ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Feb 20, 2022, 2:59 PM IST

  • మహారాష్ట్ర సీఎంతో కేసీఆర్​ లంచ్‌ భేటీ..

CM KCR Mumbai Tour : దేశ రాజకీయాల్లో సమూలమార్పే ధ్యేయంగా... కేంద్రంలోని భాజపా సర్కార్‌పై గళం విప్పుతున్న సీఎం కేసీఆర్... ముంబయికి చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లిన ఆయన... మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే నివాసానికి వెళ్లారు. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేసీఆర్‌, ఉద్ధవ్‌ ఠాక్రే ఇరువురు లంచ్ చేస్తూ... చర్చిస్తున్నారు.

  • రాజీనామాను వాయిదా వేసుకుంటున్నా..

Jaggareddy: శుక్రవారం సాయంత్రం ఉన్నపళంగా కాంగ్రెస్​ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించిన జగ్గారెడ్డి.. మళ్లీ రాజీనామాను వాయిదా వేసుకుంటున్నట్లు వెల్లడించారు. 15 రోజులు వేచి చూసి రాజీనామాపై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు.

  • ఇంకో కూటమి దేశంలో రాణించలేదు..

Etela Rajender: ఎన్డీఏ, యూపీఏ కూటమి మినహా మరే ఇతర కూటమి దేశంలో రాణించలేవని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్​ తెలిపారు. గతంలోనే ఫెడరల్​ ఫ్రంట్​ అని చెప్పి సీఎం విఫలమయ్యారని ఆయన ఎద్దేవా చేశారు.

  • పంజాబ్, యూపీలో ప్రశాంతంగా పోలింగ్..

యూపీ, పంజాబ్​లో పోలింగ్​ ప్రశాంతంగా జరుగుతోంది. ఓటు వేయడానికి అన్ని వయసులవారు ఆసక్తి కనబరుస్తున్నారు. యూపీలో మధ్యాహ్నం ఒంటి గంట వరకు 35.8శాతం పోలింగ్ నమోదైంది. పంజాబ్​లో 34.1శాతం ఓట్లు పోలయ్యాయి.

  • 30 మంది జాలర్లను నిర్బంధించిన పాక్..

Pakistan detains 30 fishermen: అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన భారత్​కు చెందిన 30మంది జాలర్లను పాకిస్థాన్ అదుపులోకి తీసుకుంది. ఐదు పడవలను సీజ్ చేసింది.

  • సముద్రంలో కూలిన పోలీస్ హెలికాప్టర్..

US Police Helicopter Crash: పోలీస్ హెలికాప్టర్ సముద్రంలో కుప్పకూలిన ఘటనలో ఓ అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. మరో పోలీస్ అధికారికి తీవ్ర గాయాలయ్యాయి.

  • ఎన్నికల తర్వాత పెట్రోల్​ మంట..

Fuel prices in India: ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత వినియోగదారులకు పెట్రో షాక్‌ తగలనుందా? మార్చిలో లీటర్‌ పెట్రోల్‌ ధర 8 రూపాయలకుపైగా పెరగనుందా? రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం జరిగితే పెట్రోల్‌ ధర రెట్టింపుకానుందా? అవుననే అంటున్నారు మార్కెట్‌ విశ్లేషకులు.

  • బంగారం ధరకు ఇక రెక్కలే..

Gold prices may skyrocket: ఈ ఏడాది ద్వితీయార్ధంలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.55 వేల మార్కు దాటనుందా? మరో 3 నెలల్లోనే రూ.52 వేలకు చేరనుందా? రష్యా- ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్తతలు పసిడి ధర పెరుగుదలకు కారణమవుతున్నాయా? అవుననే అంటున్నాయి బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు.

  • దుబాయ్​ ఛాంపియన్​షిప్​ విజేతగా జెలేనా..

Dubai Tennis Championships trophy: దుబాయ్​ టెన్నిస్​ ఛాంపియన్​షిప్ ఫైనల్​లో ​విజయం సాధించి ట్రోఫీని అందుకుంది ల్యాట్వియన్​ టెన్నిస్​ క్రీడాకారిణి జెలేనా ఒస్టాపెంకో. కెరీర్​లో ఇది ఆమెకు ఐదో టైటిల్​ కాగా.. ఈ విజయంతో ర్యాంకింగ్స్​లో తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.

  • 'లైగర్'​ ఓ పాప్​కార్న్​ మసాలా సినిమా..

Ananya Panday Liger: 'లైగర్'​తో టాలీవుడ్​కు పరిచయం కానున్న బాలీవుడ్​ నటి అనన్య పాండే విజయ్​ దేవరకొండపై ప్రశంసలు కురిపించింది. విజయ్​ ఓ అద్భుతమైన కోస్టార్​ అని.. కానీ చాలా సిగ్గరి అంటూ చెప్పుకొచ్చింది. 'లైగర్​' ఓ పాప్​కార్న్​ మసాలా సినిమా అని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.