..!

Hanuman Chalisa Row: హనుమాన్ చాలీసా వివాదంలో ఎంపీ నవనీత్​ కౌర్ దంపతులకు 14 రోజుల జుడీషియల్ కస్టడి విధించింది బాంద్రా మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసం వద్ద హనుమాన్ చాలీసా చదువుతాననే కౌర్ ప్రకటనతో శనివారం దుమారం రేగిన నేపథ్యంలో వారిని పోలీసులు అదే రోజు అరెస్టు చేశారు.

  • కళ్లు కనిపించకపోయినా గోల్డ్ మెడల్​..!

అన్ని రకాల సదుపాయాలు, అవయవాలు ఉండికూడా విద్యను నిర్లక్ష్యం చేస్తున్న ఈ రోజుల్లో.. కళ్లు కనపడకున్నా కష్టపడి చదువుకొని బంగారు పతకాన్ని సాధించాడు కర్ణాటకకు చెందిన అన్విత్​ కుమార్​. విశ్వవిద్యాలయ చరిత్రలోనే అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థిగా నిలిచి ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు​. మరోవైపు.. 75 ఏళ్ల వయసులో పీహెచ్​డీ పూర్తి చేశారు ఓ మహిళ.

  • మంత్రి పదవులు భాజపా వేసిన భిక్షే'

Bandi Sanjay Comments on KCR: హామీలు నెరవేర్చకుండా ఎనిమిదేళ్లుగా తెరాస ప్రభుత్వం కాలయాపన చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​ విమర్శించారు. వరి కొనకుండా కేంద్రంపై నిందలేస్తోందని ధ్వజమెత్తారు. కేసీఆర్ అసత్య వాగ్ధానాలతో విసిగిన జనం, తెరాసను ఎలాగైనా గద్దె దించాలని మండుటెండలో పాదయాత్రకు మద్దతిస్తున్నారన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో పదకొండో రోజు నారాయణపేట జిల్లాలో బండి సంజయ్​ పర్యటించారు.

  • 'పేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం'

Super Speciality hospital at Alwal: హైదరాబాద్​ నలువైపులా సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసిన నేపథ్యంలో ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలిలో ఇప్పటికే టిమ్స్​ అందుబాటులో ఉండగా సనత్​ నగర్​, అల్వాల్​, ఎల్బీనగర్​ ప్రాంతాల్లో ఆస్పత్రులు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు అల్వాల్​లో సేకరించిన స్థలాన్ని మంత్రులు హరీశ్​ రావు, మల్లారెడ్డి పరిశీలించారు.

  • కండోమ్ లేకుండా సెక్స్.. ఏపీ​ టాప్!

India AIDS statistics: అరక్షిత లైంగిక సంపర్కం కారణంగా భారత్​లో గత పదేళ్లలో 17 లక్షల మందికిపైగా హెచ్​ఐవీ​ బారినపడ్డారు. 3 లక్షల 18వేలకుపైగా కేసులతో ఆంధ్రప్రదేశ్​ ఈ జాబితాలో తొలిస్థానంలో ఉంది. సహ చట్టం కింద చేసిన దరఖాస్తుకు సమాధానంగా జాతీయ ఎయిడ్స్ నివారణ సంస్థ ఈ విషయాలు వెల్లడించింది.

  • మూడు రోజులు.. బీ అలర్ట్​.. ..!

Rains in Telangana: ఉపరితల ద్రోణి దృష్ట్యా రాష్ట్రంలో ఇవాళ ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది.

  • ఆత్మహత్య కేసులో ఎస్సైపై చర్యలు

SI Suspended: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా గణపురంలో యువకుడి ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు వచ్చిన ఎస్సైపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలకు ఉపక్రమించారు. ఎస్సై ఉదయ్‌కిరణ్‌పై కేసు నమోదు చేసి... వీఆర్​కు అటాచ్‌ చేశారు. తదుపరి విచారణ అనంతరం... చర్యలు తీసుకోనున్నారు.

  • తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today: బంగారం, వెండి ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.54వేల 100కుపైగా ఉంది. వెండి ధర కిలో రూ.70వేల దిగువన ఉంది. అంతర్జాతీయంగా క్రిప్టోకరెన్సీల్లో బిట్​ కాయిన్ విలువ పెరిగింది.

  • రెండు ముక్కలైన స్టంప్​

Hasan ali breaks stump: కౌంటీ క్రికెట్​లో పాకిస్థాన్​ ఫాస్ట్​ బౌలర్​ హసన్ అలీ అదరగొట్టాడు. అతడు వేసిన ఓ యార్కర్​ వేగానికి ఏకంగా మిడిల్​ స్టంప్ రెండు ముక్కలైపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్​గా మారింది. ​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.