ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Feb 19, 2022, 2:58 PM IST

  • వనదేవతలకు చివరిరోజు భక్తుల మొక్కులు..

Medaram jathara 2022: మేడారం మహా జనజాతర విజయవంతమైందని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, ఇంద్రకరణ్‌రెడ్డిలు స్పష్టం చేశారు. ఈ సారి దాదాపు కోటి 30 లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి అంచనా వేశారు. మరోవైపు వన జాతర ముగింపు ఘట్టానికి చేరుకుంది.

  • రాజీనామాపై జగ్గారెడ్డి క్లారిటీ..

Jaggareddy Clarity on Resignation: టీకప్పులో తుఫాన్‌లా జగ్గారెడ్డి రాజీనామా వ్యవహారం ముగిసింది. కాంగ్రెస్‌కు రాజీనామా నిర్ణయం నుంచి జగ్గారెడ్డి వెనక్కి తగ్గారు. పార్టీకి రాజీనామా చేయ‌డం లేద‌ని పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ అధిష్ఠానం కూడా రాజీనామా చేయ‌వ‌ద్దని కోరింద‌ని.. ఇందువ‌ల్ల చేయ‌డం లేద‌ని ఆయ‌న స్పష్టం చేశారు.

  • ఆపిన వాళ్లే అంబులెన్స్​కు దారి చూపారు..

Protestor's helped the ambulance to cross the road: ప్రమాదాలు జరుగుతున్నాయంటూ రహదారిపై ఆందోళనకు దిగిన స్థానికులే.. తమ వల్ల ఇబ్బంది పడిన ఓ అంబులెన్స్‌కు దారిచూపి మానవత్వం చాటుకున్నారు. అంతేకాదు ఏకంగా అంబులెన్స్‌ను పైకెత్తి డివైడర్‌ను దాటించి పంపించి శభాష్‌ అనిపించుకున్నారు.

  • ఆసియాలో అతిపెద్ద బయో సీఎన్​జీ ప్లాంట్..

Bio CNG plant in Indore: ఇండోర్‌లో ఆసియాలో అతిపెద్ద (బయో-సీఎన్‌జీ) ప్లాంట్‌ను ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. వ్యర్థ రహిత నగరాల నిర్మాణమే లక్ష్యంగా 550 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్​ను వర్చువల్​గా ప్రారంభించారు.

  • అసెంబ్లీలో ఎమ్మెల్యేల అంత్యాక్షరి..

KARNATAKA MLAS PROTEST IN ASSEMBLY: కర్ణాటక అసెంబ్లీలో రెండో రోజూ హైడ్రామా నడిచింది. జాతీయ జెండానుద్దేశించి ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్​ ఎమ్యెల్యేలు నిరసన కొనసాగించారు. ఎమ్యెల్యేలు శుక్రవారం రాత్రి కూడా అసెంబ్లీలోనే జాగారం చేశారు.

  • ఒక్క మొక్కతో 24కేజీల పసుపు దిగుబడి..

Uttarakhand Farmer 24KG Turmeric: ఉత్తరాఖండ్​కు చెందిన రైతు నరేంద్ర మెహ్రా పసుపు సాగులో చరిత్ర సృష్టించారు. ఒక్క మొక్క ద్వారా 24 కిలోల పసుపును పండించారు. ఒకే మొక్కకు 24 కిలోల పసుపు పండించడం దేశంలోనే తొలిసారని చెప్పారు మెహ్రా.

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్.. ఓ ఉగ్రవాది హతం..

Kashmir Encounter: జమ్ము కశ్మీర్​లోని షోపియాన్​ జిల్లాలో సైనికులు, ఉగ్రవాదులు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్​కౌంటర్​లో ఇద్దరు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఒక గుర్తు తెలియని ఉగ్రవాది బలగాల చేతిలో హతమయ్యాడు.

  • భారత్‌పై మళ్లీ దావూద్‌ గురి..

Dawood Ibrahim Targets India: గ్యాంగ్​స్టర్​, అండర్‌ వరల్డ్‌ డాన్‌ దావూద్​ ఇబ్రహీం భారత్​పై మళ్లీ గురిపెట్టినట్లు సమాచారం. దావూద్‌, తన ప్రత్యేక యూనిట్‌తో కలిసి భారత్‌ వ్యాప్తంగా భీకర దాడులకు ప్రణాళికలు రచిస్తోన్నట్లు ఎన్‌ఐఏ పేర్కొంది. బాంబు పేలుళ్లు, కాల్పులతో దేశంలో విధ్వంసం సృష్టించాలని కుట్రలు పన్నుతున్నట్లు తెలిపింది.

  • టీ20 వరల్డ్​కప్​ కోసం టీమ్​ఇండియా సన్నద్ధం..

Panth T20worldcup: మరో ఎనిమిది నెలల్లో జరగనున్న టీ20 వరల్డ్​కప్​ కోసం బలంగా తయారవ్వడానికి టీమ్​ఇండియా తమకు అందుబాటులో ఉన్న ప్రతి అంశాన్ని పరిశీలిస్తోందని అన్నాడు బ్యాటర్​ పంత్​. వెంకటేశ్​ అయ్యర్​, హర్షల్​ పటేల్​ మంచి ఆటగాళ్లని ప్రశంసించాడు.

  • ఓటీటీ బిగ్‌బాస్‌లో కంటెస్టెంట్లు వీళ్లే..

OTT Bigboss show: 'బిగ్‌బాస్‌ నాన్‌స్టాప్‌ ఫస్ట్‌లుక్‌' పేరుతో ఓ స్పెషల్​ వీడియోను పోస్ట్​ చేసింది డిస్నీ+హాట్‌స్టార్‌. ఇందులో కొత్త బిగ్‌బాస్‌ హౌస్‌ను కూడా చూపించారు. మొత్తం ఎంత మంది పోటీదారులు పాల్గొనబోతున్నారంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.