ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 7PM - తెలంగాణ ప్రధాన వార్తలు

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

top news in Telangana
టాప్ న్యూస్ @ 7PM
author img

By

Published : Mar 12, 2022, 6:58 PM IST

  • ప్రముఖ రచయిత కందికొండ కన్నుమూత

ప్రముఖ సినీగేయ రచయిత కందికొండ యాదగిరి (49) కన్నుమూశారు. వెంగళరావునగర్‌లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో శనివారం మృతి చెందినట్లు వెద్యులు తెలిపారు.

  • సభలో విరిసిన నవ్వులు.. పడిపడి నవ్విన కేటీఆర్​..

telangana Assembly session: బడ్జెట్​ సమావేశాల్లో భాగంగా సభలో "మన ఊరు- మన బడి" కార్యక్రమంపై చర్చ జరిగింది. ఈ క్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతుండగా.. సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. రాష్ట్రంలో పాఠశాలలకు సంబంధించిన నిధుల గురించి మొదలైన చర్చ కాస్తా.. 2009-14 సమయంలోని సభా పరిస్థితులపైకి మళ్లింది. ఈ క్రమంలో భట్టి విక్రమార్క వివరించిన తీరు సభ్యులకు నవ్వు తెప్పించింది.

  • అందుకే ఆ మాత్రలను పడేస్తున్నారు:

Governor Tamilisai visit Bibinagar AIIMS : యాదాద్రి భువనగిరి జిల్లా బీబీ నగర్ ఎయిమ్స్​ను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ సందర్శించారు. 2021 - 2022 ఎంబీబీఎస్ బ్యాచ్ విద్యార్థులకు నిర్వహించిన వైట్ కోర్ట్ సెర్మని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎయిమ్స్ అధికారులు బీబీ నగర్ ఎయిమ్స్ ప్రగతి రిపోర్ట్​ను వీడియో ద్వారా వివరించారు.

  • 'అందుకోసం వక్ఫ్​ బోర్డు స్థలాలిచ్చేందుకు సిద్ధం..'

నూతన పండ్ల మార్కెట్​ నిర్మాణమయ్యే వరకు వ్యాపారుల కోసం తాత్కాలిక మార్కెట్​ నిర్మించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్​ ఓవైసీ కోరారు. అందుకోసం వక్ఫ్​ బోర్డు తరఫున 30 ఎకరాల స్థలం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని సభలో స్పష్టం చేశారు.

  • పోడు రైతుపై అటవీ అధికారుల దాడి

forest officials attack on podu farmer: తమ పొలంలో కందకాలు తవ్వొద్దని చెప్పినందుకు.. ఓ రైతుపై దాడి చేశారు అటవీశాఖ అధికారులు. కార్యాలయానికి తీసుకెళ్లి తీవ్రంగా కొట్టి.. మూత్రం తాగించేందుకు యత్నించారని బాధితులు వాపోయారు. మహబూబాబాద్​ జిల్లా పుట్టల భూపతి గ్రామ శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది.

  • కశ్మీర్​లో సర్పంచ్​పై ఉగ్రదాడి..

attack on sarpanch kashmir: జమ్ము కశ్మీర్​లో సర్పంచ్​లకు పూర్తి భద్రత కల్పిస్తున్నట్లు అక్కడి ఐజీ విజయ్ కుమార్ వెల్లడించారు. అన్ని జిల్లాల ప్రధాన కేంద్రాలలో సురక్షితమైన వసతి సౌకర్యాలు అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, శనివారం మరో సర్పంచ్​పై దాడి జరిగింది.

  • ల్యాండింగ్​లో అపశృతి

Flight skids off runway: ఎయిర్​పోర్ట్​లో ల్యాండ్ అయ్యే క్రమంలో ఓ విమానం రన్​వే పైనుంచి పక్కకు జరిగింది. జబల్​పుర్​ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో విమానంలో 55 మంది ప్రయాణికులు ఉన్నారు.

  • ఆరేళ్ల బాలికపై అత్యాచారం

UP MINOR RAPE: ఉత్తర్​ప్రదేశ్​లో ఆరేళ్ల బాలికపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. పోలీసులు ఆ వ్యక్తిని పట్టుకునేందు వెళ్లగా.. వారిపై కాల్పులు జరిపాడు.

  • 'ఆంక్షలు ఎత్తివేయకపోతే.. ఐఎస్​ఎస్​ కూలిపోవచ్చు!'

అమెరికా, కెనడా, యూరప్ దేశాల నుంచి రష్యా కఠిన ఆంక్షలు ఎదుర్కొంటోంది. అవి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం మీద కూడా ప్రభావం చూపనున్నట్లు తెలుస్తోంది. వెంటనే ఆంక్షలు ఎత్తివేయాలని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ డైరెక్టర్ దిమిత్రి రోజోజిన్ పిలుపునిచ్చారు

  • ఝులన్​ గోస్వామి రికార్డు

Jhulan Goswami: టీమ్​ఇండియా సీనియర్​ ఫాస్ట్​ బౌలర్​ ఝులన్​ గోస్వామి మరో అరుదైన ఘనత సాధించింది. ఐసీసీ మహిళల ప్రపంచకప్​లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్​గా రికార్డు సృష్టించింది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.