ETV Bharat / city

Top news: టాప్ న్యూస్ @ 3PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు..

TOP NEWS IN TELANGANA
TOP NEWS IN TELANGANA
author img

By

Published : Feb 8, 2022, 3:02 PM IST

  • తెలంగాణ, ఏపీ ఇప్పటికీ నష్టపోతున్నాయి..

Modi on Andhra Pradesh Bifurcation : ఆంధ్రప్రదేశ్‌ విభజన సమయంలో కాంగ్రెస్ అనుసరించిన తీరువల్లే... ఇప్పటికీ తెలుగు రాష్ట్రాలు నష్టపోతున్నాయని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై... చర్చకు సమాధానమిచ్చిన ప్రధాని.. కాంగ్రెస్‌ సహా ప్రతిపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

  • మురిసిపోతోన్న ముచ్చింతల్​..

Ramanuja Sahasrabdi Utsav : ముచ్చింతల్​లో శ్రీరామనుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. ఇవాళ రథసప్తమి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పలు రాష్ట్రాలకు చెందిన 450 మంది వేదపండితులు, జీయర్‌స్వాములు ఈ క్రతువులో పాల్గొన్నారు.

  • ఆ 4 జిల్లాల్లో తలసేమియా ఉద్ధృతి..

Thalassemia disease facts : జన్యుపరమైన లోపం చిన్నారులకు శాపంగా మారుతోంది. ఆడిపాడే బాల్యాన్ని బలి తీసుకుంటోంది. తల్లిదండ్రులకు శోకం మిగుల్చుతోంది. తలసేమియా గురించే ఇదంతా. రాష్ట్రంలో ఈ వ్యాధి ప్రభావం ఎంత అనేదానిపై నిపుణుల మాటేంటి?

  • రైతులకు ఐదేళ్లు ఉచిత విద్యుత్​..

UP BJP Manifesto: ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా భాజపా మేనిఫెస్టో విడుదల చేసింది. అన్నదాతలకు ఉచితంగా ఐదేళ్ల పాటు విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది. వరి, గోధుమలపై కనీస మద్దతు ధర పెంచుతామని తెలిపింది.

  • ముదిరిన హిజాబ్​ వివాదం..

Hijab-saffron row: కర్ణాటక శివమొగ్గలో హిజాబ్​ వివాదం మరింత ముదిరింది. ఓ కళాశాల ఆవరణలో కాషాయ శాలువా, హిజాబ్​ మద్దతుదారులు ఒకరిపై ఒకరు రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

  • పెన్షన్​ కోసం లింగ మార్పిడి..

Man Changes Gender for retirement: స్విట్జర్లాండ్​లో ఓ వ్యక్తి చేసిన పని ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశమైంది. ఒక ఏడాది ముందుగా రిటైర్ అయ్యి, పెన్షన్​ పొందడానికి ఏకంగా తనను తాను మహిళగా ప్రకటించుకున్నాడు. అది కూడా అక్కడి ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టంలోని లోపాన్ని ఆసరాగా చేసుకొని. అంతేగాకుండా రికార్డుల్లో పేరు మార్పించాడు. ఎలా చేశాడో తెలుసుకోవాలంటే స్టోరీ చదవాల్సిందే.

  • హ్యుందాయ్ సారీపై కేంద్రం కీలక వ్యాఖ్యలు..

Hyundai apology: వివాదాస్పద ట్వీట్​ చేసినందుకు హ్యుందాయ్ సంస్థ క్షమాపణలు బలంగా చెప్పాల్సిందని కేంద్ర వాణిజ్యమంత్రి పీయూష్​ గోయల్​ అన్నారు. ఈ విషయాన్ని సంస్థ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.

  • ఇకపై ఇది 'టాటా ఐపీఎల్'..

IPL 2022: ఫిబ్రవరి 12, 13 తేదీల్లోనే ఐపీఎల్​ మెగా వేలాన్ని నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు నిర్వాహకులు. ఇకపై దీనిని టాటా ఐపీఎల్​గా వ్యవహరించనున్నారు.

  • డచ్​ సింగర్​ నోట.. శ్రీవల్లి పాట..

ప్రధాన భారతీయ భాషలన్నింటీలో విడుదలైన పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాట ఎంతగానో ఆకట్టుకుంది. మరి.. ఈ పాటని మీరు ఇంగ్లీష్‌లో విన్నారా..? వినకపోతే.. వెంటనే నెదర్లాండ్‌ యువతి.. ఎమ్మా హీస్టర్స్‌ పాడిన పాటను ఓ సారి వినండి. సింగర్‌గా, సాంగ్‌ రైటర్‌గా ఎన్నో వీడియోలు రూపొందిస్తున్న ఈమె యూట్యూబ్‌ ఛానెల్‌లో.. ఇలాంటి మరిన్నె సూపర్‌ హిట్‌ పాటలు వినొచ్చు.

  • మహాభారతం నటుడు ​ కన్నుమూత..

Mahabharat Praveen Kumar: ప్రముఖ అథ్లెట్​, మహాభారతం సీరియల్​ నటుడు​ ప్రవీణ్​ కుమార్​ సోబ్తి(74) కన్నుమూశారు. గుండెపోటుతో తన నివాసంలోనే తుదిశ్వాస విడిచారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.